Monday, 11 March 2019

బేట్రాయి సామి దేవుడా - Betrayi sami devuda

బేట్రాయి సామి దేవుడా నన్నేలినోడ బేట్రాయి సామి దేవుడా

కాటమ రాయుడా కదిరి నరసింహుడా నీటైన పేరుగాడ నిన్నే నమ్మితిరా (మేటైన వేటగాడ నిన్నే నమ్మితిరా)

1 సేప కడుపు సీరి పుట్టగ, రాకాసి గాని కోపము సేసి కొట్టితి

ఓపినన్ని నీళ్ళలోన వలసి వేగమే తిరిగి, బాపనోళ్ళ సదువులన్ని బమ్మ దేవర కిచ్చినోడ

2 తాబేలై తాను బుట్టెగా, ఆ నీళ్ళ కాడ దేవాసురులెల్ల గూడగా

దోవసూసి కొండకింద, దూరగానే సిల్కినపుడు, సావులేని మందులెల్ల దేవర్లకిచ్చినోడ

3 అందగాడవవుదులేవయా - గోపాల గోవిందా రాచ్చించారావయా

అయ్యా, అందగాడు నీవు లేవయా గోవింద గోపాల రక్షించరావయా

పందిలోన సేరి, కోర పంటితోనె ఎత్తి భూమి సిందు సిందు సేసినట్టి సందమామ నీవె కాద

4 (ఇగో) నారసిమ్మ నిన్నె నమ్మితి - ఏనాటికైన కోరిన నీ పాదమే గతీ

చేరి కంబాన పుట్టి ప్రహ్లాదు గాంచి కోర మీసమెత్తి పెట్టి గుండె తల్లకిందు జేసినోడ

5 బుడుత బాపనయ్యవైతివి బలి చక్రవర్తినడిగి భూమి గెలుసుకుంటివి

నిడువు కాల్లోడివై అడుగు వానిమీద బెట్టి తడువు లేక లోకములను మడమతోటి తొక్కినోడ

6 రెండుపదులు ఒక్కమారుతో ఆ దొరలనెల్ల సెండాడినావు పరశుతో

సెండకోల బట్టి కోదండరామసామికాడ, బెండు కోల సేసికొనీ కొండకాడకేగినోడ

 7 రామదేవ రచ్చించరా సీతమ్మతల్లి శ్యామసుందర నిన్నె మెచ్చగా

రామరామ రామ రామ రామరామ రామ రామ రామరామ రామ రామ రామరామ రామ రామ

రామదేవ రచ్చించరా సీతమ్మతల్లి శ్యామసుందర నిన్నె మెచ్చగా

శ్రీరామదేవ రచ్చించరా సీతమ్మతల్లి శ్యామసుందర నిన్నె మెచ్చగా

సామి తండ్రిమాట గాచి ప్రేమ భక్తినాదరించి ఆపైనా లంకనెల్ల దోమగాను సేసినోడ 

8 దేవకీదేవి కొడుకుగా ఈ జగములోన దేవుడై నిలిచినావురా

ఆవూల మేపుకొనీ ఆడోళ్ళాగూడుకొనీ తావుబాగ సేసుకొనీ తక్కిడి బిక్కిడి సేసినోడ

9 ఏదాలూ నమ్మరాదనీ ఆ శాస్త్రాలా వాదాలూ బాగ లేవనీ

బోధనలూ సేసికొనీ బుద్ధూలు సెప్పుకొనీ నాదావినోదుడైన నల్లనయ్య నీవెకాద 

10 కలికి నా దొరవు నీవెగా, ఈ జగములోన పలికినావు బాలశిశువుడా

చిల్లకట్టు పురములోన సిన్నీ గోపాలుడౌర పిల్లంగోవి సేతబట్టి పేట పేట తిరిగినోడ

 

 

 

 

 

 

No comments:

Post a Comment