Friday, 27 December 2019

హర హర మహాదేవ
అఖిలాండ నాయకా

పురహరా సురవరా పుష్ప బాణ మదహరా. 
చరణం. శ్రీకంఠ సుభాకృతే శివం దేహి దయానిధే శ్రీకరా భాసురా శ్రీ హరికేశ్వరా .


Saturday, 21 December 2019

శ్రీ జానకీ దేవి సీమంతమనరే
మహలక్ష్మీ సుందర వదనము గనరే

పన్నీరు గంధాలు సఖి పైన చిలికించీ
కానుకలు కట్నాలు చదివించరమ్మా
మల్లెమొల్లల సరులు సతి జడలో సవరించి
ఎల్ల వేడుకలిపుడు చేయించరమ్మా      శ్రీ జానకీ దేవి

కులుకుతూ కూర్చున్న కలికినీ తిలకించి
అలుక చెందగనీక అలరించరమ్మా
కులమెల్లా దీవించు కొమరుని గను
ఎల్మలా ముత్తైదువులు దీవించరమ్మా      శ్రీ జానకీ దేవి