Thursday, 27 August 2020

సింగారించుకుని వచ్చింది సీతమ్మ దేవి

 సింగారించుకొని వచ్చింది సీతమ్మ దేవి 

పసుపు చీర కట్టి ముత్యాల వడ్డ్యాణము 

పూవుల జడతో మెత్తని నడకతో

చేతుల నిండుగ పచ్చని గాజులు

మెరిసే ముకముతో ఎర్రని (చీర)తో 

సింగారించుకుని వచ్చిందీ

చెలికత్తె చేయిపట్టి తల వంచుకొనుచూ

మాయమ్మ జానకి ఓర చూపు జూచి 

....చుట్టి ,,,కట్టితీ 

మండపమంతనూ పూలతో (నిండెను)

రాముడు  ,,, కోణము గట్టీ తిరిగీ వచ్చెనె ,,,కీ

సీతను పక్కకు రమ్మని పిలిచీ ఆలీ (లాలీ) అనుచూ ఉయ్యాలలూగుచు

సింగారించుకొని వచ్చింది 

పీటలమీదను అమరించిన విరు సరసములాడిరి చిరునవ్వు నవ్వుతూ

ఒకరిని ఒకరూ చూచిన వేళ ముక్కోటి దేవతలు పుష్పములు కురిసిరి

సింగారించుకొని వచ్చింది సీతమ్మ దేవి సింగారించుకొని వచ్చింది సీతమ్మ దేవి






Saturday, 22 August 2020

Anda pinda brahmanda vicharana అండ పిండ బ్రహ్మాండ

 అండ పిండ బ్రహ్మాండ విచారణ పండితులకు ఎరుకా Anda pinda brahmanda vicharana


అండ పిండ బ్రహ్మాండ విచారణ పండితులకు ఎరుకా తిండిపోతులై తిరిగెడి శుద్ద, బండలకే మెరుక ఎవరి తలంపు ఏలాగున నున్నదొ ఈశ్వరునకు ఎరుకా గౌరవమెరుగని గార్ధవంబులకు గణ్యతలేమెరుక ||అండ||
భాగవతుల జాడలు ఈ జగతిని యోగ్యులకే ఎరుకా రాగద్వేషములణచక తిరుగు అయోగ్యులకే మెరుక సుమరస మాధురి క్రమముగ గ్రోలుట భ్రమరములకు ఎరుకా పామరముగ రక్తపానము చేసెడి దోమలకేమెరుక ||అండ||
ధర్మాధర్మములెరిగి చరించుట నిర్మలులకు ఎరుకా మర్మములాడుచు మాని తిరుగ దుష్కర్ముల కేమెరుక మతములన్ని సమ్మతమని మెలగుట యతీశ్వరులకెరుకా ఈతకాయలకు చేతులు చాచే కోతుల కేమెరుకా ||అండ|| బాగుగ సద్గురు బోద విరోధము సాదులకే ఎరుకా ఖేదములాడుచు గాధలు చెందే వాదుల కేమెరుక కన్నుల మధ్యన యున్న ప్రకాశము పుణ్యాత్ములకెరుకా చిన్న పెద్ద తన మెన్నగలేని దున్నలకేమెరుక ||అండ|| అద్దములో ప్రతి బింబము పోలిక సిద్దులకే ఎరుకా పెద్దల వాక్యము రద్దులు చేసే మొద్దులకేమెరుక ఆసురముగ ఎడ్ల రామదాసు కవి భగవంతునికెరుకా ఆశల పాలై హరిని తలంచని అధములకేమెరుక ||అండ||






Tuesday, 4 August 2020

Ramududbhavinchinadu

రాముడుద్భవించినాడు - జంఝూటి రాగం, మధ్యమ శృతి - రూపక తాళం

               
ప) రాముడుద్భవించినాడు - రఘు కులంబున శ్రీ ||రాముడు 
   తామసులను దునిమి దివిజ స్థోమంబున
   క్షేమముకై కోమలి కౌసల్యకు శ్రీ ||రాముడు

1) తనరు చైత్ర శుద్ధ నవమి పునర్వసంబున
   సరస కర్కాటక లగ్నమరయగ సురవరులెల్ల
   విని కురియింప విరుల వాన ||రాముడు 

2) దశరధుండు భూసురులకు ధనమొసంగగా  
   విసర మలయ మారుతము - దిశలెల్లను విశదములౌ
   వసుమతి దుర్భరము బాప ||రాముడు

3) కలువలను మించు కనుల కాంతి వెల్గగా
   పలువరుసా ఆణిముత్య కలములొయన
   కళలొలుకగ కిలకిలమని నవ్వుచు శ్రీ ||రాముడు

4) ధరను గుడిమెళ్ళంక పురమునరసి బ్రోవగా 
   కరుణతో శ్రీ రంగ దాసు మొరలిడగను
   కరుణించియు వరమివ్వను స్థిరుడై శ్రీ ||రాముడు