Friday, 5 April 2019

కాకి కాకి కడవల కాకి
కడవను తెచ్చి గంగలో ముంచే
గంగ నాకు నీళ్ళు ఇస్తే
నీళ్ళను తెచ్చి ఆవుకు ఇస్తే
ఆవు నాకు పాలు ఇచ్చే
పాలను తెచ్చి అవ్వకి ఇస్తే
అవ్వ నాకు జున్ను ఇచ్చే
జున్నును తెచ్చి పంతులుకిస్తే
పంతులు నాకు చదువు చెప్పే
చదువును తెచ్చి మామకి ఇస్తే
మామ నాకు పిల్లను ఇచ్చే
*పిల్ల పేరు మల్లె మొగ్గ*
*నా పేరు జమిందార్......*

అయ్యాగారు..అయ్యాగారు ఎంతెంత..అయ్యాగారి పెళ్ళం ముంతంత ..ముంత కొంచ పోయి మూలకు పెడితే నక్కెత్తికెల్లే నారయాణ ..నారాయాణని నారకు పోతే గొడ్డలి తెగర గోవిందా ..గోవిందా అని గోడగొరికితే పెల్ల కూలెర పెరమన్న ..పెరమన్నాని పేడ కు పోతే ఆవు తన్నేరా అనుమన్నా..అనుమన్నాని అంగడికి పోతే దొంగలు దోశేరా రాయప్పా..రాయప్పా అని రాల్లకు పోతే ముంగటి పళ్ళు ఊడప్పా.. ఊడప్పాని ఊళ్ళకి పోతే...........

No comments:

Post a Comment