Friday, 28 September 2018


పల్లవి:
రేలారే రేలారే నీళ్లల్లో నిప్పల్లే
వచ్చింది నిజమల్లే
పడిలేచి నిలిచే... రణములో నా తెలంగాణ
లేచి నిలిచి గెలిచే...రణములో...
ఓ...
రేలారే రేలారే పల్లెమట్టి వాసనలే...
స్వచ్చమైన మనుషులే...
అందమైన భూమీ... జగములో నా తెలంగాణ
బంగారు భూమీ... జగములో........
సింగిడి రంగుల పూల
ఇది జానపదాల మాల
కొట్లాటను నేర్పిన నేల....
ఓ...
జో...
ఓ రేలారే...॥
మిన్నులం తడి మన్నులం
మేం పచ్చపచ్చ మక్కజొన్న పంటలం
వాగులం మేం వంకలం మా భాషే తియ్యని సీతాఫలం
చరణం:
వేములవాడ యాదాద్రి మా మొక్కుల నిలయం మేడారం...
బొట్టు బోనం కళలే మా సంస్కృతి ఖ్యాతిని తెలిపే...
పోతన పుట్టిన భూమీ
కొముర భీముల పుడమి
సిరుల పండే మాగణీ
ఓ....
జో....
తరంగ్‌ లం మేం ఫిరంగ్‌ లం
మేం అందమైన కృష్ణజింక పరుగులం
కాంతులం పూ బంతులం
మేం కిలకిల పాలపిట్ట పలుకులం
చెమటలం తడి చెలుకలం
జమ్మిచెట్టు ఆకుపచ్చ తళుకులం
తారలం తంగెడు పువ్వులం
మా ఖ్యాతి కాకతీయ కళా తోరణం
పల్లవి:
హుస్సేన్‌సాగర్‌ చార్మినర్‌ ఘన చరితకు సాక్ష్యం గోల్కొండ
సింగరేణీ సిరులే జల జీవధార మా నదులే
చెరువుల మిలమిల మేరుపు
పక్షుల కిలకిల అరుపు
పచ్చని ప్రకృతి పిలుపు...
ఓ...ఓ...
జో...
ఓ... రేలారే...॥
కమ్మగ ఉంటది యాసా...
అది ప్రాచీన మా భాషా...
బతుకమ్మే మా శ్వాసా...
ఓ... ఓ...
జో...


No comments:

Post a Comment