నవగ్రహ కృతులు
Navagraha Krithis
ನವ ಗ್ರಹ ಕೃತಿಗಳು
नव ग्रह क्रुति
(Sunday)
పల్లవి:-
సూర్య మూర్తే నమోస్తుతే
సుందర ఛాయాధిపతే!
అనుపల్లవి:-
కార్య కారణాత్మక జగత్ప్రకాశ
సింహరాశ్యాధిపతే
ఆర్య వినుత తేజస్ఫూర్తే ఆరోగ్యాది
ఫలత్కీర్తే!
చరణం:-
సారసమిత్ర మిత్రభానో
సహస్ర కిరణ కర్ణసూనో
క్రూరపాపహర కృశానో
గురుగుహమోదిత స్వభానో
సూరిజనేష్టిత సుదినమణే
సోమాదిగ్రహశిఖామణే
ధీరార్చిత కర్మ సాక్షిణే
దివ్యతర సప్తాశ్వ రథినే
సౌరాష్ట్రార్ణ మంత్రాత్మనే
సౌవర్ణ స్వరూపాత్మనే
భారతీశ హరిహరాత్మనే
భక్తి ముక్తి వితరణాత్మనే.
చంద్రంభజ మానస (Monday)
సాధు హృదయ సదృశం.
అనుపల్లవి:-
ఇంద్రాది లోకపాలేష్టిత తారేశం
ఇందుం షోడశకళాధారం నిశాకరం,
ఇందిరా సహోదరం సుధాకరమనిశం.../ చంద్రం/
చరణం:-
శంకరమౌళి విభూషణం శీత కిరణం, చతుర్భుజం
మదనచ్ఛత్రం క్షపాకరం వేంకటేశ నయనం
విరాణ్మనో జననం విధుం కుముదమిత్రం
విధిగురుగుహ వక్త్రం, శశాంకం గీష్పతి శాపానుగ్రహ పాత్రం,
శరచ్చంద్రికా ధవళప్రకాశ గాత్రం
కంకణకేయూర హారమకుటాది ధరం, పంకజ రిపుం రోహిణీ ప్రియకరచతురం.../చంద్రం.../
(Tuesday)
పల్లవి:- అంగారక మాశ్రయామ్యహం
వినతాశ్రితజన మందారం, మంగళవారం భూమి కుమారం వారంవారం.
అనుపల్లవి:- శృంగారక మేష వృశ్చిక
రాశ్యాధిపతిం
రక్తాంగం రక్తాంబరాదిధరం శక్తి శూలధరం,
మంగళం కంబుగళం మంజులతర పద యుగళం, మంగళ నాయక మేషతురంగం మకరోత్తుంగం.
చరణం:-
దానవసురసేవిత మందస్మిత విలసిత వక్త్రం,
ధరణీప్రదం భ్రాతృకారకం రక్తనేత్రం
దీనరక్షకం పూజితవైద్యనాథ క్షేత్రం,
దివ్యౌఘాది గురుగుహ కటాక్షానుగ్రహ పాత్రం,
భాను చంద్ర గురుమిత్రం భాసమాన సుకళత్రం,
జానుస్థ హస్త చిత్రం
చతుర్భుజమతి విచిత్రం.
(Wednesaday)
పల్లవి:- బుధమాశ్రయామి సతతం సురవినుతం
చంద్ర తారాసుతం.
అనుపల్లవి:- బుధజనైర్వేదితం
భూసురైర్మోదితం, మధుర కవితా ప్రదం మహనీయసంపదం
చరణం:-
కుంకుమ సమద్యుతిం గురుగుహ ముదాకృతిం
కుజవైరిణం మణి మకుటహార కేయూర కంకణాది
ధరణం
కమనీయతర మిథునకన్యాధిపం, పుస్తకకరం నపుంసకం కింకరజన మహిత కిల్బిషాది రహితం, శంకర భక్త హితం సదానంద సహితం.
(Thursday)
పల్లవి:-
బృహస్పతే తారాపతే
బ్రహ్మ జాతే నమోస్తుతే!
అనుపల్లవి:-
మహాబలవిభో గీష్పతే మంజు ధనుర్మీనాధిపతే,
మహేంద్రాద్యుపాసితాకృతే
మాధవాది వినుత ధీమతే!
చరణాలు:-
సురాచార్యవర్య వజ్రధర శుభ లక్షణ జగత్రయ
గురో
జరాది వర్జితాక్రోధ కచ జనకాశ్రితజన
కల్ప తరో!!
పురారి గురుగుహ సమ్మోదిత పుత్రకారక
దీనబంధో
పరాది చత్వారి వాక్స్వరూప ప్రకాశక
దయాసింధో!!
నిరామయాయ నీతి కర్త్రే
నిరంకుశాయ విశ్వ భర్త్రే
నిరంజనాయ భువన భోక్త్రే
నిరంశాయ సుఖ ప్రదాత్రే!!
(Friday)
పల్లవి:-
శ్రీ శుక్ర భగవంతం చింతయామి
సతతం సకల తత్వజ్ఞం.
అనుపల్లవి:-
హే శుక్ర భగవన్ మాం ఆశు
పాలయ వృషభతులాధీశ- దైత్య
హితోపదేశ
కేశవ కటాక్షైక నేత్రం కిరీట ధరం
ధవళగాత్రం.
చరణాలు:-
వింశతి వత్సరోడు దశావిర్భాగ మష్టవర్గం
కవిం కళత్ర కారకం రవి నిర్జర
గురువైరిణం
నవాంశ హోరాద్రేక్కాణాది వర్గోత్తమావసర
సమయే- వక్రోచ్చ నీచ స్వక్షేత్ర వర కేంద్ర మూల త్రికోణే
త్రింశాంశ షష్టయాం శైరావతాంశ
పారిజాతాంశ గోపురాంశ రాజయోగ కారకం రాజ్యప్రదం గురుగుహ ముదం.
(Saturday) పల్లవి:- దివాకర తనుజం శనైశ్చరం
ధీరతరం సంతతం చింతయేహం.
అనుపల్లవి:-
భవాంబునిధౌ నిమగ్న జనానాం
భయంకరం అతి క్రూర ఫలదం
భవానీశ కటాక్ష పాత్ర భూత
భక్తి మతాం అతిశయ శుభఫలదం.
చరణం 1.
కాలాంజన కాంతియుత దేహం
కాలసహోదరం కాకవాహం
నీలాంశుక పుష్పమాలావృతం
నీలరత్న భూషణాలంకృతం
మాలినీ వినుత గురుగుహ
ముదితం.....//దివాకర//
చరణం 2:-
మకరకుంభరాశి నాధం తిలతైల
మిశ్రితాన్నదీప ప్రియం
దయాసుధా సాగరం నిర్భయం
కాలదండ పరిపీడిత జానుం
కామితార్థ ఫలదకామధేనుం కాలచక్రభేద
చిత్ర భానుం కల్పిత ఛాయాదేవీ సూనుం.
పల్లవి:-
స్మరామ్యహం సదా రాహుం
సూర్యచంద్ర వీక్ష్య వికృతదేహం
అనుపల్లవి:-
సురాసురం రోగహరం సర్పాది భీతిహరం,
శూర్పాసన సుఖ కరం శూలాయుధ ధరకర్మం
చరణం:-
కరాళవదనం కఠినం దయానార్ణ
కరుణార్ద్రాపాంగం చతుర్భుజం ఖడ్గ ఖేటాది ధరణం చర్మాది నీల వస్త్రం
గోమేధికాభరణం శని శుక్ర మిత్ర గురుగుహ
సంతోషకరం!
మహాసురం కేతుమహం
భజామి ఛాయాగ్రహవరం.
అనుపల్లవి:-
మహావిచిత్ర మకుటధరం మంగళవస్త్రాది ధరం,
నరపీఠ స్థితం సుఖం నవగ్రహయుతం సఖం
చరణం:-
కేతుం కృణ్వన్ మంత్రిణం క్రోధ నిధి
జైమినం
కుళుత్తాది భక్షణం కోణధ్వజ పతాకినం,
గురుగుహ చామర భరణం గుణదోషజితాభరణం గ్రహణాది
కార్యకారణం గ్రహాపసవ్య సంచారిణం.
No comments:
Post a Comment