ఆనంద భైరవి - ఆది
పల్లవి:
రామ రామ నీవారము గామా రామ సీతా రా..
అను పల్లవి:
రామ రామ సాధుజన ప్రేమ రారా రా..
చరణము(లు):
మెఱుగుఁ జేలము గట్టుకో మెల్ల రారా రామ 2
కఱకు బం,గారు సొమ్ములు కదల రారా రా..
వరమైనట్టి, భక్తాభీష్ట వరద రారా రామ 2
మఱుగుఁ జేసికొనే నట్టి మహిమ రారా రా..
మెండైన, కోదండకాంతి మెఱయ రారా కనుల 2
పండువుగ యుం,,డు ఉద్దండ రారా రా..
చిఱునవ్వూగల మోముఁ జూప రారా రామ 2
కరుణతో నన్నెల్లప్పుడు గావ రారా రా..
కందర్ప, సుందరానందకంద రారా నీకు 2
వందనము జేసెద గోవింద రారా రా..
ఆద్యంత రహిత వేదవేద్యా రారా భవ
వైద్య నేనీవాఁడనైతి వేగ రారా రా..
సుప్రసన్న సత్యరూప సుగుణ రారా రామ
అప్రమేయ త్యాగరాజునేలరారా రా..
మమ్ములనూ కాపాడగ సీతా రామా రారా మళ్లీ
అయ్యోధ్యా మందిరమూ నీకు సిద్ధములేరా
No comments:
Post a Comment