Sunday, 10 March 2019

బేత్రాయి సామి దేవుడా నన్నేలినోడ బేత్రాయి సామి దేవుడా కాటమ రాయుడా కదిరి నరసిమ్హుడా నీటైన యాటగాడ నిన్నే నమ్మితిరోయి[ప] చాప కడుపు చేరి పుట్టగా ఆఅ రాకాసిగాణ్ణి కోపము చేసి కొట్టాగా ఓపినన్ని నీళ్ళలోన దలచి దలచి తిరిగినట్టి బాపనోళ్ళ చదువులన్ని బొమ్మదేవ్డుకిచినోడ[చ1] తాబేలై తాను పుట్టగా ఆఅ నీళ్ళకాడా దేవర క్రతులెల్ల కూడగా దోవ దూసి కొండకింద దోరగా చిలికినపుడు పావనంబైన వెన్న దేవర్లకిచ్చినోడ[చ2] అందగాడ వవౌదులేవయ్య గోపాలా రక్షించ రావయ్యా సందిలోన చేరుకోగ పంటిచేత ఎత్తి భూమి కిందుమిందు జేసినట్టి చందమామ నీవె కాద[చ3] నారసింహ నిన్నె నమ్మితి యేనాటికైన కోరినా నీ పాదమే గతి ఓయీ కంభముజేరి ప్రహ్లాదుగాటి నీవు కోరమీసవైన శత్రు గుండె దోర్ల చేసినోడ[చ4] బుడత బాపనయ్యవైతివి బలి చక్రవర్తినడిగి భూమి నేలుకొంటివి పొడుగు కాళ్ళోడవై అడుగువాణ్ణి మింగబెట్టి తడవులేక లోకమెల్ల నిఢిని చేతబట్టినోడా[చ5] రెండుపదులు ఒక్కసారిగా ఆఅ దరళనెల్ల చెండాడి వీర పరుసతో చండికల్ పట్టుకోదండ రామసామి కాడా చండికల్ పట్టుకోని కొండచప్పుడు చేసినోడ[చ6] రామదేవ రక్షింపరా యీ భూమిలోన మాకెల్ల బుద్ధి చెప్పరా యేమి తప్పు చేసినాము స్వామి నా అల్పబుద్ధి నీ మంతి చల్లదనము మాపైన చూపరోయి[చ7] దేవి దేవక్కి కొడుకురా యీ భూమిలోన దేవుడై వెలసినాడురా ఆవులు తోలుకోని ఆడోళ్ళతో కూడుకోని అవ్వర చేసుకోని ఢక్కు ఢిక్కులాడుకొంటు సాము బాగ చేసుకోని ఢక్కు ఢిక్కులాడుకొంటు[చ8] యాగాలు నమ్మరాదని ఆఅ శాశ్తుల్ల వాదాలు బాగులేవని బోధాలు జేసుకోని బుద్ధుడై చెప్పుకోని నాదావినోదుడైన నల్లనైన నీటుకాదా[చ9] కలికిగా గురముమీదరా గోపాల క్రిష్ణ ధరణిలో మేటి నీవెరా పిల్లిగట్టుపురములోన చిన్నిగోపాలుడా పిల్లంగ్రోవి పట్టుకోని పేటపేట తిరిగినోడ[చ10]

No comments:

Post a Comment