నిన్ను విడిచి ఉండలేనయ్యా
పల్లవి
నిన్ను విడిచి ఉండలేనయ్యా, కైలాస వాసా
నిన్ను విడిచి ఉండలేనయ్యా
చరణం: 1
నిన్ను విడిచి ఉండలేను, కన్న తండ్రి వగుట చేత
నిన్ను విడిచి ఉండలేను, కన్నా తండ్రీ వగుట చేత
యెన్నఁబోకు నేరములను , చిన్ని కుమారుడనయ్య శివా
యెన్నఁబోకు నేరములను , చిన్ని కుమార్తెనయ్యా శివా
నిన్ను విడిచి ఉండలేనయ్యా, కైలాస వాసా
నిన్ను విడిచి ఉండలేనయ్యా
చరణం: 2
సర్వమునకు కర్త నీవు, సర్వమునకు భోక్త నీవు
సర్వమునకు కర్త నీవు, సర్వామునకు భోక్త నీవు
సర్వమునకు ఆర్త నీవు, పరమ పురుష శివా హరా
నిన్ను విడిచి ఉండలేనయ్యా మహదేవ శంభో
నిన్ను విడిచి ఉండలేనయ్యా, కైలాస వాసా
నిన్ను విడిచి ఉండలేనయ్యా
చరణం: 3
వరద పద్మ బాల శంభో, బిరుదులన్ని గలవు నీకు
వరద పద్మ బాల శంభో, బిరుదులన్నీ గలవు నీకు
కరుణ తోడ బ్రోవకుంటే బిరుదులన్నీ సున్నాలన్నా
నిన్ను విడిచి ఉండలేనయ్యా, కైలాస వాసా
నిన్ను విడిచి ఉండలేనయ్యా
చరణం: 4
శివ మహాదేవ శంకర, నీవే తోడు నీడ మాకు, నీవే తోడు నీడ మాకు
శివ మహాదేవ శంకర, నీవే తోడు నీడ మాకు, నీవే తోడు నీడ మాకు
కావుమయ్య శరణు శరణు దేవ దేవా సాంబశివా
నిన్ను విడిచి ఉండలేనయ్యా, కైలాస వాసా
నిన్ను విడిచి ఉండలేనయ్యా
నిన్ను విడిచి ఉండలేనయ్యా
నిన్ను విడచి ఉండలేనయ్య