శ్రీ జానకీ దేవి సీమంతమనరే
మహలక్ష్మీ సుందర వదనము గనరే
పన్నీరు గంధాలు సఖి పైన చిలికించీ
కానుకలు కట్నాలు చదివించరమ్మా
మల్లెమొల్లల సరులు సతి జడలో సవరించి
ఎల్ల వేడుకలిపుడు చేయించరమ్మా శ్రీ జానకీ దేవి
కులుకుతూ కూర్చున్న కలికినీ తిలకించి
అలుక చెందగనీక అలరించరమ్మా
కులమెల్లా దీవించు కొమరుని గను
ఎల్మలా ముత్తైదువులు దీవించరమ్మా శ్రీ జానకీ దేవి
మహలక్ష్మీ సుందర వదనము గనరే
పన్నీరు గంధాలు సఖి పైన చిలికించీ
కానుకలు కట్నాలు చదివించరమ్మా
మల్లెమొల్లల సరులు సతి జడలో సవరించి
ఎల్ల వేడుకలిపుడు చేయించరమ్మా శ్రీ జానకీ దేవి
కులుకుతూ కూర్చున్న కలికినీ తిలకించి
అలుక చెందగనీక అలరించరమ్మా
కులమెల్లా దీవించు కొమరుని గను
ఎల్మలా ముత్తైదువులు దీవించరమ్మా శ్రీ జానకీ దేవి
No comments:
Post a Comment