Saturday, 16 August 2025

all krishna songs

krishna Mangalam 

పల్లవి:

జయ మంగళం - నిత్య శుభ మంగళం


చరణాలు:

1. మంగళం రుక్మిణీ రమణాయ శ్రీమతే

మంగళం రమణీయ మూర్తయే తే

మంగళం శ్రీవత్స భూషాయ  శార్గిణే  (శార్ ఙ్గిణే)

మంగళం నందగోపాత్మజాయ


2. పూతనాకంసాది పుణ్యజనహారిణే

పురుహూత ముఖదేవహితకరాయ

సూతాయ విజయస్య సుందర ముఖాబ్జాయ

శీతకిరణాదికుల భూషణాయ


 3. కాళీయమౌళిమణిరంజితపదాబ్జాయ 

కాలాంబుద శ్యామ దివ్యతన వే 

కారుణ్యరసవర్షి నయనారవిందాయ 

కళ్యాణగుణరత్న వారినిధయే


4. నవనీత చోరాయ నందాదిగోపగో 

రక్షిణే గోపికా వల్లభాయ

నారద మునీంద్రనుత నామధేయాయతే

నారాయణానంద తీర్థ గురవే


krishna jo jo

జో జో యశోదెయ నంద ముకుందనె జో జో కంస కుఠారి

జో జో మునిగళ హృదయమందిర జో జో లకుమియ రమణ |ప.|


హొక్కళ హూవిన తావరెగణ్ణిన ఇక్కిద్ద మకరకుండలద

జక్కరిసువ కదపిన సుళిగురుళిన చిక్క బాయి ముద్దు మొగద

సొక్కిద మదకరియందది నొసలలి ఇక్కిద కస్తూరి తిలక

రక్కసరెదెదల్లణ మురవైరియె మక్కళ మాణిక జో జో || ౧||


కణ్ణ బెళగు పసరిసి నోడుత అరెగణ్ణ ముచ్చి నసునగుత

సణ్ణ బెరళు బాయొళు ఢవళిసుత పన్నగశయన నాటకది

నిన్న మగన ముద్దు నోడెనుత గోపి తన్న పతిగె తోరిదళు

చిన్నతనద సొబగిన ఖణియే హొస రన్న ముత్తిన బొంబె జో జో ||౨||


నిడితోళ్గళ పసరిసుతలి గోపియ తొడె మేల్ మలగి బాయ తెరెయె

ఒడలొళు చతుర్దశ భువనవిరలు కండు నడునడుగి కణ్ణ ముచ్చిదళు

తడెయదె అడిగళనిడుతలి బందు మదదేర ముఖవ నోడుత నిందు

కడు దయాసాగర పురందర విఠల బిడదె రక్షిసు ఎన్న సలహబేకెందు జో జో ||౩||


krishna mangalam

బాలకృష్ణాయ నంద దేవకీ సుపుత్రాయ,

రుక్మిణీ వల్లభాయ నిత్య మంగళం


జారచోరాయ నిర్జరాయ నిర్వికారాయ,

దేవదేవోత్తమాయ దివ్య మంగళం


చారుహాసాయ సుందరారవింద వక్త్రాయ

సత్యభామా వరాయ సత్య మంగళం

యాదవేంద్రాయ ఇంద్రరుద్ర దేవవందితాయ,

ద్వారకా నాయకాయ జయద మంగళం

కంసహారాయ మేఘమేచక శరీరాయ,

సుకరుణా సాగరాయ పూర్ణమంగళం


సర్వ విశ్వాయ  సర్వ కామితార్థదాయకాయ,

సర్వపాపాపహాయ సర్వమంగళం


బాలకృష్ణాయ నంద దేవకీ సుపుత్రాయ

రుక్మిణీ వల్లభాయ నిత్య మంగళం

నిత్యమంగళం సర్వమంగళం....


రాగః : కురంజి


తాళం : ఆది


బ్రూహి ముకుందేతి హే రసనే పాహి ముకుందేతి ||


కేశవ మాధవ గోవిందేతి కృష్ణానంద సదానందేతి ||


రాధారమణ హరేరామేతి రాజీవాక్ష ఘనశ్యామేతి ||


గరుడగమన నందకహస్తేతి ఖండితదశకంధరమస్తేతి ||


అక్రూరప్రియ చక్రధరేతి హంసనిరంజన కంసహరేతి ||











Monday, 4 August 2025

 నాకు నిన్ననే తెలిసిన ఒక విషయం మీ అందరితో చెప్పాలనుకుంటున్నాను. 

కర్ణాటకలో వినాయక చవితిని గౌరీగణేశ హబ్బ అంటారు. అంటే గౌరీగణేశ పండుగ. ముందు రోజు గౌరీ పూజ చేసి తర్వాతి రోజు వినాయక చవితి చేస్తారు. మనం వినాయక చవితి మాత్రమే చేస్తాము. ముందు రోజు గౌరీ దేవిని ఆరాధించడం మన దగ్గర లేదు. కర్ణాటకలో ఇలా గౌరీ మరియు గణేశ ఎందుకు చేస్తారు అని అడిగినప్పుడు నాకు నా ఫ్రెండ్స్ చెప్ని సమాధానం ఏమిటంటే...

గౌరీ దేవి వరలక్ష్మీ వ్రతం కోసం తన పుట్టింటికి వచ్చింది. తన పుట్టిల్లు అంటే ఏమిటి, తను పర్వత రాజు కూతురు కదా... హిమగిరి తనయే హేమలతే అంబ ఈశ్వరి శ్రీ లలితే. అంటే పార్వతీ దేవి భూలోకానికి వచ్చిందన్నమాట. పండుగ అయిపోయిన తర్వాత రోజులు గడుస్తున్నా కూడా తను ఇంకా మెట్టినింటికి శివుని దగ్గరకు వెళ్లలేదు. పుట్టింటి ప్రేమ మరి. పార్వతమ్మను తీసుకురమ్మని శివుడు వినాయకుని భూలోకానికి పంపుతాడుట. మీ అమ్మను తీసుకురా పో అని. అలా గణేశుడు భూలోకానికి వస్తాడు. అదే గణేశ చతుర్థి లేదా మన వినాయక చవితి. ఇక వినాయకుడు కూడా 9 రోజుల పాటు ఇక్కడే తిష్ట వేస్తాడట. మరి మన ఉండ్రాళ్ల మహిమ అది.. ఇక లాభం లేదని శివుడు వీళ్లిద్దరినీ తీసుకురమ్మని గంగమ్మ తల్లిని భూలోకానికి పంపుతాడట. అదేనండీ వర్షాలు. అందుకే వినాయక నవరాత్రులలో ఒక్కరోజైనా ఖచ్చితంగా వర్షం పడుతుంది.

ఇలా భగవంతుడిని మనలో ఒకరిగా, భగవంతునితో మనం నిత్యం మాట్లాడుతున్నట్టుగా, దేవుడిని మన నిత్య జీవితంలో ఒక భాగంగా భావించడమే భక్తి అంటే.

Sunday, 3 August 2025

raghukula thilaka ra ra

రఘుకుల తిలకా రార నిన్నెత్తి ముద్దులడేదర

రఘుకుల తిలకా రార నిన్నెత్తి ముద్దులడేదర
కోసల రామా రార కౌసల్య రామ రారా
కోసల రామా రార కౌసల్య రామ రారా

రఘుకుల తిలకా రార నిన్నెత్తి ముద్దులడేదర
రఘుకుల తిలకా రార నిన్నెత్తి ముద్దులడేదర
కోసల రామా రార కౌసల్య రామ రారా
కోసల రామా రార కౌసల్య రామ రారా

నుదిటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం
నుదిటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం
మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసెద రారా
మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసెద రారా

రఘుకుల తిలకా రార నిన్నెత్తి ముద్దులడేదర
రఘుకుల తిలకా రార నిన్నెత్తి ముద్దులడేదర
కోసల రామా రార కౌసల్య రామ రారా
కోసల రామా రార కౌసల్య రామ రారా

వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితి రార
వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితి రార
అల్లరి చేయగా మాని నువ్ అరగించగ రారా
అల్లరి చేయగా మాని నువ్ అరగించగ రారా

రఘుకుల తిలకా రార నిన్నెత్తి ముద్దులడేదర
రఘుకుల తిలకా రార నిన్నెత్తి ముద్దులడేదర
కోసల రామా రార కౌసల్య రామ రారా
కోసల రామా రార కౌసల్య రామ రారా

బుగ్గన చుక్క పెట్టీ నీ కనులకు కాటుక పెట్టీ
బుగ్గన చుక్క పెట్టీ నీ కనులకు కాటుక పెట్టీ
మనసును మాలను చేసి నీ మెడలో వేసేద రార
మనసును మాలను చేసి నీ మెడలో వేసేద రార


In Kannada

రఘుకుల తిలకా బారో నిన్నెత్తి ముద్దు మాడువెనో

కోసల రామా బారో కౌసల్యా రామా బారో


హణెయలి కస్తూరి తిలకవో నసు నగెయా బీరువ మొగవో

మల్లిగె హారవ మాడి నిన కొరళిగె హాకువె బారో


బెళ్లి బట్టలలి హాలు అద నినగే ఇట్టెహె బారో

తుంటాటవను బిట్టూ నీ హాలను సేవిసు బారో


కెన్నెగె చుక్కియ ఇట్టు నిన కణ్ణిగె కాడిగె ఇట్టూ

మనసను మాలెయ మాడి నిన కొరళిగె హాకువె బారో

Friday, 1 August 2025

Ganesha songs of all languages

 ఆరంభదలి నమిపె బాగి శిరవ

హేరంబ నీనొలిదు నీడెనగె – వరవ ||pa||

ద్విరద వదననె నిరుత | ద్విరద వరదన మహిమె
హరుషదలి కరజిహ్వె ఎరడరింద
బరెదు పాడువదక్కె | బరువ విష్నునవ తరిద
కరుణదిందలి ఎన్న కరపిడిదు సలహెందు ||1||

కుంభిణిజె పతి రామ | జంభారి ధర్మజరు
అంబరాధిప రకుతాంబరనె నిన్న ||
సంభ్రమది పూజిసిదరెంబవారుతి కేళి
హంబలవ సలిసెందు | నంబి నిన్నడిగళిగె||2||

సోమశాపద విజిత | కామ కామిత దాత
వామ దేవన తనయ నేమదింద
శ్రీమనోహరనాథ శామసుందర స్వామి నామ
నెనెయువ భాగ్య ప్రేమదలి కొడు ఎందు ||3||