నరహరి దేవా జనార్ధనా - రామదాస కృతి
పల్లవి
నరహరి దేవా జనార్ధనా
కేశవ నారాయణ కనకాంబరధారీ
రామ రామ రామ శ్రీ రఘు రామ రామ రామ్
అనుపల్లవి
రవి కులాభరణ రవిసుత సఖ్య
రాక్షస సంహార రాజ సేవిత
రామ రామ రామ శ్రీ రఘు రామ రామ రామ్
(నరహరి)
చరణములు
పన్నగ శయన పతిత పావన
కన్నతండ్రి ఓ కరుణా సాగర
బంధు జనక త్రిపురాంతక సాయక
సీతా నాయక శ్రీ రఘు నాయక
సుందర శ్రీధర మంత్రోద్ధార
మకుట భూషన మృదుపక్షక హరి
నంద నందనా నంద ముకుందా బృందావన విహారీ గోవింద
No comments:
Post a Comment