Friday, 4 May 2018

ఎంతపని జేసితివి రామ నిన్నేమందు
నిన్నేమందు సార్వభౌమ రామ
పంతమా నామీద పరమపావన నామ
సంతోష ముడిపితివి సకలసద్గుణధామ ||ఎంత||
నిన్నె దైవంబనుచు నమ్మి రామ
తిన్నగా దుఃఖముల జిమ్మి రామ
కన్నదినమని నమ్మి నిన్ను సేవింపగా
నన్నిట్లు నట్టేట ముంచు టెరుగకపోతి ||ఎంత||
అన్నన్న మాటాడవేరా నీ
కన్నులను నను జూడవేరా రామ
చిన్నెలన్నియు దరిగియున్న ఈ చిన్నన్న
గ్రన్న నను జూడుమాయన్న ఓ రామన్న ||ఎంత||
భద్రాద్రివాసుడే మనుపు మము నిరుప
ద్రవముగ నుండుమనుచు రామ
భద్రనుత కరుణాసముద్ర యో శ్రీరామ
భద్ర నిన్నే మదిని భద్రముగ నమ్మితి ||ఎంత||

No comments:

Post a Comment