Friday, 10 January 2025

Free gurukul songs

ఆనంద భారవి

నీల మేఘ శ్యామ కృష్ణ నిత్య జగన్మోహన కృష్ణ

బాల గోపాల కృష్ణ భవ్య మంగళం


వేణు గాన లోల  కృష్ణ వేదాంత వేద్య  కృష్ణ

భాను సంకాశ  కృష్ణ పాహి మంగళం


భక్త జనాధార  కృష్ణ పరమ దయా వార్ది  కృష్ణ

ముక్తి సంధాయక  కృష్ణ మూర్తి మంగళం


పరగ వ్యాసాశ్రయ సద్గురు భక్త మందిర వాస  కృష్ణ

వరద దాస వినుత  కృష్ణ నిత్య మంగళం




ఆరభి - ఆది

 గం గం గం గం గణపతి వదనం 

ఐం హ్రీం క్లీం సౌం సుందర సదనం

గణపతి వదనం సుందర సదనం

వరప్రదాయక వాంఛిత ఫలదం


గణపతి బోధనం అగణిత సాధనం

గణపతి తత్త్వం అంతర్గహనం

గణపతి స్మరణం పాతక హరణం

విఘ్న వినాశక విద్యా వారిధిం


గణపతి ధ్యానం అమితానందం

గణపతి గానం శ్రవణానందం

గణపతి చరణం వినాశ హరణం

గణనాథునికి అభివందనము


గణపతి వదనం సుందర సదనం

సుందర సదనం గణపతి వదనం

ಆರಭಿ - ಆದಿ

ಗಂ ಗಂ ಗಂ ಗಂ ಗಣಪತಿ ವದನಂ

ಐಂ ಹ್ರೀಂ ಕ್ಲೀಂ ಸೌಂ ಸುಂದರ ಸದನಂ

ಗಣಪತಿ ವದನಂ ಸುಂದರ ಸದನಂ

ವರಪ್ರದಾಯಕ ವಾಂಛಿತ ಫಲದಂ



ಗಣಪತಿ ಬೋಧನಂ ಅಗಣಿತ ಸಾಧನಂ

ಗಣಪತಿ ತತ್ತ್ವಂ ಅಂತರ್ಗಹನಂ

ಗಣಪತಿ ಸ್ಮರಣಂ ಪಾತಕ ಹರಣಂ

ವಿಘ್ನ ವಿನಾಶಕ ವಿದ್ಯಾ ವಾರಿಧಿಂ



ಗಣಪತಿ ಧ್ಯಾನಂ ಅಮಿತಾನಂದಂ

ಗಣಪತಿ ಗಾನಂ ಶ್ರವಣಾನಂದಂ

ಗಣಪತಿ ಚರಣಂ ವಿನಾಶ ಹರಣಂ

ಗಣನಾಥುನಿಕಿ ಅಭಿವಂದನಮು



ಗಣಪತಿ ವದನಂ ಸುಂದರ ಸದನಂ

ಸುಂದರ ಸದನಂ ಗಣಪತಿ ವದನಂ

+++++++++++++++++++++++++++++++++++++++++++++

శంకరాభరణ జన్యం - ఆది

హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరి నారాయణ హరీహరీ

హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరి నారాయణ హరీహరీ


గోదాదేవి వలచిన స్వామి శ్రీ రంగనాథా హరీహరీ

ఒప్పుగ నీలను పెండ్లాడిన శ్రీరంగ ధాముడవు సరీసరీ

హరిలో రంగహరి హరిలో రంగహరి హరినారాయణ హరీహరీ

హరిలో రంగహరి హరిలో రంగహరి హరినారాయణ హరీహరీ


మకర సంక్రమణ పుణ్యకాలమున శ్రీహరి నామము సరీసరీ

భక్త జనుల గొంతెత్తి పాడిన మదిలో నిండెను మరీమరీ

హరిలో రంగహరి హరిలో రంగహరి హరినారాయణ హరీహరీ

హరిలో రంగహరి హరిలో రంగహరి హరినారాయణ హరీహరీ


గోకుల నందన గోపాల కృష్ణ గోవింద నామా హరీహరీ

పల్లెసీమను చల్లగ చూడగ పాడెద నేను కోరీకోరీ

హరిలో రంగహరి హరిలో రంగహరి హరినారాయణ హరీహరీ

హరిలో రంగహరి హరిలో రంగహరి హరినారాయణ హరీహరీ

+++++++++++++++++++++++++++++++++++++++++++++++

త్యాగరాజ కీర్తన 

భైరవి - ఆది తాళం 


పల్లవి: 

రామ కోదండ రామ, రామ కళ్యాణ రామా

రామ కోదండ రామ, రామా కళ్యాణ రామా 

రామ పట్టాభి రామ, రామ సాకేత రామ

చరణం: 1

రామ సీతాపతి, రామ నీవే గతి 

రామా నీకు మ్రోకితి , రామా నీ చే జిక్కితి  || రామ కోదండ  రామ ||


చరణం: 2

రామా నీకెవరు జోడు, రామ క్రీగంట చూడు 

రామా నేను నీవాడు, రామా నాతో మాటాడు   || రామ కోదండ  రామ ||


చరణం: 3

రామ నామమే మేలు , రామ (స్వామి) చింతనే చాలు 

రామ నీవు నన్నేలు,  రామ రాయడే చాలు  || రామ కోదండ  రామ ||


చరణం: 4 

రామ నీకొక మాట, రామ నాకొక మూట

రామ నీ పాటే పాట, రామ నీ బాటే బాట    || రామ కోదండ  రామ ||


చరణం: 5 

రామ నేనెందైనను, రామ వేరెంచ లేను

రామ ఎన్నడైనను, రామ బాయక లేను   || రామ కోదండ  రామ ||


చరణం: 6 

రామ విరాజ రాజ, రామ ముఖ జిత తేజా

రామ భక్త సమాజ రక్షిత త్యాగరాజ  || రామ కోదండ  రామ ||

++++++++++++++++++++++++++++++++++++++++++++++

కళ్యాణి - ఆది

కలగంటిని, నేను కలగంటిని, కలలోన తల్లిని కనుగొంటిని

ఎంత బాగున్నదో మము గన్న తల్లీ, ఎన్నాళ్ళకెన్నాళ్ళకగుపించే మళ్లీ-- కలగంటిని --


చరణం: 1

మెడలోన అందాల మందార మాల, జడలోన మల్లెల కుసుమాల హేల, 

ఆ మోములో వెలుగు కోటి దీపాలు, 

ఆ తల్లి పాదాలు దివ్య కమలాలు, -- కలగంటిని --


చరణం: 2

కంచి కామాక్షియా కాకున్న నేమి, కాశీ విశాలాక్షి కాకూడదేమి, 

కరుణించి చూసినా వెన్నెలే కురియు 

కన్నెర్ర జేసిన మిన్నులే విరుగు -- కలగంటిని, --

చరణం: 3

పోల్చుకున్నానులే పోల్చుకున్నాను..వాల్చి మస్తకముచే ప్రణమిల్లినాను-2

అనుపమ రూఢిచే వాగ్యస్థము చేత - 2

ఆమె ఎవరో కాదు భారత మాత....భారత మాత....భారత మాత .

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

పాడి - ఆది

చక్కని తల్లికి చాంగుభళా తన
చక్కెర మోవికి చాంగుభళా

కులికెడి మురిపెపు కుమ్మరింపు తన
సళుపు జూపులకు చాంగుభళా
పలుకుల సొంపుల బతితో గసరెడి
చలముల యలుకకు చాంగుభళా

కిన్నెరతో పతి కెలన నిలుచు తన
చన్ను మెఱుగులకు చాంగుభళా
ఉన్నతి బతిపై నొరగి నిలుచు తన
సన్నపు నడిమికి చాంగుభళా

జందెపు ముత్యపు సరులహారముల
చందన గంధికి చాంగుభళా
విందయి వెంకట విభుబెన చినతన
సంది దండలకు చాంగుభళా

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

మంగళాంబే శంభురాణి మాణిని ఓ పూవుబోని (2)

బృంగకుంతలవేణివమ్మ పుత్తడి బంగారు బొమ్మ (2)

నిన్నే నమ్మియుంటినమ్మ నీదు కరుణ నొసగవమ్మా (2)

మంగళాంబే శంభురాణి మాణిని ఓ పూవుబోని

చరణం 1:

మల్లె పూలు తెచ్చి నిన్ను మగువరో పూజింతునమ్మ (2)

యుల్లమునన్ మరువకమ్మా 3 యువిధరో దయ చూడవమ్మా 

మంగళాంబే శంభురాణి మాణిని ఓ పూవుబోని

చరణం 2:

దోసిలొగ్గి యుంటినమ్మా దోషములనెంచకమ్మ (2)

కాశీవిశ్వేశ్వరుని కొమ్మ.....ఆ

కాశీ విశ్వేశ్వరుని కొమ్మ  3 కనికరించ సమయమమ్మా (2)

మంగళాంబే శంభురాణి మాణిని ఓ పూవుబోని

చరణం 3:

మంగళ కరమనుచు జయ మంగళంబు లందవమ్మ (2)

రంగదాసు నేలినట్టి... 3 రక్షించే తల్లివమ్మ (2)

మంగళాంబే శంభురాణి మాణిని ఓ పూవుబోని (2)

బృంగకుంతల వేణివమ్మ పుత్తడి బంగారు బొమ్మ (2)

మంగళాంబే శంభురాణి మణిని ఓ పూవుబోని


**********************************************************

అమృత వర్షిణి - ఆది

సగమపనిసీ
సనిపమగస

కైలాస నాథా ఉరగ శివా

పార్వతి నాథా పరమ శివా

గణనాథా పిత పూజ్య శివా

కుమార జనక స్కంద శివా


మృత్యుంజయ హర దేవ శివా

నాగభూషణా నాద శివా

సధ్యోజాతా శరణు శివా

వామ దేవ వినుత శివా


ఈశానాద్భుత వేద శివా

అఘోరాంబుధి అరుణ శివా

తత్పురుషార్థ తత్వ శివా

నాదామృత ఝరీ నాద శివా


హర హర హర మహాదేవ శివా

శివ శివ శివ శివ శరణు శివా

హర హర శివ ఓం శివ శివ హర ఓం

హర హర శివ శివ నమశ్శివాయ

నమశ్శివాయ నమశ్శివాయ
నమశ్శివాయ నమశ్శివాయ
ಕೈಲಾಸ ನಾಥಾ ಉರಗ ಶಿವಾ

ಪಾರ್ವತಿ ನಾಥಾ ಪರಮ ಶಿವಾ

ಗಣನಾಥಾ ಪಿತ ಪೂಜ್ಯ ಶಿವಾ

ಕುಮಾರ ಜನಕ ಸ್ಕಂದ ಶಿವಾ



ಮೃತ್ಯುಂಜಯ ಹರ ದೇವ ಶಿವಾ

ನಾಗಭೂಷಣಾ ನಾದ ಶಿವಾ

ಸಧ್ಯೋಜಾತಾ ಶರಣು ಶಿವಾ

ವಾಮ ದೇವ ವಿನುತ ಶಿವಾ



ಈಶಾನಾದ್ಭುತ ವೇದ ಶಿವಾ

ಅಘೋರಾಂಬುಧಿ ಅರುಣ ಶಿವಾ

ತತ್ಪುರುಷಾರ್ಥ ತತ್ವ ಶಿವಾ

ನಾದಾಮೃತ ಝರೀ ನಾದ ಶಿವಾ



ಹರ ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಿವಾ

ಶಿವ ಶಿವ ಶಿವ ಶಿವ ಶರಣು ಶಿವಾ

ಹರ ಹರ ಶಿವ ಓಂ ಶಿವ ಶಿವ ಹರ ಓಂ

ಹರ ಹರ ಶಿವ ಶಿವ ನಮಶ್ಶಿವಾಯ

ನಮಶ್ಶಿವಾಯ ನಮಶ್ಶಿವಾಯ
ನಮಶ್ಶಿವಾಯ ನಮಶ್ಶಿವಾಯ
कैलास नाथा उरग शिवा

पार्वति नाथा परम शिवा

गणनाथा पित पूज्य शिवा

कुमार जनक स्कंद शिवा



मृत्युंजय हर देव शिवा

नागभूषणा नाद शिवा

सध्योजाता शरणु शिवा

वाम देव विनुत शिवा



ईशानाद्भुत वेद शिवा

अघोरांबुधि अरुण शिवा

तत्पुरुषार्थ तत्व शिवा

नादामृत झरी नाद शिवा



हर हर हर महादेव शिवा

शिव शिव शिव शिव शरणु शिवा

हर हर शिव ओं शिव शिव हर ओं

हर हर शिव शिव नमश्शिवाय

नमश्शिवाय नमश्शिवाय
नमश्शिवाय नमश्शिवाय



++++++++++++++++++++++++++++++++++++

శ్రీ త్రిపుర సుందరికి మణిద్వీపవాసినికి
మంగళం జయమంగళం నిత్య శుభమంగళం

ఓంకార రూపిణికి హ్రీంకార వాసినికి శ్రీ బీజ వాహినికి
మంగళం జయ మంగళం నిత్య శుభమంగళం

ఆపదలు బాపేటి సంపదలనొసగేటి శ్రీనగర వాసినికి
మంగళం జయమంగళం నిత్య శుభమంగళం

వేదాలు నాదాలు శిరసొంచి మ్రొక్కేటి శ్రీ రత్న సింహాసినికి
మంగళం జయ మంగళం నిత్య శుభమంగళం

************************************************************************

రాగం :కాపీ

తాళం :ఆది

Lyrics:

పల్లవి :

అంజనమ్మ తపస్సు చేసి నిను ఫలముగ పొందెను

ఆంజనేయ నీ నామము జగతి కెల్ల మంత్రము

పూర్ణ ఫలము నర్పింపగ నా జన్మము సఫలమౌను

కార్య సిద్ధి ఆంజనేయ నా కంతయు సిద్ధమౌను


చరణం:

కలను ఇలను నీ నామస్మరణ మింక మరువను

చీకాకులు తీసి వేసి మంచి మనసు పెంచుము

రామనామ వసుడవు కాల కాల శివుడవు

కాము భావమణచి వేయ కాలాంతర బ్రహ్మవు


చరణం:

కలి బాధలు తాళలేక నీ కాళ్ళనే పట్టినాము

కమ్మనైన బోధ చేసి కడ తేర్చుము నీవు మమ్ము

నాదు హృదయ మందిరమే నీకు వాసమౌను గాక మరకతాంజనేయ దేవ సచ్చిదానంద రూప


*****************************************************

ఓం నమో నారాయణ కృష్ణ ఓం నమో నారాయణ కృష్ణ నందనందన కృష్ణా రక్షక నీవే కృష్ణా మోక్షదాయక నీనే మోహ హరిసో కృష్ణా నారదాది వంద్యా నాదలోల కృష్ణా రాజీవాక్ష నీనే రామకృష్ణా నీనే యదువంశ తిలకా నీనే కృష్ణా యమన భయవ బిడిసో ణం బీజ మంత్రా నీనే జయవు నినగే కృష్ణా

*************************************************

మంగళ హారతి నీకమ్మా మహాలక్ష్మి తల్లి మంగళ హారతి చేకొనుమా మణిద్వీప వాసివి మంగళ గౌరివి మము కరుణించవమ్మా శ్రీ వరలక్ష్మి పద్మ నివాసి నీవమ్మా పాప విమోచని భక్తుల బ్రోవగా రావమ్మా శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి శ్రీ చక్ర వాసిని శ్రీ లలితేశ్వరి ఆది లక్ష్మియు నీవే ధన ధాన్య లక్ష్మి గజ లక్ష్మి ధైర్య లక్ష్మి సంతాన సౌభాగ్య విజయ విద్యలు ఇచ్చి అష్టైశ్వర్యములిచ్చే అష్ట లక్ష్మి తల్లీ


పల్లవి శ్రీ రాముల దివ్యనామ స్మరణ సేయుచున్న చాలు ఘోరమైన తపములను కోర నేటికే మనసా అనుపల్లవి తారక శ్రీ రామ నామ ధ్యానము జేసిన జాలు వేరు వేరు దైవములను వెదుక నేటికే మనసా చరణములు 1.భాగవతుల పాద జలము పైన జల్లుకొన్న జాలు భాగీరథికి పొయ్యేననే భ్రాంతియేటికే భాగవతుల వాగామృతము పానము జేసిన జాలు బాగు మీర నట్టి యమృత పానమేటికే మనసా 2.పరుల హింస సేయకున్న పరమ ధర్మమంతే చాలు పరులను రక్షింతునని పల్కనేటికే దొరకని పరుల ధనములా దోచకయుండితే చాలు గురుతుగాను గోపురము గట్టనేటికే మనసా 3.అతిథి వచ్చి యాకలన్న అన్న మింత నిడిన చాలు క్రతువు సేయ వలెననే కాంక్షయేటికే సతతము మా భద్రగిరి స్వామి రామదాసుడైన ఇతర మతములని యేటి వెతల వేటికే మనసా

2)

నాదనామక్రియ - ఆది (సౌరాష్ట్ర - ఆది)

పల్లవి:

తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు

ప్రక్కతోడుగా భగవంతుడు తన చక్రధారియై చెంతనె యుండగ త..

చరణము(లు):

మ్రుచ్చుసోమకుని మునుజంపినయా

మత్స్యమూర్తి మనపక్షమునుండగ త..


సురలకొరకు మందరగిరి మోసిన

కూర్మావతారుని కృప మనకుండగ త..


హిరణ్యకశిపుని ఇరుచెక్కలుగా

పరచిన నరహరి ప్రక్కన నుండగ


భూమి స్వర్గమును పొందుగ గొలిచిన

వామనుండు మనవాడై యుండగ


దశగ్రీవు మును దండించిన యా

దశరథరాముని దయ మనకుండగ


దుష్టకంసుని ద్రుంచినట్టి శ్రీ

కృష్ణుడు మనపై కృపతోనుండగ


రామదాసు నిల రక్షించెదనని

ప్రేమతో పలికిన ప్రభువిట నుండగ త..

3)

రామజోగి మందు కొనరే - ఓ జనులారా.. రామజోగి మందు కొనరే - ఏ... అను పల్లవి: రామజోగి మందు మీరు ప్రేమతో భుజియించరయ్యా కామక్రోధములనెల్లా కడకు పారద్రోలే మందు చరణము(లు): కాటుక కొండలవంటి కర్మములెడబాపే మందు సాటిలేని జగమునందు స్వామి రామజోగిమందు కోటిధనములిత్తునని కొన్నను దొరకని మందు సాటిలేని భాగవతులు స్మరణ చేసి తలచు మందు వాదుకు చెప్పినగాని వారి పాపములు గొట్టి ముదముతోనే మోక్షమిచ్చే ముద్దు రామజోగిమందు ముదముతో భద్రాద్రియందు ముక్తిని పొందించే మందు సదయుడైన రామదాసు సద్భక్తితో కొలిచే మందు