అండ పిండ బ్రహ్మాండ విచారణ పండితులకు ఎరుకా Anda pinda brahmanda vicharana
భాగవతుల జాడలు ఈ జగతిని యోగ్యులకే ఎరుకా
రాగద్వేషములణచక తిరుగు అయోగ్యులకే మెరుక
సుమరస మాధురి క్రమముగ గ్రోలుట భ్రమరములకు ఎరుకా
పామరముగ రక్తపానము చేసెడి దోమలకేమెరుక ||అండ||
ధర్మాధర్మములెరిగి చరించుట నిర్మలులకు ఎరుకా
మర్మములాడుచు మాని తిరుగ దుష్కర్ముల కేమెరుక
మతములన్ని సమ్మతమని మెలగుట యతీశ్వరులకెరుకా
ఈతకాయలకు చేతులు చాచే కోతుల కేమెరుకా ||అండ||
బాగుగ సద్గురు బోద విరోధము సాదులకే ఎరుకా
ఖేదములాడుచు గాధలు చెందే వాదుల కేమెరుక
కన్నుల మధ్యన యున్న ప్రకాశము పుణ్యాత్ములకెరుకా
చిన్న పెద్ద తన మెన్నగలేని దున్నలకేమెరుక ||అండ||
అద్దములో ప్రతి బింబము పోలిక సిద్దులకే ఎరుకా
పెద్దల వాక్యము రద్దులు చేసే మొద్దులకేమెరుక
ఆసురముగ ఎడ్ల రామదాసు కవి భగవంతునికెరుకా
ఆశల పాలై హరిని తలంచని అధములకేమెరుక ||అండ||
My Salutations to great Human who wrote this deep wisdom
ReplyDelete