Friday, 12 March 2021

endi kondalu eletoda ఎండి కొండాలు ఏలేటొడా

 ఎండి కొండాలు ఏలేటొడా..అడ్డబొట్టు శంకరుడా...

జోలే వట్టుకోనీ తిరిగెటోడా .. జగాలను గాసే జంగముడా...

కంఠాన గరళాన్ని దాసినొడా...కంటి చూపుతో సృష్టిని నడిపేటొడా...

ఆది అంతాలు లేనివాడా... అండపిండ బ్రహ్మoడాలూ నిండినోడా...    ఎండి కొండాలు

నాగభరణుడా...నంది వాహనుడా..
కేదారినాధుడా.. కాశీవిశ్వేశ్వరుడా..!!
భీమా శంకరా..ఓం కారేశ్వరా..
శ్రీ కాళేశ్వరా.. మా రాజరాజేశ్వరా...!!

||ఎండి కొండాలు ఏలేటొడా..||

పాలకాయ గొట్టేరే పాయసాలు వండేరే
పప్పూ బెల్లంగలిపి పలరాలు పంచేరే "2"
గండాదీపాలు ఘనముగా వెలిగించేరే..
గండాలు పాపమని పబ్బతులు పట్టేరే.. "2"
లింగానా రూపాయి..తంబాన కోడేను..కట్టినా వారికి సుట్టానీవే...
తడిబట్ట తానాలు.. గుడి సుట్టు దండాలు..మొక్కిన వారికీ ... దిక్కు నీవేలే...

ఎములాడ రాజన్న శ్రీశైల మల్లన్న ఏ పేరున పిలిసిన గాని పలికేటి దేవుడవే "2"
కోరితే కొడుకులనిచ్చి అడిగితే ఆడబిడ్డలనిచ్చే తీరు తీరు పూజాలనొందే మా ఇంటి దేవుడవే

||ఎండి కొండాలు ఏలేటొడా..||

నీ ఆజ్ఞా లేనిదే చీమైనా గుట్టదే
నరులకు అందని నీ లీలలు సిత్రాలులే "2"
కొప్పులో గంగమ్మా పక్కన పార్వతమ్మ
ఇద్దరు సతుల ముద్దుల ముక్కంటీశ్వరుడవే "2"
నిండొక్క పొద్దులూ.. దండి నైవేద్యాలు..మనసారా నీ ముందు పెట్టినమే...
కైలాసావాసుడా.. కరుణాలాదేవుడా...కరుణించమని నిన్నూ.. వేడుకుంటామే..

త్రిలోక పూజ్యూడా.. త్రిశూల ధారుడా..పంచ భూతాలకు అధిపతివి నీవురా "2"
శరణని కొలిచినా.. వరములనిచ్చే దొరా..అభిషేకప్రియుడా అద్వైత్వా భాస్కరుడా ..
దేవాను దేవుళ్లు మెచ్చినొడా.. ఒగ్గూ జెగ్గుల పూజలు అందినోడా అనంత జీవకోటినేలినొడా నీవు ఆత్మాలింగానివె..మాయలోడా...

కోటి లింగాల దర్శనమిచ్చెటోడా ..కురవి వీరన్నవై దరికీ చేరీనోడా....
నటరాజు నాట్యాలు ఆడెటొడా నాగుపామును మెడసుట్టూ సుట్టినోడా...

నాగభరణుడా...నంది వాహనుడా..
కేథారి నాథుడా.. కాశీ విశ్వేశ్వరుడా..!!
భీమా శంకరా..ఓం కారేశ్వరా..శ్రీ కాళేశ్వరా..
మా రాజరాజేశ్వర....!!

||ఎండి కొండాలు ఏలేటొడా..||

3 comments: