Friday 15 September 2023

Bathukamma song - written by me

 రామ రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో

రామ రామానంది రాగమెత్తా రాదు

హరిహరియ ఓ రామ హరియ బ్రహ్మ దేవ

హరియన్న వారికి ఆపదలు రావు

శరణన్న వారికి మరణంబు లేదు

ముందుగా నిను తల్తు    ముత్యాల పోషమ్మ

తర్వాత నిను తల్తు     తల్లిరో పెద్దమ్మ

ఆదిలో నిను తల్తు     అయిలోని మల్లన్న

కోరుతా నిను తల్తు     కొంరెల్లి మల్లన్న

మారునా నిను తల్తు     మావురాలెల్లమ్మ

బోగాన నిను తల్తు     బొంతపల్లీరన్న

శరణన్న వరంగల్లు     శంభుడా నినుతల్తు

భద్రంగ చూడమ్మ    భద్రకాళీ తల్లీ


రామ రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో

రామ రామానంది రాగమెత్తా రాదు


పొద్దున్నే భూదేవి    మొక్కుదునే నిన్ను

బాధల్ల నిను తల్తు    భద్రాద్రి రామన్న

గుండెల్లో నిను తల్తు    కొండగట్టంజన్న

ఎప్పుడూ నినుతల్తు    ఎములాడ రాజన్న

యాదిలో నినుతల్తు    యాదగిరి నర్సన్న

చింతల్లో నినుతల్తు    సమ్మక్కసారక్క

కీర్తిగా నినుతల్తు   కీసరా రామన్న

రామ రామ రామ కోదండ రామ

రామ రామ రామ భద్రాద్రి రామ

రామ రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో

రామ రామానంది రాగమెత్తా రాదు

చల్లగా నను జూడు    చాముండీ మాత

ఉడిపిలో కూసున్నడుయ్యాలో చిన్ని కృష్ణుడమ్మ

శృంగేరి శారదాంబ హంపి విఠలుడమ్మ

మురుడేశ్వరా మమ్ము   దీవించు ఓదేవా

గోకర్ణ ఈశ్వరా  బేలూరు చెన్నయ్య

కోటిలింగేశ్వరా కాపాడి మమ్మేలు

హంపి విరూపాక్ష కరుణించి కాపాడు

మూకాంబికా మాత  మా ముద్దులా తల్లి

అందరినీ తలిశి    గంగా నిను మరిసి

గంగ నిను తల్వంది    గడియ నిలువాలేము

మోతుకూ చెట్టు కింద    పుట్టినావే గంగ

మొలమంటి కాల్వలు    పారినావే గంగ

తంగేడు చెట్టు కింద     పుట్టినావే గంగ

తల్లేడు కాల్వలు    పారినావే గంగ

జిల్లేడు చెట్టు కింద    జిల జిల కాల్వలు

ఊరుమూ చెట్టు కింద    పుట్టినావే గంగ

ఉరిమి ఉరిమి కాల్వలు    పారినావే గంగ

కట్టినావు గంగ    పట్టంచు చీరలు

తొడిగినావు గంగ     ముత్యాల రవికెలు

పూసినావు గంగ    పుట్టెడు బంగారు

పెట్టినావు గంగ    గవ్వల మండ్రాలు

గంగ నువ్వు లేక    గడియ నిల్వ లేము

గంగ నీకు శరణు    తల్లి నీకు శరణు

కాపాడి మమ్మేలు    కైలాస రాణి

ఓరుగల్లొదినెమ్మలు   సిద్దిపేట సిన్నమ్మలు

పాలమూరు పెద్దమ్మలు   మెతుకుసీమ మేనత్తలుయ్యాలో

 హైదరబాదక్కలు  కోరుట్ల కాంతలూ  

తల్లిగారింటికీ   దూరంగా ఉన్నారు

రందీ పడకూ శెల్లె  బాధ పడకూ అక్క

బెంగ్లూరుకొచ్చింది బంగారు బతుకమ్మ

ఉశ్కెల పుట్టిన గౌరి   ఊరూరు తిరిగింది 

పసుపుల పుట్టిన గౌరి పల్లెలన్నీ తిరిగె

తెలంగాణల పుట్టి   బెంగ్లూరుకొచ్చింది

గుమ్మాడి ఆకులను, సిబ్బి మీద పేర్చి 

తంగేడు పూలతో బతుకమ్మలే పేర్చి

సీతజడ పూలతో, దండలే అల్లేరు

బంతిచేమంతులతో  బాగుగా అర్చించి

తీరొక్క పూలతో తల్లినీ పూజించి

పచ్చిపసుపుతోటి గౌరమ్మనే జేశి

కోలాటాలే ఆడి పాటలెన్నో పాడి

సత్తెక్క తెచ్చిన   సత్తు పిండీ సద్ది 

విమలమ్మ తెచ్చినా అటుకుల బెల్లమూ 

మాలిని తెచ్చిన మలియా ముద్దలు 

సరళమ్మ తెచ్చిన బియ్యపు గారెలు

యాదమ్మ తెచ్చిన పులిహోర అన్నమూ

అన్ని సద్దులు పంచి పసుపుకుంకుమలిచ్చి

పోయిరా బతుకమ్మ మళ్లీ రావమ్మ

Thursday 2 March 2023

guess the carnatic song with pictures

guess the carnatic song with pictures - బొమ్మలతో కర్ణాటిక్ పాటలను గుర్తించండి 

1)



2)


3)
 

4)


5)
6)


7)
8)
9)
10)
11)
























Tuesday 1 November 2022

కాంతార వరాహ రూపం లిరిక్స్ Kantara Varaha rupam lyrics

 ఆ… ర…

వరహ రూపమ్ దైవ వరిష్టమ్

వరహ రూపమ్ దైవ వరిష్టమ్

వరస్మిత వదనమ్…

వజ్ర దంతకర రక్షా కవచమ్…


శివ  సంభూత భువి సంజాత

నంబిదవ గింబు కొడువవనీద

సావిర దైవద మన సంప్రీత

బేడుత నిందేవు ఆరాదిసుత…

పపా మగరిస మాగరిస మగరిస

గనిస రిసా సని సరిగమ

పపా మగరిస మాగరిస మగరిస

గనిస రిసా సని సరిగమ

గాగ మపపని దపదనిస నిసా

రీస రిగరిరి దని దప గరి సరి

గరి సరిగమా సారిగమపద మాపా

రిగమప రిగమగా


Wednesday 28 September 2022

Annapurna devi అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించి

 అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా

విశ్వైకనాథుడే విచ్చేయునంటా విశ్వైకనాథుడే విచ్చేయునంటా

నీ ఇంటి ముంగిటా నిలుచుండునంటా

నీ ఇంటి ముంగిటా నిలుచుండునంటా

అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా


నా తనువునో తల్లి నీ సేవ కొరకు నా తనువునో తల్లి నీ సేవ కొరకు

అర్పింతునోయమ్మ పై జన్మ వరకు 

నా తనువునో తల్లి నీ సేవ కొరకు అర్పింతునోయమ్మ పై జన్మ వరకు 

నా ఒడలి అచలాంశ నీ పురము జేరి నా ఒడలి అచలాంశ నీ పురము జేరి

నీ పాద ముద్ర తో నెగడాలి తల్లి నీ పాద ముద్ర తో నెగడాలి తల్లి

అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా, నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా 

నా ఒడలి ఉదకాంశ నీ వీడు చేరి నా ఒడలి ఉదకాంశ నీ వీడు చేరి

నీ పాద పద్మాలు కడగాలి తల్లి 

నా ఒడలి ఉదకాంశ నీ వీడు చేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి 

నా తనువు తేజోంశ నీ గుడికి చేరి నా తనువు తేజోంశ నీ గుడికి చేరి

నీ ముందు దివ్వెగా నిలవాలి తల్లి నీ ముందు దివ్వెగా నిలవాలి తల్లి

నా తనువు మరుదంశ నీ గుడికి చేరి నా తనువు మరుదంశ నీ గుడికి చేరి

నీ చూపు కొసలలో విసరాలి తల్లి

నా తనువు మరుదంశ నీ గుడికి చేరి నీ చూపు కొసలలో విసరాలి తల్లి

నా తనువు గగనాంశ నీ మనికి జేరి నా తనువు గగనాంశ నీ మనికి జేరి

నీ నామ గానాలు మోయాలి తల్లి నీ నామ గానాలు మోయాలి తల్లి

అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా

నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా

నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా

నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా





Friday 9 September 2022

jale జాల పోయినవేమయ్యా ఓహ్ జంగమయ్య రైతే కొట్టిన వేమయ్య

 జాలె పోసినవేమయ్య ఓ జంగమయ్య

రయికే కుట్టినవేమయ్యా

జాలె పోసినవేమయ్య ఓ జంగమయ్య

రయికే కుట్టినవేమయ్యా


జాలె పోసినవేమయ్య ఓ జంగమయ్య

రయికే కుట్టినవేమయ్యా

(జాలె పోసినవేమయ్య ఓ జంగమయ్య

రయికే కుట్టినవేమయ్యా)


జాలవోయ్ జల్దారు వొయ్యి

జాజికాయల పోతవొయ్యి

జాలవోయ్ జల్దారు వొయ్యి

జాజికాయల పోతవొయ్యి


జాలవోయ్ జల్దారు వొయ్యి

జాజికాయల పోతవొయ్యి

జాలవోయ్ జల్దారు వొయ్యి

జాజికాయల పోతవొయ్యి


జాలవోయ్ జల్దారు వొయ్యి

జాజికాయల పోతవొయ్యి

సిగురు జబ్బల సందున

సిలకమూతి జాలవొయ్యి

గునుగు గుబ్బాల సందున

గురిగింజల జాలవొయ్యి


రైకమూడి కట్టుకోన రత్నాల జాలవొయ్యి

ఈపునాయి జెమ్మరెయ్యి పక్కనా మాణిక్యమెయ్యి

తాపనా త్రిశూలమెయ్యి నిన్నువొయ్యి నన్నువొయ్యి

నిలువుటద్దాలువొయ్యి అద్దాముల జూసుకుంటే

ఇద్దరల్లే కలిసేట్టు జాలే జంగమయ్య


జాలే (జంగమయ్య) జాలే (జంగమయ్య)

జాలె పోసినవేమయ్య… ఓ జంగమయ్య

రయికే కుట్టినవేమయ్యా

(జాలె పోసినవేమయ్య ఓ జంగమయ్య

రయికే కుట్టినవేమయ్యా)


ఆహ, జాల కూలి జాలకిత్తు

కుట్టు కూలి కుట్టుకిద్దు

జాల కూలి జాలకిత్తు

కుట్టు కూలి కుట్టుకిద్దు




అబ్బ, జాల కూలి జాలకిత్తు

కుట్టు కూలి టెన్ టు ఫైవ్ కుట్టుకిద్దు

జాల కూలి జాలకిత్తు

కుట్టు కూలి కుట్టుకిద్దు


జాల కూలి జాలకిత్తు

కుట్టు కూలి కుట్టుకిద్దు

అమ్మ నాన్నలు కానకుండా

ఇష్టమొచ్చిన సోటుకొద్దు

బుద్ధిపుట్టినంతసేపు

ముద్దులిస్తా జంగమయ్య

జాలే జాలే జాలే జాలే


జాలె పోసినవేమయ్య… ఓ జంగమయ్య

రయికే కుట్టినవేమయ్యా

(జాలె పోసినవేమయ్య ఓ జంగమయ్య

రయికే కుట్టినవేమయ్యా)


ఆహ, రైక మీద మనసు పెట్టి

రంగురంగుల జాలేవోయ్ రా

(రైక మీద మనసు పెట్టి

రంగురంగుల జాలేవోయ్ రా)

ఆ, రైక మీద మనసు పెట్టి

రంగురంగుల జాలేవోయ్ రా


రైక మీద మనసు పెట్టి

రంగురంగుల టెన్ టు ఫైవ్ జాలేవోయ్ రా

నన్ను తల్సుకోని నవ్వుకుంట జాలవోయ్ రా

ముద్దుల జంగమయ్య ముద్దబంతి పూలుపోయ్ రా


జాలే, జాలే (జంగమయ్య), జా– జంగమయ్య

జాలె పోసినవేమయ్య… ఓ జంగమయ్య

రయికే కుట్టినవేమయ్యా

(జాలె పోసినవేమయ్య ఓ జంగమయ్య

రయికే కుట్టినవేమయ్యా)


జాలె పోసినవేమయ్య… ఓ జంగమయ్య

రయికే కుట్టినవేమయ్యా, ఏమయ్యో

(జాలె పోసినవేమయ్య ఓ జంగమయ్య

రయికే కుట్టినవేమయ్యా)


అయ్యా అంచుకు అద్దాలు పొయ్యి

లంచమిస్తా మంచిగెయ్యి

(అంచుకు అద్దాలు పొయ్యి

లంచమిస్తా మంచిగెయ్యి)


అంచుకు అద్దాలు పొయ్యి

లంచమిస్తా మంచిగెయ్యి

(అంచుకు అద్దాలు పొయ్యి

లంచమిస్తా మంచిగెయ్యి)


అంచుకు అద్దాలు పొయ్యి

లంచమిస్తా మంచిగెయ్యి

ఇవ్వకుంటే పట్టు చెయ్యి

ఇంట్లకు గుంజుకుపొయ్యి

మంచిగా నువు మందలియ్యి

ముద్దు ముచ్చట తీర్చెయ్యి


జాలే జంగమయ్య

జాలే, అబ్బా జాలే

జాలె పోసినవేమయ్యో జంగమయ్య

రయికే టెన్ టు ఫైవ్ కుట్టినవేమయ్యో

జాలె పోసినవేమయ్యో జంగమయ్య

రయికే కుట్టినవేమయ్యో


అయ్యా పచ్చ చీర పైటకొంగు

పట్టుకొని గుంజుకోరా

పచ్చ చీర పైటకొంగు

పట్టుకొని గుంజుకోరా

ఆ, పచ్చ చీర పైటకొంగు

పట్టుకొని గుంజుకోరా


పచ్చ చీర పైటకొంగు

పట్టుకొని గుంజుకోరా

సుక్కవోలే జూసుకోరా

అక్కువదీర్సుకొని

అందమైన జాలేవోయ్ రా


జాలే జంగమయ్య

జాలే, జంగమయ్య

జాలె పోసినవేమయ్యో జంగమయ్య

రయికే కుట్టినవేమయ్యో

జాలె పోసినవేమయ్యో జంగమయ్య

రయికే కుట్టినవేమయ్యో


ఓ, అమ్మతోడు జంగమయ్య

అడిగినందుకు కోపమయ్యా

అమ్మతోడు జంగమయ్య

అడిగినందుకు కోపమయ్యా


అర్రె, అమ్మతోడు జంగమయ్య

అడిగినందుకు కోపమయ్యా

అమ్మతోడు జంగమయ్య

అడిగినందుకు కోపమయ్యా


అమ్మతోడు జంగమయ్య

అడిగినందుకు కోపమయ్యా

సోకైన సిన్నదాని సోపతే మంచిది నాది

పసుపుతాడు కట్టుకోని ఎల్లకాలం ఏలుకోరా

జాలే జాలే జాలే జాలే జాలే జాలే


జాలె పోసినవేమయ్య… ఓ జంగమయ్య

రైకే కుట్టినవేమయ్యా

జాలె పోసినవేమయ్య జంగమయ్య

రైకే కుట్టినవేమయ్యో


Wednesday 7 September 2022

Ememi puvvappune telugu and hindi

 ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయప్పునే గౌరమ్మ..


తంగేడు పువ్వప్పునే గౌరమ్మ.. తంగేడు కాయప్పునే గౌరమ్మ..


తంగేడు చెటుకింద ఆటసిలకలాల పాటసిలకలాల కలికిసిలకలాల


కందుమ్మగుట్టలు  రానువోనడుగులు తీరుద్దరాషలు తారుగోరంటలు..


గనమైన పున్నపూవే గౌరమ్మ.. గజ్జెలా వడ్డాలమే గౌరమ్మ..


ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయప్పునే గౌరమ్మ..


గుమ్మాడి పువ్వప్పునే గౌరమ్మ.. గుమ్మాడి కాయప్పునే గౌరమ్మ..


గుమ్మాడి చెటుకింద ఆటసిలకలాల పాటసిలకలాల కలికిసిలకలాల


కందుమ్మగుట్టలు  రానువోనడుగులు తీరుద్దరాషలు తారుగోరంటలు..


గనమైన పున్నపూవే గౌరమ్మ.. గజ్జెలా వడ్డాలమే గౌరమ్మ..


ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయప్పునే గౌరమ్మ..


రుద్రాశ పువ్వప్పునే గౌరమ్మ.. రుద్రాశ కాయప్పునే గౌరమ్మ..


రుద్రాశ చెటుకింద ఆటసిలకలాల పాటసిలకలాల కలికిసిలకలాల


కందుమ్మగుట్టలు  రానువోనడుగులు తీరుద్దరాషలు తారుగోరంటలు..


గనమైన పున్నపూవే గౌరమ్మ.. గజ్జెలా వడ్డాలమే గౌరమ్మ..


ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయప్పునే గౌరమ్మ..


కాకరా పువ్వప్పునే గౌరమ్మ.. కాకరా కాయప్పునే గౌరమ్మ..


కాకరా చెటుకింద ఆటసిలకలాల పాటసిలకలాల కలికిసిలకలాల


కందుమ్మగుట్టలు  రానువోనడుగులు తీరుద్దరాషలు తారుగోరంటలు..


గనమైన పున్నపూవే గౌరమ్మ.. గజ్జెలా వడ్డాలమే గౌరమ్మ..


ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయప్పునే గౌరమ్మ..


చామంతి పువ్వప్పునే గౌరమ్మ.. చామంతి కాయప్పునే గౌరమ్మ..


చామంతి చెటుకింద ఆటసిలకలాల పాటసిలకలాల కలికిసిలకలాల


కందుమ్మగుట్టలు  రానువోనడుగులు తీరుద్దరాషలు తారుగోరంటలు..


గనమైన పున్నపూవే గౌరమ్మ.. గజ్జెలా వడ్డాలమే గౌరమ్మ..


 ఆపూలు తెప్పించి పూవాన వూదించి..


గంధంల కడిగించి .. కుంకుమలా జాడిచ్చి..


పసుపు గౌరమ్మతో..


నీనోము నీకిత్తుమే గౌరమ్మ.. మా నోము మాకీయవే గౌరమ్మ..


నీనోము నీకిత్తుమే గౌరమ్మ.. మా నోము మాకీయవే గౌరమ్మ..

 

ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయప్పునే గౌరమ్మ..


తంగేడు పువ్వప్పునే గౌరమ్మ.. తంగేడు కాయప్పునే గౌరమ్మ..


తంగేడు చెటుకింద ఆటసిలకలాల పాటసిలకలాల కలికిసిలకలాల


కందుమ్మగుట్టలు  రానువోనడుగులు తీరుద్దరాషలు తారుగోరంటలు..


గనమైన పున్నపూవే గౌరమ్మ.. గజ్జెలా వడ్డాలమే గౌరమ్మ..



एमेमि पुव्वप्पुने गौरम्म.. एमेमि कायप्पुने गौरम्म..

तंगेडु पुव्वप्पुने गौरम्म.. तंगेडु कायप्पुने गौरम्म..

तंगेडु चॆटुकिंद आटसिलकलाल पाटसिलकलाल कलिकिसिलकलाल

कंदुम्मगुट्टलु रानुवोनडुगुलु तीरुद्दराषलु तारुगोरंटलु..

गनमैन पुन्नपूवे गौरम्म.. गज्जॆला वड्डालमे गौरम्म..

एमेमि पुव्वप्पुने गौरम्म.. एमेमि कायप्पुने गौरम्म..

गुम्माडि पुव्वप्पुने गौरम्म.. गुम्माडि कायप्पुने गौरम्म..

गुम्माडि चॆटुकिंद आटसिलकलाल पाटसिलकलाल कलिकिसिलकलाल

कंदुम्मगुट्टलु रानुवोनडुगुलु तीरुद्दराषलु तारुगोरंटलु..

गनमैन पुन्नपूवे गौरम्म.. गज्जॆला वड्डालमे गौरम्म..

एमेमि पुव्वप्पुने गौरम्म.. एमेमि कायप्पुने गौरम्म..

रुद्राश पुव्वप्पुने गौरम्म.. रुद्राश कायप्पुने गौरम्म..

रुद्राश चॆटुकिंद आटसिलकलाल पाटसिलकलाल कलिकिसिलकलाल

कंदुम्मगुट्टलु रानुवोनडुगुलु तीरुद्दराषलु तारुगोरंटलु..

गनमैन पुन्नपूवे गौरम्म.. गज्जॆला वड्डालमे गौरम्म..

एमेमि पुव्वप्पुने गौरम्म.. एमेमि कायप्पुने गौरम्म..

काकरा पुव्वप्पुने गौरम्म.. काकरा कायप्पुने गौरम्म..

काकरा चॆटुकिंद आटसिलकलाल पाटसिलकलाल कलिकिसिलकलाल

कंदुम्मगुट्टलु रानुवोनडुगुलु तीरुद्दराषलु तारुगोरंटलु..

गनमैन पुन्नपूवे गौरम्म.. गज्जॆला वड्डालमे गौरम्म..

एमेमि पुव्वप्पुने गौरम्म.. एमेमि कायप्पुने गौरम्म..

चामंति पुव्वप्पुने गौरम्म.. चामंति कायप्पुने गौरम्म..

चामंति चॆटुकिंद आटसिलकलाल पाटसिलकलाल कलिकिसिलकलाल

कंदुम्मगुट्टलु रानुवोनडुगुलु तीरुद्दराषलु तारुगोरंटलु..

गनमैन पुन्नपूवे गौरम्म.. गज्जॆला वड्डालमे गौरम्म..

आपूलु तॆप्पिंचि पूवान वूदिंचि..

गंधंल कडिगिंचि .. कुंकुमला जाडिच्चि..

पसुपु गौरम्मतो..

नीनोमु नीकित्तुमे गौरम्म.. मा नोमु माकीयवे गौरम्म..

नीनोमु नीकित्तुमे गौरम्म.. मा नोमु माकीयवे गौरम्म..

एमेमि पुव्वप्पुने गौरम्म.. एमेमि कायप्पुने गौरम्म..

तंगेडु पुव्वप्पुने गौरम्म.. तंगेडु कायप्पुने गौरम्म..

तंगेडु चॆटुकिंद आटसिलकलाल पाटसिलकलाल कलिकिसिलकलाल

कंदुम्मगुट्टलु रानुवोनडुगुलु तीरुद्दराषलु तारुगोरंटलु..

गनमैन पुन्नपूवे गौरम्म.. गज्जॆला वड्डालमे गौरम्म..

Saturday 3 September 2022

omanalu aadudaama ఓమనాలు bathukamma song

 ఓమనాలు ఆడుదామా వనిత జానకి

స్వామి ఛాయ గురుడ వచ్చె స్వామి రాఘవ

ముత్యాల ఓమన గుంటల పీటలమర్చుకో ముదియ సీతా మనమిద్దరమూ ఆడుదామటె

రత్నాల ఓమన గుంటల పీటలమర్చుకో రమణిసీతా మనమిద్దరమూ ఆడుదామటె

మాణిక్యాల ఓమన గుంటల పీటలమర్చుకో మగువ సీతా మనమిద్దరమూ ఆడుదామటె

ముత్యాల కౌగిట్లు కదలంగ రాములాడెను

పచ్చల బోణీలు కదలంగ పడతి జానకి

పసిడిలిచ్చీ ఎత్తీపట్టి పడతి జానకి

రాములాడెను

రామలాడంగ సీతా ఇండ్లన్నీ వంచలాయెను, వంగలాయెను

వంగలైనా ఇండ్లన్ని సీతా మళ్లీ పోసెను

దంపతులిద్దరు కూడి యాడిరి

రాములోడెను, సీత గెలిచెను

చాలు నేటికి సీతా ఈ ఆట పీట గట్టుము

పీట గట్టా స్వామీ మిమ్మడుగు దాటనివ్వను

పాటిపందెం తప్పీ ఎవరైనా పారిపోదురా

ఇన్ని నేర్చీ చిన్ననాటి తాటకికి బోధ చేస్తిరా

తపస్సు కాస్తిరా

అయితే మీ మీ చేతిలో ఏమి ఉన్నది

నిండున్న అయోధ్య పట్టణమున్నది, పల్లెలున్నావి

అయితే తీసుకో బిందెల్ల వరహాలు ఆట కోసమే

భరతశత్రఘ్నలక్ష్మణ వారు ముగ్గురు 

వారితో నేనేమనందును

కౌసల్యాకైకేయిసుమిత్ర వారు ముగ్గురు వారితో నేనేమనందును

మూడువేలు చేయు ముత్యాల హారము ముదిత తీసుకో

నాల్గు వేలు చేయు చంద్ర హారాలన్నీ నాతి తీసుకో

ఐదు వేలు చేయు అద్దపుంగురాలు అతివ తీసుకో

ఏడు వేలు చేయు ఏల్ల ఉంగురాలు వెలతి తీసుకో

తొమ్మిది వేలు చేయు తోరంపు కడ్డీలు తోయజాక్షి తీసుకో

పది వేలు చేయు పచ్చాల పతకమ్ము పడతి తీసుకో

దొడ్డ జానవౌదువే, దొడ్డ నేర్పరౌదువే

వేకుంచక లుంగీలు, కుస్మీక పరుపూలు, జవ్వాజి మొలకాలు, గోల్కొండ వాకిల్లు కానుకంపెద

గొల్లదాన్నీ కాకపోతీ చల్లలమ్ముదు

................

కట్టు రాసి ఇచ్చినవారిని అడుగనంపండి, వారిని పిలువనంపండి

అన్నగారూ మమ్ములను పిలువనంపుటకు కారణమేమయ్యా

చైత్రశుధ్ద శ్రీరామనవమినాడు ఆటలాడితి

ఆటలోడిపోయితి

సీతా గెలుచుకున్నది

పల్లేలడుగుచున్నది, పట్టణమడుగుడుచున్నది

అట్లయితే వాళ్లు నలుగురు అక్కచెల్లెండ్లు రాజ్యమేలియు

మనకింత అన్నంబు పెడితే చాలును














Bathukamma songs mouni thammu nadiki

మౌనితమ్మూ నదికి ఉయ్యాలో స్నానమాడగ వచ్చెనుయ్యాలో

వైదేహి శోకంబు . వాల్మీకి ముని వినీ ఉ

చెంత చేరగబోయి . ప్రేమతో పలికించి

అమ్మ మీరెవరమ్మ . అడవిలున్నవు తల్లి

దేవరా మీరెవరు. తెలియగోరెద వేడ్క

వాల్మీకియనువాడను. వనితరో వినవమ్మ

దండములు పదివేలు . దాసురాలను స్వామి

వర్థిల్లవే వనిత . వినిపింపు నీ వార్త

వెలిమితో కాపురము . వేరయా సంకేతముయ్యాలో

తాపసోత్తమ నేను . దశరథ కోడల్ని

గురుకులోత్తమ నేను . జనకపుత్రిని స్వామి

శ్రీరాముని భార్యను . సీతమ్మ యనుదాననుయ్యాలో

కటకట ఇది ఏమి . గర్భవతివి నీవు

ఒక్కదానివి తల్లి . అడవిలున్నవు తల్లి

రాజ్యముల జరిగేది .  మీకు తెలియనిదేమి

చాకలీ మాటలకు . అడవిలో వదిలేసిరుయ్యాలో

అనగ తాపసి వెలసి . వెంటబెట్టుకుపోయి

శిష్యగణులకెల్ల . సీతదేవిని చూపి

ప్రాకటంబుగ ఈమె . లోకమాతని తెలిపె

జనకునీ కూతురు . భూమాత అని తెలిపె

పర్ణశాలలు వేగ . బాగుగా కట్టించె

మునికన్నెలందరూ . మధుసేవ లిచ్చిరీ

రుషి కన్నెలందరూ . స్వాగతంబు పలికె

ప్రతిదినమున చాలా . తేనెఫలములు తెచ్చి

కనికరముతో చాన . కదలిఫలములు తెచ్చి

మక్కువతో చాన . మధుర ఫలములు ఇచ్చి

ఇచ్చుచుండిరి ప్రేమ . ఇట్లు కొన్నినాళ్లు

ప్రసవమయ్యెను బాల . కవలలూ జన్మించె

అది వినీ ఆ మునీ . అధిక సంతసమొందె

జాతకమ్మును రాసి . సీతసన్నిధికేగి

చూసెదా నీ సుతుని . చూసెదా ఇటు తెమ్ము

అనగనే భూజాత . తనయునీ వీక్షించి

మీ తాత వచ్చెను . ఈ రీతి పాడుచూ

చేతులెత్తి భక్తి . చేసెదా దండము

అనుచు ముద్దులు పెట్టి . హస్తయుగము పైన

పట్టి తీసుకు వచ్చి. పాదయుగము పైన

నవ్వుచూ ఆ మునీ . నాయనా అని పిలిచి

ఏ దేశంబూ నీది . ఎక్కడీ కొస్తివి

శ్రీరాము సుతుడవై . ఘోరడవిల పుడ్తివి ఉయ్యాలో

రమణినీ తనయుండు . రామునీ పోలిండు

నీకు శుభము కల్గు . నీ సుతుడు ధన్యుండు

కుశ కుమారయని . కూర్మి పిలువుము తల్లి

లవ కుమారాయని . ప్రేమతో పిలువుమూ

వారి మాటలు వినీ. వాంఛతీరగ మొక్కి

కుశ కుమారాయని . కూర్మి పిలుచూచుండె

లవ కుమారాయని . ప్రేమ పిలుచూచుండె

Monday 15 August 2022

deva ho deva దేవా హో దేవా

 దేవా హో దేవా గణపతి దేవా మంగళం గణేశా

విఘ్న వినాశక జన సుఖ దాయక-2 మంగళం గణేశా
దేవా హో దేవా గణపతి దేవా మంగళం గణేశా-2
విఘ్న వినాశక జన సుఖ దాయక -2 మంగళం గణేశా
దేవా హో దేవా గణపతి దేవా మంగళం గణేశా-2

తూ హీ ఆది తూ హీ హై అంత్,దేవా మహిమా తేరీ అనంత్-2
గజాననం భూత గణాధి సేవితం ఉమా సుతం శోక వినాశ కారకమ్
మంగళం గణేశా
దేవా హో దేవా గణపతి దేవా మంగళం గణేశా-2
విఘ్న వినాశక జన సుఖ దాయక మంగళం గణేశా
దేవా హో దేవా గణపతి దేవా మంగళం గణేశా

తూ హీ శక్తి తూ హీ విధాన్,దేవా తూ హీ వేద పూరాణ్-2
గజాననం భూత గణాధి సేవితం ఉమా సుతం శోక వినాశ కారకమ్
మంగళం గణేశా
దేవా హో దేవా గణపతి దేవా మంగళం గణేశా
విఘ్న వినాశక జన సుఖ దాయక మంగళం గణేశా
దేవా హో దేవా గణపతి దేవా మంగళం గణేశా

Saturday 13 August 2022

Guruguha lessons

 పల్లవి

శరణు సిద్ధి వినాయక |
శరణు విద్యప్రదాయక |
శరణు పార్వతి తనయ మూరుతి |
శరణు మూషిక వాహన, శరణు శరణు ||

చరణం 1

నిటిల నేత్రనె, దేవిసుతనె నాగభూషణ ప్రీయనె |
తటిలతాంకిత కోమలాంగనె, కర్ణకుండల ధారనె || శరణు శరణూ

చరణం 2

బట్ట ముత్తిన హార పతకనే, బాహు హస్త చతుష్టనే |
ఇట్ట తొడుగెయ హేమకంకణ, పాశ-దంకుష ధారనె ||

చరణం 3

కుక్షి మహా లంబోదరనె, ఇక్షుఛాపన గెలిదనె |
పక్షివాహన సిరి పురంధర విఠ్ఠలన నిజదాసనె ||


శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ పాహిమాం

జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్షమాం

శ్రీ గణేశ పాహిమాం జయ గణేశ రక్షమాం



Sunday 7 August 2022

hara hara shambhu shiva maha deva

 హర శంభు (శంభు), శంభు (శంభు), శివ మహాదేవా

శంభు (శంభు), శంభు (శంభు), శివ మహాదేవా
హర-హర శంభు (శంభు), శంభు (శంభు), శివ మహాదేవా
శంభు (శంభు), శంభు (శంభు), శివ మహాదేవా
కర్పూరగౌరం కరుణావతారం సంసారసారం భుజగేన్ద్రహారమ్
కర్పూరగౌరం కరుణావతారం సంసారసారం భుజగేన్ద్రహారమ్
సదా వసన్తం హృదయారవిన్దే భవం భవానీసహితం నమామి
సదా వసన్తం హృదయారవిన్దే భవం భవానీసహితం నమామి
హర-హర శంభు (శంభు), శంభు (శంభు), శివ మహాదేవా
శంభు (శంభు), శంభు (శంభు), శివ మహాదేవా
హర-హర శంభు (శంభు), శంభు (శంభు), శివ మహాదేవా
శంభు (శంభు), శంభు (శంభు), శివ మహాదేవా
సానన్దమానన్దవనే వసన్తం ఆనన్దకన్దం హతపాపవృన్దమ్
సానన్దమానన్దవనే వసన్తం ఆనన్దకన్దం హతపాపవృన్దమ్
వారాణసీనాథం మమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే
వారాణసీనాథం మమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే
హర-హర శంభు (శంభు), శంభు (శంభు), శివ మహాదేవా
శంభు (శంభు), శంభు (శంభు), శివ మహాదేవా
హర-హర శంభు (శంభు), శంభు (శంభు), శివ మహాదేవా
శంభు (శంభు), శంభు (శంభు), శివ మహాదేవా
అవన్తికాయాం విహితావతారం ముక్తిప్రదానాయ చ సజ్జనానామ్
అవన్తికాయాం విహితావతారం ముక్తిప్రదానాయ చ సజ్జనానామ్
అకాలమృత్యో: పరిరక్షణార్థం వన్దే మహాకాలమహాసురేశమ్
అకాలమృత్యో: పరిరక్షణార్థం వన్దే మహాకాలమహాసురేశమ్
హర-హర శంభు (శంభు), శంభు (శంభు), శివ మహాదేవా
శంభు (శంభు), శంభు (శంభు), శివ మహాదేవా
హర-హర శంభు (శంభు), శంభు (శంభు), శివ మహాదేవా
శంభు (శంభు), శంభు (శంభు), శివ మహాదేవా
నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగ రాగాయ మహేశ్వరాయ
నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగ రాగాయ మహేశ్వరాయ
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై న కారాయ నమః శివాయః
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై న కారాయ నమః శివాయః
హర-హర శంభు (శంభు), శంభు (శంభు), శివ మహాదేవా
శంభు (శంభు), శంభు (శంభు), శివ మహాదేవా
హర-హర శంభు (శంభు), శంభు (శంభు), శివ మహాదేవా
శంభు (శంభు), శంభు (శంభు), శివ మహాదేవా


हर शंभु (शंभु), शंभु (शंभु), शिव महादेवा
शंभु (शंभु), शंभु (शंभु), शिव महादेवा
हर-हर शंभु (शंभु), शंभु (शंभु), शिव महादेवा
शंभु (शंभु), शंभु (शंभु), शिव महादेवा
कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारम्
कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारम्
सदा वसन्तं हृदयारविन्दे भवं भवानीसहितं नमामि
सदा वसन्तं हृदयारविन्दे भवं भवानीसहितं नमामि
हर-हर शंभु (शंभु), शंभु (शंभु), शिव महादेवा
शंभु (शंभु), शंभु (शंभु), शिव महादेवा
हर-हर शंभु (शंभु), शंभु (शंभु), शिव महादेवा
शंभु (शंभु), शंभु (शंभु), शिव महादेवा
सानन्दमानन्दवने वसन्तं आनन्दकन्दं हतपापवृन्दम्
सानन्दमानन्दवने वसन्तं आनन्दकन्दं हतपापवृन्दम्
वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये
वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये
हर-हर शंभु (शंभु), शंभु (शंभु), शिव महादेवा
शंभु (शंभु), शंभु (शंभु), शिव महादेवा
हर-हर शंभु (शंभु), शंभु (शंभु), शिव महादेवा
शंभु (शंभु), शंभु (शंभु), शिव महादेवा
अवन्तिकायां विहितावतारं मुक्तिप्रदानाय च सज्जनानाम्
अवन्तिकायां विहितावतारं मुक्तिप्रदानाय च सज्जनानाम्
अकालमृत्यो: परिरक्षणार्थं वन्दे महाकालमहासुरेशम्
अकालमृत्यो: परिरक्षणार्थं वन्दे महाकालमहासुरेशम्
हर-हर शंभु (शंभु), शंभु (शंभु), शिव महादेवा
शंभु (शंभु), शंभु (शंभु), शिव महादेवा
हर-हर शंभु (शंभु), शंभु (शंभु), शिव महादेवा
शंभु (शंभु), शंभु (शंभु), शिव महादेवा
नागेंद्रहाराय त्रिलोचनाय भस्मांग रागाय महेश्वराय
नागेंद्रहाराय त्रिलोचनाय भस्मांग रागाय महेश्वराय
नित्याय शुद्धाय दिगंबराय तस्मै न काराय नमः शिवायः
नित्याय शुद्धाय दिगंबराय तस्मै न काराय नमः शिवायः
हर-हर शंभु (शंभु), शंभु (शंभु), शिव महादेवा
शंभु (शंभु), शंभु (शंभु), शिव महादेवा
हर-हर शंभु (शंभु), शंभु (शंभु), शिव महादेवा
शंभु (शंभु), शंभु (शंभु), शिव महादेवा

Thursday 4 August 2022

పాలసంద్రమందు పుట్టి వైకుంఠమున మెట్టి - Mangalam

 పాలసంద్రమందు పుట్టి వైకుంఠమున మెట్టి

వేలకాంతులీను తల్లి నీకు మంగళం

పద్మ పీఠమందు నిలిచి భక్త కోటికభయమిచ్చి

భాగ్యమెంతొ కూర్చు తల్లి నీకు మంగళం


లోభమంత కాల్చి వేసి లోక పాలనమ్ము చేసి

లోకమంత నిండియున్న నీకు మంగళం

బాలరూపమందు వచ్చి బాధతీర్చి వరములిచ్చి

వడ్లపాలనేలు తల్లి నీకు మంగళం


పాలసంద్రమందు పుట్టి వైకుంఠమున మెట్టి

వేలకాంతులీను తల్లి నీకు మంగళం


కష్టకాలమందు నిన్ను భక్తితోడ కొలిచినంత

కోరినంత  ధనమునిచ్చు నీకు మంగళం

కరువులేని కాలమిచ్చి పచ్చనైన పొలములిచ్చి

కడుపునింపు ధాన్యమొసగు నీకు మంగళం


పాలసంద్రమందు పుట్టి వైకుంఠమున మెట్టి

వేలకాంతులీను తల్లి నీకు మంగళం


ఎదుట ఎన్ని బాధలున్న తిప్పి గొట్టు శక్తినొసగి

ఎదురులేని ధైర్యమిచ్చు నీకు మంగళం

ఉదరపోషణార్థమైనా ఊరునేలు తెలివికైనా

తలచినంత విద్యనొసగు నీకు మంగళం


పాలసంద్రమందు పుట్టి వైకుంఠమున మేట్టి

వేలకాంతులీను తల్లి నీకు మంగళం


పాలనిచ్చి పొలము దున్ను పశుల గంగ డోలు నిమిరి

ప్రేమతోడ కాచు తల్లి నీకు మంగళం

ఊపిరంత బలము నింపి ఓటమన్న మాటలేని 

తిరుగులేని విజయమిచ్చు నీకు మంగళం


బిడ్డలున్న అమ్మ కంటిలోన వెలుగు చూచు కొరకు

పిల్లపాపలిచ్చు తల్లి నీకు మంగళం

కాలచక్ర గమనమందు నిఖిల లోక ఛత్రి కింద 

జీవకోటినేలు తల్లి నీకు మంగళం


పాలసంద్రమందు పుట్టి వైకుంఠమున మెట్టి

వేలకాంతులీను తల్లి నీకు మంగళం

పద్మ పీఠమందు నిలిచి భక్త కోటికభయమిచ్చి

భాగ్యమెంతొ కూర్చు తల్లి నీకు మంగళం

Monday 1 August 2022

mangalambe shambu rani మంగళంబె శంభు రాణి

 మంగళాంబే శంభురాణి మాణిని ఓ పూవుబోని (2)

బృంగకుంతలవేణివమ్మ పుత్తడి బంగారు బొమ్మ (2)

నిన్నే నమ్మియుంటినమ్మ నీదు కరుణ నొసగవమ్మా (2)

మంగళాంబే శంభురాణి మాణిని ఓ పూవుబోని


చరణం 1:

మల్లె పూలు తెచ్చి నిన్ను మగువరో పూజింతునమ్మ (2)

యుల్లమునన్ మరువకమ్మా యువిధరో దయ చూడవమ్మా (2)

మంగళాంబే శంభురాణి మణిని ఓ పూవుబోని


చరణం 2:

దోసిలొగ్గి యుంటినమ్మా దోషములను ఎంచకమ్మ (2)

కాశీవిశ్వేశ్వరుని కొమ్మ.....ఆ

కాశీ విశ్వేశ్వరుని కొమ్మ

 కనికరించ సమయమమ్మా (2)

మంగళాంబే శంభురాణి మణిని ఓ పూవుబోని


చరణం 3:

మంగళ కరమనుచు జయ మంగళంబు లందవమ్మ (2)

రంగదాసు నేలనట్టి రక్షించే తల్లివమ్మ (2)


మంగళాంబే శంభురాణి మాణిని ఓ పూవుబోని (2)

బృంగకుంతల వేణివమ్మ పుత్తడి బంగారు బొమ్మ (2)

మంగళాంబే శంభురాణి మణిని ఓ పూవుబోని

Sunday 17 July 2022

Malaiya Raajakumari మలైయ రాజకుమారి

 Malaiya Raajakumari(Tamizh) by Bombay Sisters

Song based on love fight between Lord Shiva and Parvati, Lord Shiva compromising devi Parvati finally both are together.


శివుడు : మలైయ రాజకుమారి

మంగైయే మాదు నాన్ శంకరర్ తానడీ మానే

స్వర్ణ కదవై తిఱవడీ ఎన్ తేనే.

మిగితావారు : విందైయుడన్ నడందు శంకరి పొఱ్కదవై

శిక్కెన తాళ్² తిఱందాళ్ మాదు

స్వర్ణ కదవై తిఱందాళ్ అప్పోదు.


శివుడు : అంజన విళి²యాళే ఆయాసమాగ వందేన్

వెంజామరం వీశడీ మానే

దివ్య పరిమళం పూశడీ తేనే.

పార్వతి : అఱుగు శిరసిల్ వైత్తు

విభూతి అణివోర్కు పరిమళ గంధమేదు స్వామి?

ఉమక్కు పరిమళ గంధమేదు స్వామి?.

శివుడు : అర్జునన్ పూజై శైదాన్ అళవట్ర

గంధ పుష్పం వాసనై వీశుదడీ మానే

దివ్య పరిమళం వీశుదడీ తేనే.

పార్వతి : ఎనైయాళుం ఈశ్వరరే ఇళైప్పు మిగుందదెన్న?

ఎందనిడత్తిల్ సొల్లుం స్వామి?

నిజం ఎందనిడత్తిల్ సొల్లుం స్వామి?.

శివుడు : అందర వనం తన్నిల్ అడముడన్ పద్మాసురన్

అదట్టి వంద ఇళైప్పు పెణ్ణే

ఎన్నై మిరట్టి వంద ఇళైప్పు కణ్ణే.


పార్వతి : పరంజోతియాయ్ నిఱైంద పరమశివమే

ఉందన్ పక్కత్తిల్ కాయమెన్న స్వామి?

ఇడ  పక్కత్తిల్ కాయమెన్న స్వామి?

-

శివుడు : వెంద పిట్టుక్కాగ ఉందన్ తగప్పన్ కైయాల్

సందిలడిబట్టేండీ మానే నానుం

పిరంబాల్ అడి పట్టేండీ తేనే.

పార్వతి : కొంజుం విళి²గళ్ ఎల్లాం

కంజ మలర్ పోల కొంజం శివందదెన్న స్వామి?

విళి²గళ్ కొంజం శివందదెన్న స్వామి?.

శివుడు : భక్తియాయ్ వానన్ ఎన్నై శ్రద్ధైయాయ్

పూజై శైదాన్ నిత్తిరై అట్రిరుందేన్ మానే

శెప్ప (శెట్ర) నిత్తిరై విళి²త్తిరుందేన్ తేనే.

పార్వతి : శంకరర్ దేహమెల్లాం తాంగామల్ వేర్వై ఎన్న?

సాహసం(సాహాసం) శెయ్యాదేయుం స్వామి

మెత్త సాహసం((సాహాసం)  శెయ్యాదేయుం స్వామి.

శివుడు : కవి పాడుం భక్తనుడ కవలైగళ్ తీర్కవెండ్రు

విఱగు సుమందేనడి పెణ్ణే

కట్టు విఱగు సుమందేనడి కణ్ణే.

శివుడు : కోమళ వడివాన కుంతళ నాయకియే కోపంగళ్

శెయ్యాదేడీ మానే ఎన్మేల్ బేధంగళ్ ఎణ్ణాదేడీ తేనే.

మిగితావారు : ముత్తు మూక్కుత్తి నవరత్నమణి జ్వలిక్క అత్తన్

పాదత్తై వందు నాడినాళ్ దేవీ కండు వణంగి నిండ్రాడినాళ్.

Thursday 14 July 2022

ఏమనంటిరా సాంబ

 హర హర మహాదేవా శంభో శంకర...

ఏమనంటిరా సాంబ ఏమనంటిరా... వెండి కొండాల శివ పూజ చేయనంటిరా... ఏమనంటిరా లింగ ఏమనంటిరా... ఏదీ కొరని జంగామ సేవ చేయనంటిరా... ఏమనంటిరా... శివ ఏమనంటిరా.... ఏమనన్న నీదు మాయ ఎరుగనైతిరా... ఏమనంటిరా హర ఏమనంటిరా... ఏమనన్న నీదు మాయ ఎరుగనైతిరా... గంగా ఉదుకాము తెచ్చి లింగను పూజిత్తమంటే.... చేపలెంగిలాయే సామి, పీతలెంగిలాయే సామి, కప్పలెంగిలాయే సామి, పాములెంగిలాయే సామి... ఏమనంటిరా సాంబ ఏమనంటిరా... ఎంగిలి కానీ ఉదుకాము నేను ఏడతెద్ధురా.... ఏమనంటిరా లింగ ఏమనంటిరా... వెండి కొండాల శివుని పూజ ఎట్ల చేత్తురా.... ఆ గంగి గోవు పాలు తెచ్చి లింగను పూజిత్తమంటే.... లేగలెంగిలాయే సామి, దూడలెంగిలాయే సామి, చేతులెంగిలాయే సామి, మూతులెంగిలాయే సామి... ఏమనంటిరా, సాంబ ఏమనంటిరా.... ఎంగిలి కానీ ఆ గోవుపాలు ఏడతెద్ధురా... ఏమనంటిరా లింగ ఏమనంటిరా... వెండి కొండల జంగామ సేవెట్ల చెత్తురా... అహ మారేడు పత్రి తెచ్చి లింగను పూజిత్తమంటే ... మేకలెంగిలాయే సామి, గొర్రెలెంగిలాయే సామి, గేదెలెంగిలాయే సామి, కోతులెంగిలాయే సామి... ఏమనంటిరా సాంబ ఏమనంటిరా... ఎంగిలి కానీ మారేడు పత్తి ఏడతెద్ధురా... ఏమనంటిరా లింగ ఏమనంటిరా... వెండికొండల జంగామ సేవ ఎట్ల చెత్తురా... గోగు పువ్వులు తెచ్చి లింగను పూజిత్తమంటే.... ఈగలెంగిలాయే సామి, గువ్వలెంగిలాయే సామి, పురుగులెంగిలాయే సామి, చీమలెంగిలాయే సామి... ఏమనంటిరా సాంబ ఏమనంటిరా... ఎంగిలి కానీ ఆ పువ్వులు నే ఏడ తెద్ధురా... ఏమనంటిరా లింగ ఏమనంటిరా... వెండి కొండల జంగామ సేవ ఎట్ల చెత్తురా... మంచి పండ్లు ఫలములు తెచ్చి లింగను పూజిత్తుమంటే... పక్షులెంగిలాయే సామి, పళ్ళు ఎంగిలాయే సామి, పరుల ఎంగిలాయే సామి, నరుల ఎంగిలాయే సామి... ఏమనంటిరా సాంబ ఏమనంటిరా... ఎంగిలి కానీ ఫలములు నీకెట్ల తెద్ధురా... ఏమనంటిరా లింగ ఏమనంటిరా... ఈ జగమంత కల్తీ ఆయే ఏమి చేత్తురా... నా కల్మశాన్ని కడిగి వేసి కల్తినంత శుద్ధి చేసి... మనసు తోనే గుర్తు సామి, మనసులోనే తంతు సామి, మనసుతో సేవిత్తు సామి, మనసుతో పొజిత్తు సామి... ఏమనంటిరా సాంబ ఏమనంటిరా... ఏమనన్న నీదు లీల ఎరుగనైతిరా... ఏమనంటిరా లింగ ఏమనంటిరా... మంచి మనసును మించిన కొలుపు లేదనంటిరా... మంచి మనసును మించిన కొలుపు లేదనంటిరా... మంచి మనసును మించిన కొలుపు లేదనంటిరా...