నీ పాద పూజలకు, నేనొస్తినోయమ్మ
రావమ్మ పార్వతి రజితగిరి పుత్రీ
బంగారు అందియలు ఘల్లు ఘల్లు మువ్వలు
వెండి మట్టెల మెరుపు పారాణి ఎరుపుల
ఫణి భూషణుండైన పరమేశు వలచి
పంచాగ్నుల నడుమ తపమాచరించి
పర్ణముల భక్షించ పర్ణయని పేర్గాంచి
పరిణయం బాడితివి హరుని వైభోగమున
మహిషాకారమున ఉన్న రాక్షసుని
మడలించుమని సురలు మాత నినువేడా
శ్రీమహంకాళివి హరి భద్రకాళివై
సంహరించితివి ముల్లోకాలు భళి అనగ
నీ మహిమలెన్న నా తరము గాదైన
చెప్పేరు నీ దివ్య చైదములు కొన్ని
విజయ దసరా పుణ్య పర్వదినమీవేళ
జయ దుర్గ పరదేవి పద్మార్చితా వినవే
No comments:
Post a Comment