ఎడ్ల రామదాస (రాళ్ళు కొట్టేవాడు)
అండ పిండ బ్రహ్మాండ విచారణ పండితులకు ఎరుక తిండిపోతులై తిరిగెడి శుద్ధ బండలకేమి ఎరుక ఎవరి తలంపు ఎల్లాగునున్నదో ఈశ్వరునికి ఎరుక గౌరవము ఎరుగని గార్ధవంబులకు గణ్యకలేమి ఎరుక భాగవతుల జాడలు ఈ జగతిని యోగ్యులకే ఎరుక రాగద్వేషములను అణచక తిరుగు అయోగ్యులకేమి ఎరుక సుమరస మాధురి క్రమముగ బ్రోలుట భ్రమరములకు ఎరుక పామరముగ రక్తపానము చేసెడి దోమలకేమి ఎరుక ధర్మాధర్మములు ఎరిగి చరించుట నిర్మలులకు ఎరుక మర్మములాడుచు మాని తిరుగ దుష్కర్ములకేమి ఎరుక మతములన్ని సమ్మతమని మెలగుట యతీశ్వరులకు ఎరుక ఈతకాయలకు చేతులు చాచె కోతులకేమి ఎరుక బాగుగ సద్గురు బోధవిరోధము సాధులకే ఎరుక ఖేదములాడుచు గాధలు చెందే వాదులకేమి ఎరుక కన్నులమధ్యయున్న ప్రకాశము పుణ్యాత్ములకు ఎరుక చిన్నపెద్దతనమెన్నగలేని దున్నలకేమి ఎరుక అద్ధములో ప్రతిబింబము పోలిక సిద్ధులకే ఎరుక పెద్ధలవాక్యము హద్ధులుచేసే మొద్ధులకేమి ఎరుక ఆసురముగ ఎట్ల రామదాసు కవి భగవంతునికి ఎరుక ఆశలపాలై హరిని తలంచని అధములకేమి ఎరుక

No comments:
Post a Comment