Thursday, 14 July 2022

ఏమనంటిరా సాంబ

 హర హర మహాదేవా శంభో శంకర...

ఏమనంటిరా సాంబ ఏమనంటిరా... వెండి కొండాల శివ పూజ చేయనంటిరా... ఏమనంటిరా లింగ ఏమనంటిరా... ఏదీ కొరని జంగామ సేవ చేయనంటిరా... ఏమనంటిరా... శివ ఏమనంటిరా.... ఏమనన్న నీదు మాయ ఎరుగనైతిరా... ఏమనంటిరా హర ఏమనంటిరా... ఏమనన్న నీదు మాయ ఎరుగనైతిరా... గంగా ఉదుకాము తెచ్చి లింగను పూజిత్తమంటే.... చేపలెంగిలాయే సామి, పీతలెంగిలాయే సామి, కప్పలెంగిలాయే సామి, పాములెంగిలాయే సామి... ఏమనంటిరా సాంబ ఏమనంటిరా... ఎంగిలి కానీ ఉదుకాము నేను ఏడతెద్ధురా.... ఏమనంటిరా లింగ ఏమనంటిరా... వెండి కొండాల శివుని పూజ ఎట్ల చేత్తురా.... ఆ గంగి గోవు పాలు తెచ్చి లింగను పూజిత్తమంటే.... లేగలెంగిలాయే సామి, దూడలెంగిలాయే సామి, చేతులెంగిలాయే సామి, మూతులెంగిలాయే సామి... ఏమనంటిరా, సాంబ ఏమనంటిరా.... ఎంగిలి కానీ ఆ గోవుపాలు ఏడతెద్ధురా... ఏమనంటిరా లింగ ఏమనంటిరా... వెండి కొండల జంగామ సేవెట్ల చెత్తురా... అహ మారేడు పత్రి తెచ్చి లింగను పూజిత్తమంటే ... మేకలెంగిలాయే సామి, గొర్రెలెంగిలాయే సామి, గేదెలెంగిలాయే సామి, కోతులెంగిలాయే సామి... ఏమనంటిరా సాంబ ఏమనంటిరా... ఎంగిలి కానీ మారేడు పత్తి ఏడతెద్ధురా... ఏమనంటిరా లింగ ఏమనంటిరా... వెండికొండల జంగామ సేవ ఎట్ల చెత్తురా... గోగు పువ్వులు తెచ్చి లింగను పూజిత్తమంటే.... ఈగలెంగిలాయే సామి, గువ్వలెంగిలాయే సామి, పురుగులెంగిలాయే సామి, చీమలెంగిలాయే సామి... ఏమనంటిరా సాంబ ఏమనంటిరా... ఎంగిలి కానీ ఆ పువ్వులు నే ఏడ తెద్ధురా... ఏమనంటిరా లింగ ఏమనంటిరా... వెండి కొండల జంగామ సేవ ఎట్ల చెత్తురా... మంచి పండ్లు ఫలములు తెచ్చి లింగను పూజిత్తుమంటే... పక్షులెంగిలాయే సామి, పళ్ళు ఎంగిలాయే సామి, పరుల ఎంగిలాయే సామి, నరుల ఎంగిలాయే సామి... ఏమనంటిరా సాంబ ఏమనంటిరా... ఎంగిలి కానీ ఫలములు నీకెట్ల తెద్ధురా... ఏమనంటిరా లింగ ఏమనంటిరా... ఈ జగమంత కల్తీ ఆయే ఏమి చేత్తురా... నా కల్మశాన్ని కడిగి వేసి కల్తినంత శుద్ధి చేసి... మనసు తోనే గుర్తు సామి, మనసులోనే తంతు సామి, మనసుతో సేవిత్తు సామి, మనసుతో పొజిత్తు సామి... ఏమనంటిరా సాంబ ఏమనంటిరా... ఏమనన్న నీదు లీల ఎరుగనైతిరా... ఏమనంటిరా లింగ ఏమనంటిరా... మంచి మనసును మించిన కొలుపు లేదనంటిరా... మంచి మనసును మించిన కొలుపు లేదనంటిరా... మంచి మనసును మించిన కొలుపు లేదనంటిరా...

No comments:

Post a Comment