Wednesday, 20 March 2019

రింగు రింగు బిల్లా రూపాయి దండ
దండ కాదురా తామర మొగ్గ
మొగ్గ కాదురా మోదుగు నీడ
నీడ కాదురా నిమ్మల బాయి
బాయి కాదురా బచ్చల కూర
కూర కాదురా కుమ్మరి మెట్టు
మెట్టు కాదురా మేదర శిప్పి
శిప్పి కాదురా శీపిరి కట్ట
కట్ట కాదురా కావిడి బద్ద
బద్ద కాదురా బారెడు మీసం
మీసం కాదురా మిర్యాల పొడి
పొడి కాదురా పోతుల కట్ట......

Happy holi

Monday, 11 March 2019

బేట్రాయి సామి దేవుడా - Betrayi sami devuda

బేట్రాయి సామి దేవుడా నన్నేలినోడ బేట్రాయి సామి దేవుడా

కాటమ రాయుడా కదిరి నరసింహుడా నీటైన పేరుగాడ నిన్నే నమ్మితిరా (మేటైన వేటగాడ నిన్నే నమ్మితిరా)

1 సేప కడుపు సీరి పుట్టగ, రాకాసి గాని కోపము సేసి కొట్టితి

ఓపినన్ని నీళ్ళలోన వలసి వేగమే తిరిగి, బాపనోళ్ళ సదువులన్ని బమ్మ దేవర కిచ్చినోడ

2 తాబేలై తాను బుట్టెగా, ఆ నీళ్ళ కాడ దేవాసురులెల్ల గూడగా

దోవసూసి కొండకింద, దూరగానే సిల్కినపుడు, సావులేని మందులెల్ల దేవర్లకిచ్చినోడ

3 అందగాడవవుదులేవయా - గోపాల గోవిందా రాచ్చించారావయా

అయ్యా, అందగాడు నీవు లేవయా గోవింద గోపాల రక్షించరావయా

పందిలోన సేరి, కోర పంటితోనె ఎత్తి భూమి సిందు సిందు సేసినట్టి సందమామ నీవె కాద

4 (ఇగో) నారసిమ్మ నిన్నె నమ్మితి - ఏనాటికైన కోరిన నీ పాదమే గతీ

చేరి కంబాన పుట్టి ప్రహ్లాదు గాంచి కోర మీసమెత్తి పెట్టి గుండె తల్లకిందు జేసినోడ

5 బుడుత బాపనయ్యవైతివి బలి చక్రవర్తినడిగి భూమి గెలుసుకుంటివి

నిడువు కాల్లోడివై అడుగు వానిమీద బెట్టి తడువు లేక లోకములను మడమతోటి తొక్కినోడ

6 రెండుపదులు ఒక్కమారుతో ఆ దొరలనెల్ల సెండాడినావు పరశుతో

సెండకోల బట్టి కోదండరామసామికాడ, బెండు కోల సేసికొనీ కొండకాడకేగినోడ

 7 రామదేవ రచ్చించరా సీతమ్మతల్లి శ్యామసుందర నిన్నె మెచ్చగా

రామరామ రామ రామ రామరామ రామ రామ రామరామ రామ రామ రామరామ రామ రామ

రామదేవ రచ్చించరా సీతమ్మతల్లి శ్యామసుందర నిన్నె మెచ్చగా

శ్రీరామదేవ రచ్చించరా సీతమ్మతల్లి శ్యామసుందర నిన్నె మెచ్చగా

సామి తండ్రిమాట గాచి ప్రేమ భక్తినాదరించి ఆపైనా లంకనెల్ల దోమగాను సేసినోడ 

8 దేవకీదేవి కొడుకుగా ఈ జగములోన దేవుడై నిలిచినావురా

ఆవూల మేపుకొనీ ఆడోళ్ళాగూడుకొనీ తావుబాగ సేసుకొనీ తక్కిడి బిక్కిడి సేసినోడ

9 ఏదాలూ నమ్మరాదనీ ఆ శాస్త్రాలా వాదాలూ బాగ లేవనీ

బోధనలూ సేసికొనీ బుద్ధూలు సెప్పుకొనీ నాదావినోదుడైన నల్లనయ్య నీవెకాద 

10 కలికి నా దొరవు నీవెగా, ఈ జగములోన పలికినావు బాలశిశువుడా

చిల్లకట్టు పురములోన సిన్నీ గోపాలుడౌర పిల్లంగోవి సేతబట్టి పేట పేట తిరిగినోడ

 

 

 

 

 

 

Sunday, 10 March 2019

బేత్రాయి సామి దేవుడా నన్నేలినోడ బేత్రాయి సామి దేవుడా కాటమ రాయుడా కదిరి నరసిమ్హుడా నీటైన యాటగాడ నిన్నే నమ్మితిరోయి[ప] చాప కడుపు చేరి పుట్టగా ఆఅ రాకాసిగాణ్ణి కోపము చేసి కొట్టాగా ఓపినన్ని నీళ్ళలోన దలచి దలచి తిరిగినట్టి బాపనోళ్ళ చదువులన్ని బొమ్మదేవ్డుకిచినోడ[చ1] తాబేలై తాను పుట్టగా ఆఅ నీళ్ళకాడా దేవర క్రతులెల్ల కూడగా దోవ దూసి కొండకింద దోరగా చిలికినపుడు పావనంబైన వెన్న దేవర్లకిచ్చినోడ[చ2] అందగాడ వవౌదులేవయ్య గోపాలా రక్షించ రావయ్యా సందిలోన చేరుకోగ పంటిచేత ఎత్తి భూమి కిందుమిందు జేసినట్టి చందమామ నీవె కాద[చ3] నారసింహ నిన్నె నమ్మితి యేనాటికైన కోరినా నీ పాదమే గతి ఓయీ కంభముజేరి ప్రహ్లాదుగాటి నీవు కోరమీసవైన శత్రు గుండె దోర్ల చేసినోడ[చ4] బుడత బాపనయ్యవైతివి బలి చక్రవర్తినడిగి భూమి నేలుకొంటివి పొడుగు కాళ్ళోడవై అడుగువాణ్ణి మింగబెట్టి తడవులేక లోకమెల్ల నిఢిని చేతబట్టినోడా[చ5] రెండుపదులు ఒక్కసారిగా ఆఅ దరళనెల్ల చెండాడి వీర పరుసతో చండికల్ పట్టుకోదండ రామసామి కాడా చండికల్ పట్టుకోని కొండచప్పుడు చేసినోడ[చ6] రామదేవ రక్షింపరా యీ భూమిలోన మాకెల్ల బుద్ధి చెప్పరా యేమి తప్పు చేసినాము స్వామి నా అల్పబుద్ధి నీ మంతి చల్లదనము మాపైన చూపరోయి[చ7] దేవి దేవక్కి కొడుకురా యీ భూమిలోన దేవుడై వెలసినాడురా ఆవులు తోలుకోని ఆడోళ్ళతో కూడుకోని అవ్వర చేసుకోని ఢక్కు ఢిక్కులాడుకొంటు సాము బాగ చేసుకోని ఢక్కు ఢిక్కులాడుకొంటు[చ8] యాగాలు నమ్మరాదని ఆఅ శాశ్తుల్ల వాదాలు బాగులేవని బోధాలు జేసుకోని బుద్ధుడై చెప్పుకోని నాదావినోదుడైన నల్లనైన నీటుకాదా[చ9] కలికిగా గురముమీదరా గోపాల క్రిష్ణ ధరణిలో మేటి నీవెరా పిల్లిగట్టుపురములోన చిన్నిగోపాలుడా పిల్లంగ్రోవి పట్టుకోని పేటపేట తిరిగినోడ[చ10]

Saturday, 9 March 2019

అంబిగా నా నిన్న నంబిదే జగదంబ రమణ నిన్న నంబిదే 

తుంబిద హరిగోలంబిగ అద కొంబత్తు ఛిద్రవు అంబిగా 
సంభ్రమదింద నీనంబిగ 2 అదరింబు నోడీ నడెసంబిగా || 1 ||

హొళెయ భరవ నోడంబిగా అదకె సెళవు ఘనావయ్య అంబిగా
సుళియొళు ముళుగిదె అంబిగ 2 ఎన్న సెళెదుకొండొయ్యొ నీనంబిగ || 2 || 

ఆరు తెరెయ నోడంబిగ అదు మీరి బరుతలిదె అంబిగ 
యారిందలాగదు అంబిగ 2 అద నివారిసి దాటిసంబిగ || 3 ||
హొత్తు హోయితు నోడంబిగా అల్లి ముత్తైదరీవరు అంబిగా
ఒట్టినడెసు నోడి అంబిగా ఎన్న సత్య లోకకె ఒయ్యో అంబిగా

సత్యవెంబుదె హుట్టంబిగ సదా భక్తియెంబుదె పథవంబిగా 
ముక్తిదాయక నమ్మ పురందర విఠలన ముక్తిమంటపకొయ్యొ అంబిగ || 4 ||