Saturday, 20 September 2025

Mangli Bathukamma Song 2025 | Full Song | Speaker Music | Suresh Bobbili | Kamal Eslavath | Harish Lyrics in Telugu కొనగంటి కోటల పుట్టలు

కొనగంటి కోటల పుట్టలు పుట్ట మన్నులో పూసెను తంగెళ్లూ

కానొచ్చె అందాల తోటలు తోట బాటల్ల పూవుల మేటలు

నింగి మెరువంగ నేల తడువంగ 

పాల నురుగల్లా గునుగు పెరుగంగ

రంగు పూవుల్లా పేర్చి పెట్టంగ

పుడమి పువ్వుల్లా పాసమవ్వంగ

దాన్ని బతుకమ్మ ఊరంతా ఏలంగా కొనగంటి కోటల ఆహాహా కొనగంటి కోటల 


శివునీ ముద్దుగుమ్మనూ గుమ్మడాకుల నడుమన నిలపంగా

ఆ చీకటే రంగు పులుముకొని గౌరినీ కళ్ళార చూడగా

తనలో వేల పూవులో బతుకమ్మతో బంధమై నిలవగా

తానొచ్చే ఆడ తల్లులా గదువల్లు పూసె గంధాలుగా

కోటి కాంతులే నేల రాలగా పూల బంతులే ధరణి నిండగా

తామరాకుపై తల్లి నవ్వగా పల్లె పల్లెల వెన్నెల్ల కురువగా

ఊరు ఊగే ఉయ్యాల పాటగా   కొనగంటి కోటల ఆహాహా కొనగంటి కోటల 


బీరాయి పూవుల కాటుక దెచ్చిన ఏడ్కి పోయినావు గౌరమ్మా

నీతోడు నిమ్మల తోడు గౌరమ్మా పందిట్ల పడుకున్న గౌరమ్మా

పొట్ల పూవుల కట్టల్లు నేనిత్తు ఏడ్కి పోయినావు గౌరమ్మా

నీతోడు నిమ్మల తోడు గౌరమ్మా పందిట్ల పడుకున్న గౌరమ్మా

రుద్రాక్ష పూవుల రయికెలు నీకు తంగెడు పూవుల గాజులు నీకు

వాయినమంటిని పూవులు నీకు ఏడ్కి పోయినావు గౌరమ్మా


నా తెలంగాణ ఆడబిడ్డలు తల్లి బంధమై అల్లుకుంటరూ

వంతగా కోయిలమ్మలోలే కమ్మని రాగాలు తీసేరు

పెట్టెలా దాసిపెట్టుకున్న పట్టుబట్టలల్ల మురిసిపోయేరూ

జట్టుకట్టి సుట్టు ఆడుకుంటూ పట్టని రందులు మరిసేరు

అట్టు పాలతో పాయసాలమ్మా వండి వార్చిపెట్టె వాయనాలమ్మా

గౌరి మెచ్చేటి నైవేద్యాలమ్మా తీరుతీరుగా ఇద్యాలు చూడమ్మా

తల్లి మళ్ళీ మాకొరకు రావమ్మా కొనగంటి కోటల ఆహాహా కొనగంటి కోటల 

No comments:

Post a Comment