Saturday, 29 September 2018

राम राम राम उय्यालो रामने श्रीराम उय्यालो
राम रामानंदि उय्यालो रागमॆत्तरादु उय्यालो
हरिहरिय ओ राम हरिय ब्रह्म देव
हरियन्न वारिकि  आपदलू रावु
शरणन्न वारिकी मरणंबु लेदु
मुंदुगा निनु तल्तु मुत्याल पोषम्म
तर्वात निनु तल्तु तल्लिरो पॆद्दम्म
आदिलो निनु तल्तु अयिलोनि मल्लन्न

రామ రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో
రామ రామానంది రాగమెత్తా రాదు
హరిహరియ ఓ రామ హరియ బ్రహ్మ దేవ
హరియన్న వారికి ఆపదలు రావు
శరణన్న వారికి మరణంబు లేదు
ముందుగా నిను తల్తు    ముత్యాల పోషమ్మ
తర్వాత నిను తల్తు     తల్లిరో పెద్దమ్మ
ఆదిలో నిను తల్తు     అయిలోని మల్లన్న
కోరుతా నిను తల్తు     కొంరెల్లి మల్లన్న
మారునా నిను తల్తు     మావురాల ఎల్లమ్మ
బోగాన నిను తల్తు     బొంతపల్లి ఈరన్న
శరణన్న వరంగల్లు     శంభుడా నినుతల్తు
భద్రంగా చూడమ్మ    భద్రకాళీ తల్లీ
చల్లగా నను జూడు    చాముండీ మాత
రామ రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో
రామ రామానంది రాగమెత్తా రాదు
పొద్దున్నే భూదేవి    మొక్కుదునే నిన్ను
బాధల్లి నిను తల్తు    భద్రాద్రి రామన్న
గుండెల్లో నిను తల్తు    కొండగట్టంజన్న
ఎప్పుడూ నినుతల్తు    ఎములాడ రాజన్న
యాదిలో నినుతల్తు    యాదగిరి నర్సన్న
చింతల్లో నినుతల్తు    సమ్మక్కసారక్క
కీర్తిగా నినుతల్తు   కీసరా రామన్న
రామ రామ రామ కోదండ రామ
రామ రామ రామ భద్రాద్రి రామ
రామ రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో
రామ రామానంది రాగమెత్తా రాదు
అందరినీ తలిశి    గంగా నిను మరిసి
గంగ నిను తల్వంది    గడియ నిలువాలేము
మోతుకూ చెట్టు కింద    పుట్టినావే గంగ
మొలమంటి కాల్వలు    పారినావే గంగ
తంగేడు చెట్టు కింద     పుట్టినావే గంగ
తల్లేడు కాల్వలు    పారినావే గంగ
జిల్లేడు చెట్టు కింద    జిల జిల కాల్వలు
ఊరుమూ చెట్టు కింద    పుట్టినావే గంగ
ఉరిమి ఉరిమి కాల్వలు    పారినావే గంగ
కట్టినావు గంగ    పట్టంచు చీరలు
తొడిగినావు గంగ     ముత్యాల రవికెలు
పూసినావు గంగ    పుట్టెడు బంగారు
పెట్టినావు గంగ    గవ్వల మండ్రాలు
గంగ నువ్వు లేక    గడియ నిల్వ లేము
గంగ నీకు శరణు    తల్లి నీకు శరణు
కాపాడి మమ్మేలు    కైలాస రాణి


ರಾಮ ರಾಮ ರಾಮ ಉಯ್ಯಾಲೋ ರಾಮನೇ ಶ್ರೀರಾಮ ಉಯ್ಯಾಲೋ
ರಾಮರಾಮಾನಂದಿ ಉಯ್ಯಾಲೋ ರಾಗಮೆತ್ತರಾದು ಉಯ್ಯಾಲೋ
ಹರಿಹರಿಯ ಓ ರಾಮ ಹರಿಯ ಬ್ರಹ್ಮ ದೇವ
ಹರಿಯನ್ನ ವಾರಿಕಿ ಆಪತಲು ರಾವು
ಶರಣನ್ನ ವಾರಿಕಿ ಮರಣಂಬು ಲೇದು
ಮುಂದುಗಾ ನಿನುತಲ್ತು ಮುತ್ಯಾಲ ಪೋಷಮ್ಮ
ತರ್ವಾತ ನಿನುತಲ್ತು ತಲ್ಲಿರೋ ಪೆದ್ದಮ್ಮ
ಆದಿಲೋ ನಿನುತಲ್ತು ಅಯಿಲೋನಿ ಮಲ್ಲನ್ನ
ಕೋರುತಾ ನಿನುತಲ್ಲು ಕೊಂರೆಲ್ಲಿ ಮಲ್ಲನ್ನ
ಮಾರುನಾ ನಿನುತಲ್ತು ಮಾವುರಾಲ ಎಲ್ಲಮ್ಮ
ಬೋಗಾನ ನಿನುತಲ್ತು ಬೊಂತಪಲ್ಲಿ ಈರನ್ನ
ಶರಣನ್ನ ವರಂಗಲ್ಲು ಶಂಭುಡಾ ನಿನುತಲ್ತು
ಭದ್ರಂಗಾ ಚೂಡಮ್ಮ ಭದ್ರಕಾಳೀ ತಲ್ಲಿ
ಚಲ್ಲಗಾ ನಿನುತಲ್ತು ಚಾಮುಂಡೀ ಮಾತ
ಪೊದ್ದುನ್ನೇ ಭೂದೇವಿ ಮೊಕ್ಕುದುನೇ ನಿನ್ನು
ಬಾಧಲ್ಲ ನಿನುತಲ್ಲು ಭದ್ರಾದ್ರಿ ರಾಮನ್ನ
ಗುಂಡೆಲ್ಲ ನಿನುತಲ್ತು ಕೊಂಡಗಟ್ಟಂಜನ್ನ
ಎಪ್ಪುಡೂ ನಿನುತಲ್ತು ಎಮುಲಾಡ ರಾಜನ್ನ
ಯಾದಿಲೋ ನಿನುತಲ್ತು ಯಾದಗಿರಿ ನರ್ಸನ್ನ
ಚಿಂತಲ್ಲೋ ನಿನುತಲ್ತು ಸಮ್ಮಕ್ಕಸಾರಕ್ಕ
ಕೀರ್ತಿಗಾ ನಿನುತಲ್ತು ಕೀಸರಾ ರಾಮನ್ನ
ರಾಮರಾಮರಾಮ ಕೋದಂಡರಾಮ
ರಾಮರಾಮರಾಮ ಭದ್ರಾದ್ರಿ ರಾಮ
ರಾಮ ರಾಮ ರಾಮ ಉಯ್ಯಾಲೋ ರಾಮನೇ ಶ್ರೀರಾಮ ಉಯ್ಯಾಲೋ
ರಾಮರಾಮಾನಂದಿ ಉಯ್ಯಾಲೋ ರಾಗಮೆತ್ತರಾದು ಉಯ್ಯಾಲೋ
ಅಂದರ್ನೀ ತಲಿಶಿ ಗಂಗಾ ನಿನು ಮರಿಶಿ
ಗಂಗ ನಿನು ತಲ್ವಂದಿ ಗಡಿಯ ನಿಲುವಾಲೇಮು
ಮೋತುಕೂ ಚೆಟ್ಟುಕಿಂದ ಪುಟ್ಟಿನಾವೇ ಗಂಗ
ಮೊಲಮಂಟಿ ಕಾಲ್ವಲೂ ಪಾರಿನಾವೇ ಗಂಗ
ತಂಗೇಡು ಚೆಟ್ಟುಕಿಂದ ಪುಟ್ಟಿನಾವೇ ಗಂಗ
ತಲ್ಲೇಡು ಕಾಲ್ವಲೂ ಪಾರಿನಾವೇ ಗಂಗ
ಜಿಲ್ಲೇಡು ಚೆಟ್ಟುಕಿಂದ ಜಿಲಜಿಲಾ ಕಾಲ್ವಲೂ
ಉರುಮೂ ಚೆಟ್ಟುಕಿಂದ ಪುಟ್ಟಿನಾವೇ ಗಂಗ
ಉರಿಮಿಉರಿಮಿ ಕಾಲ್ವಲೂ ಪಾರಿನಾವೇ ಗಂಗ
ಕಟಟಿನಾವು ಗಂಗ ಪಟ್ಟಂಚು ಚೀರಲೂ
ತೊಡಿಗಿನಾವು ಗಂಗ ಮುತ್ಯಾಲ ರವಿಕೆಲು
ಪೂಸಿನಾವು ಗಂಗ ಪುಟ್ಟೆಡೂ ಬಂಗಾರು
ಪೆಟ್ಟಿನಾವು ಗಂಗ ಗವ್ವಲ ಮಂಡ್ರಾಲು
ಗಂಗ ನುವ್ವು ಲೇಕ ಗಡಿಯ ನಿಲ್ವಲೇಮು
ಗಂಗ ನೀಕು ಶರಣು ತಲ್ಲಿ ನೀಕು ಶರಣು
ಕಾಪಾಡಿ ಮಮ್ಮೇಲು ಕೈಲಾಸ ರಾಣಿ




Friday, 28 September 2018

घल्लु घल्लुना घल्लु घल्लुना
बंती पुदोटलन्नी बंगारू वर्णमैं बतुकम्मा रूपमैं मेरिसिने
एर्रा कलुवा पूलु चेरुवु तल्ली नुदूटी मिद
सिंदूर मद्दिनिटटू मेरिसिने

घल्लु घल्लुना घल्लु घल्लुना
गाजुल चप्पट्लतो वो निर्मला
वो निर्मला ललिता आटाडरे वो निर्मला

पसपु कोम्मुला पसपु कोम्मुला
गौरम्मा रूप मायने वो निर्मला
वो निर्मला ललिता आडी पाडेरे वो निर्मला

पट्टू चिरेल्ला अक्का चॆल्लॆल्ल
मैदाकु चेतुलतो वो निर्मला
वो निर्मला ललिता दरवैय्यारे वो निर्मला

चेमंतुल्ला पूबंतुल्ला
बंगारू बतुकम्मा ले वो निर्मला
वो निर्मला ललिता बैलॆल्लॆने वो निर्मला

गंगा मुरिसेने गंगा मुरिसेने
बतुकम्मा पूला चीरतो
वो निर्मला ललिता पूल एरुले वो निर्मला

घल्लु घल्लुना घल्लु घल्लुना 
ఘల్లు ఘల్లున ఘల్లు ఘల్లునా
బంతి పూదోటలన్ని బంగారు వర్ణమై బతుకమ్మ రూపమై మెరిసెనె
ఎర్రకలువాపూలు చెరువు తల్లి నుదుటిమీద సింధూరమద్దినట్లు విరిసెనె

ఘల్లు ఘల్లునా ఘల్లు ఘల్లున గాజుల చప్పట్లతో ఓ నిర్మలా ఓ
నిర్మల లలీత ఆటలాడరే ఓ నిర్మలా

ఓ నిర్మల లలీత ఆటలాడరే ఓ నిర్మలా..

పసుపు కొమ్ముల్లా పసుపు కొమ్ముల్ల
గౌరమ్మ రూపమాయెనె ఓ నిర్మలా
ఓ నిర్మలా లలీత ఆడిపాడరె ఓ నిర్మలా

ఓ నిర్మలా లలీత ఆడిపాడరె ఓ నిర్మలా
పట్టు చీరల్లా అక్క చెల్లల్ల
మైదాకు చేతులతో ఓ నిర్మలా
ఓ నిర్మల లలీత దరువెయ్యరే ఓ నిర్మలా

ఓ నిర్మల లలీత దరువెయ్యరే ఓ నిర్మలా

చేమంతుల్లా పూబంతుల్ల బంగారు
బతుకమ్మలే ఓ నిర్మలా
ఓ నిర్మల లలీత బైలెల్లెనే ఓ నిర్మలా

ఓ నిర్మల లలీత బైలెల్లెనే ఓ నిర్మలా

గంగ మురిసేనే గంగ మురిసేనే
బతుకమ్మ పూలచీరతో ఓ నిర్మలా
 నిర్మల లాలీత పూల యేరులే  నిర్మలా

 నిర్మల లలీత పూల యేరులే  నిర్మలా
........
హొ హొ హొ హొ

..
హొ హొ హొ హొ

హొయ్ హొయ్ హొయ్

హొయ్ హొయ్ హొయ్

వచ్చింది వచ్చింది పండుగ సందడి
పచ్చా పచ్చని పల్లెకూ...

Ch:పసిడీ వన్నెల పల్లెకూ..

తెచ్చింది తెచ్చింది తరగని
వన్నెలు మా పల్లె ముంగిల్లకూ...

Ch: ముగ్గుల్ల వాకిల్లకూ...

తంగేడు గుమ్మడి గునుగు చామంతుల
పూ..వుల పల్లకి మా తల్లికీ...

Ch: మా చేతుల్లొ నిండిన జాబిల్లికీ...

పసుపేమొ పచ్చంగ కుంకుమ ఎర్రంగ
తీరొక్క పూజలి మాతల్లికీ...

Ch:మా బతుకు వెలిగిమచేటి బతుకమ్మకీ...

వచ్చింది వచ్చింది వచ్చింది వచ్చింది

వచ్చింది వచ్చింది పండుగ
సందడి పచ్చా పచ్చని పల్లెకూ..
పసిడీ వన్నెల పల్లె. కూ....
......

గునుగూ పూలు గోయంగా
గునుగూ పూలు గోయంగా గువ్వా.. లాలీ రాయే
గునుగూ పూలు గోయంగా

Ch: గునుగూ పూలు గోయంగా
గునుగూ పూలు గోయంగా గువ్వా.. లాలీ రాయే
గునుగూ పూలు గోయంగా

బంతీ పూలు పేర్చంగ
బంతీ పూలు పేర్చంగ బతుకమ్మ.
నవ్వెనే.. బంతీ పూలు పేర్చంగ

Ch: బంతీ పూలు పేర్చంగ
బంతీ పూలు పేర్చంగ బతుకమ్మ.
నవ్వెనే.. బంతీ పూలు పేర్చంగ

తంగేడు పూలతోని తంగేడు పూలతోని
తల్లీ గంగ జేరెనే తంగేడు పూలతోని

Ch: తంగేడు పూలతోని తంగేడు పూలతోని
తల్లీ గంగ జేరెనే తంగేడు పూలతోని

యే...లో యే...లో..

యే...లో.. యే...లో..

హొయ్ హొయ్

హొయ్యారె హొయ్యారె

చుక్కలాలో ఓ చుక్కలాలో
చూసి మురవండే బతుకమ్మనీ

Ch: చూసి మురవండే బతుకమ్మనీ

నేరియాలో అల్లా నేరల్లో
కొలువ రారండే గౌరమ్మనీ...

Ch: కొలువ రారండే గౌరమ్మనీ

అమ్మలాలో వోయమ్మలాలో
పంచిపెట్టండే సద్దులనీ..
ఆ ముగ్గురమ్మల ఏకంచెయ్యరె
గంగా.. గౌరీ బతుకమ్మనీ..

Ch: గంగా.. గౌరీ బతుకమ్మనీ..

వచ్చింది వచ్చింది పండుగ సందడి
పచ్చా పచ్చని పల్లె.కూ..
పాడి పంటల సీమకూ..

Ch:వచ్చింది వచ్చింది పండుగ
సందడి పచ్చా పచ్చని పల్లెకూ..
పసిడీ వన్నెల పల్లె. కూ.....

Ch: పచ్చా పచ్చని పల్లెకూ..
పాడి పంటల సీ...మకూ..
ఆ సింగిడిలో రంగులనే దూసి తెచ్చి తెల్ల చంద్రుడిలో వెన్నెలలే తీసుకొచ్చి
పచ్చి తంగెడుతో గుమ్మాడీ పూలు చేర్చి బంగారు బతుకమ్మను ఇంటిలొ పేర్చి
బంగారు బతుకమ్మను ఇంటిలొ పేర్చి ఆడబిడ్డల అరచేతులనే ఊయల కట్టి
వాడవాడలకు ఉత్సవాన్ని మోసుకొచ్చి పువ్వులనే పూజించే పండుగ తెచ్చె
ఆ.. నీటి మీద నిలిచి..తామరలు కళ్ళు తెరిచే
ఏటిగట్టు మీద పూలెన్నో నిన్ను పిలిచె
అందాల బతుకమ్మా రావె..
తెలంగాణలో పుట్టి.. పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే..వటే
పాలసంద్రం పూలే..పూల సంద్రాలయ్యి నిన్ను అభిషేకించే..నే
పత్తి పువ్వులు నీ.. పెదవుల నవ్వులుగా గునుగు పువ్వులు నీ.. గుండె సవ్వడిగా
కంది పువ్వులనే  కంటి పాపలుగా..సీతాజడ పూలే  నీలో సిగ్గులుగా..
తీరొక్క పూలు చేరి.. నీ చీరలాగ మారి ఆ.. ఆడబిడ్డలాగ నిను తీర్చిదిద్దుతుంటే
దారుల్లో ఊరేగ రావే...
తెలంగాణలో పుట్టి.. పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే..వటే
పాలసంద్రం పూలే..పూల సంద్రాలయ్యి నిన్ను అభిషేకించే..నే
ఆ.. మెట్టినిల్లు వీడి చెల్లి..పుట్టినిల్లు చేరే వేళ
పట్టరాని ఆనందాలే పల్లెటూరు కోచ్చేనంట
పట్టణాలు వీడి జనం..సొంతవూరు చేరే క్షణం
చిన్నబోయి ఉన్న గ్రామం..సందడిగా మారే దినం...బ్రతుకు పండుగలో..
తెలంగాణలో పుట్టి.. పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే..వటే
పూవుల జాబిలివే పున్నమి వాకిలివే చీకటికే రంగులు పులిమావే
ఆడపడుచులు నీ కన్న తల్లులయి పున్నమి రాత్రిలో జోలలు పాడుదురే
ఆట కోయిలలే నీ అన్నదమ్ములయి కంటికి రెప్పవలె నిన్ను కాపాడుదురే
ఏ తల్లి కడుపులోన నువ్వు పొందలేదే జన్మ ఈ తెలంగాణ మట్టికి తోబుట్టువు నీవమ్మ
జన్మ జన్మాల బందానివి నీవై
తెలంగాణలో పుట్టి.. పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే..వటే
గావురంగ..పెరిగినీవు... గడపలు దాటుతుంటే
మళ్ళీరా తల్లి అంటూ..కాళ్ళ నీల్లారగించి
చెరువుని చేరుకొని తల్లి నిన్ను సాగనంప
చివరి పాటలతో నీటనిన్ను దోలుతుంటే
చెమ్మగిల్లేను కళ్ళే...
తెలంగాణలో పుట్టి.. పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే..వటే
పాలసంద్రం పూలే..పూల సంద్రాలయ్యి నిన్ను అభిషేకించే..నే
పువ్వుల జాతరవే జమ్మీ పండుగవే

పాలపిట్టొలె మళ్ళిరావె...


आ सिंगिडिलो रंगुलने दूसितॆच्चि
तॆल्ला चंद्रुडिलो वॆन्नॆलले तीसुकॊच्चि
पच्चि तंगॆडुतो गुम्माडी पूलु चेर्चि
बंगारू बतुकम्मनु इंटिलो पेर्ची
बंगारू बतुकम्मनु इंटिलो पेर्ची
आडबिड्डल अरचेतुलने ऊयल कट्टी
वाडवाडलकु उत्सवान्नि मोसुकॊच्चि
पुव्वुलने पूजिंचे पंडुग तॆच्चे

आ नीटि मीद निलिचि तामरलु कळ्ळु तॆरिचे
एटि गट्टु मीद पूलॆन्नो निन्नु पिलिचे
अंदाला बतुकम्मा रावे
तॆलंगाणल पुट्टी पूल पल्लकि ऎक्कि लोकमंता तिरिगेवटे
पाल संद्रं पूले पूल संद्रालय्यि निन्नु अभिषेकिंचेने
पत्ती पुव्वुलु नी पॆदवुल नव्वुलुगा गुनुगू पुव्वुलु नी गुंडॆ सव्वडिगा
कंदि पुव्वुलने कंटि पापलुगा सीता जड पूले नीलो सिग्गुलुगा
तीरॊक्क पूलु चेरि नी चीरलागा मारि
आ आडबिड्ड लागा निनु तीर्चि दिद्दुतुंटे
दारुल्लो ऊरेग रावे
तॆलंगाणल पुट्टी पूल पल्लकि ऎक्कि लोकमंता तिरिगिवटे
पाल संद्रं पूले पूल संद्रालय्यि निन्नु अभिषेकिंचेने























పల్లవి:
రేలారే రేలారే నీళ్లల్లో నిప్పల్లే
వచ్చింది నిజమల్లే
పడిలేచి నిలిచే... రణములో నా తెలంగాణ
లేచి నిలిచి గెలిచే...రణములో...
ఓ...
రేలారే రేలారే పల్లెమట్టి వాసనలే...
స్వచ్చమైన మనుషులే...
అందమైన భూమీ... జగములో నా తెలంగాణ
బంగారు భూమీ... జగములో........
సింగిడి రంగుల పూల
ఇది జానపదాల మాల
కొట్లాటను నేర్పిన నేల....
ఓ...
జో...
ఓ రేలారే...॥
మిన్నులం తడి మన్నులం
మేం పచ్చపచ్చ మక్కజొన్న పంటలం
వాగులం మేం వంకలం మా భాషే తియ్యని సీతాఫలం
చరణం:
వేములవాడ యాదాద్రి మా మొక్కుల నిలయం మేడారం...
బొట్టు బోనం కళలే మా సంస్కృతి ఖ్యాతిని తెలిపే...
పోతన పుట్టిన భూమీ
కొముర భీముల పుడమి
సిరుల పండే మాగణీ
ఓ....
జో....
తరంగ్‌ లం మేం ఫిరంగ్‌ లం
మేం అందమైన కృష్ణజింక పరుగులం
కాంతులం పూ బంతులం
మేం కిలకిల పాలపిట్ట పలుకులం
చెమటలం తడి చెలుకలం
జమ్మిచెట్టు ఆకుపచ్చ తళుకులం
తారలం తంగెడు పువ్వులం
మా ఖ్యాతి కాకతీయ కళా తోరణం
పల్లవి:
హుస్సేన్‌సాగర్‌ చార్మినర్‌ ఘన చరితకు సాక్ష్యం గోల్కొండ
సింగరేణీ సిరులే జల జీవధార మా నదులే
చెరువుల మిలమిల మేరుపు
పక్షుల కిలకిల అరుపు
పచ్చని ప్రకృతి పిలుపు...
ఓ...ఓ...
జో...
ఓ... రేలారే...॥
కమ్మగ ఉంటది యాసా...
అది ప్రాచీన మా భాషా...
బతుకమ్మే మా శ్వాసా...
ఓ... ఓ...
జో...