Saturday, 11 January 2020

తెలుగు నుడిని మెచ్చుకొనని వాడే లేదు
తెలుగు రాని వాడు తెలుగు వాడే కాడు
నాడులలో మేటి నాడు తెలుగు నాడు
నవరసాల కలల వీడు తేనె గూడు

తెలుగు పలుకు విరిసిన తొలి వెన్నెల పూవు
తెలుగు పసిడి పరువము గల కన్నెల నవ్వు
తెలుగులోని మాధవమే కమ్మని వెన్న
తెలుగు చేతి కందు తీయ మామిడి గున్నా

తిరుగు లేని వీర జాతి తెలుగు జాతి
తిన్ననైన దారి గలది తెలుగు నీతి
తెలుగు గుండెలోన కానరానిది భీతి
తెలుగు లీన సుగుణ శీల తెలుగు నాతి

కవితలకిల తగిన భాష తెలుగు భాష
కలకాలం నిలవాలని తెలుగుకాశ
పలువిధాల కలల పంట తెలుగు భూమి
తెలుగు సుగుణ భూషణముల సార్వభౌమి


No comments:

Post a Comment