మాడు మేయ్కుం కణ్ణే నీ పోగ వేండాం సొన్నేన్
కాయ్చిన పాలు తరేన్ కర్కండు చీని తరేన్
కై నరియ వెణ్ణై తరేన్; వెయ్యిలిలే పోగ వేండాం
(మాడు మేయ్కుం కణ్ణే – నీ పోగ వేండాం సొన్నేన్)
నా ప్రియమైన ఆవుల కాపరి( ఓ కృష్ణా), నీవు దయచేసి బయటకు వెళ్ళవద్దు.బదులుగా,కాచిన పాలు ,కొన్ని చక్కెర స్ఫటికాలు ఇస్తాను అవి సరిపోకపోతే, నేను వెన్న కూడా ఇస్తాను, కాని దయచేసి ఈ వేడి ఎండలో బయటకు వెళ్ళవద్దు
కాయ్చిన పాలుం వేండాం; కర్కండు చీని వెండాం
ఉల్లాసమాయ్ మాడు మేయ్తు, ఒరు నొడియిల్ తిరుంబిడువేన్
పోగ వేణుమ్ తాయే తడై సొల్లాదే నీయే
నాకు కాచిన పాలు ,చక్కెర స్ఫటికాలు వద్దు. నాకు కావలసింది సంతోషంగా ఆవులను మేపుతూ ఉండడం ,నేను మళ్ళీ తొందరగా తిరిగి వస్తాను ఇప్పుడు, నేను వెళ్ళాలి అమ్మా, కాబట్టి దయచేసి నిరోధించడానికి ఏమి చెప్పవద్దు
యమునా నది కరైయిల్ ఎప్పొళుదుం కళ్వర్ భయం
కళ్వర్ వందు ఉనై అడిత్తాల్ కలంగిడువాయ్ కణ్మణియే
(మాడు మేయ్కుం కణ్ణే – నీ పోగ వేండాం సొన్నేన్)
యమునా నది ఒడ్డున దొంగల మరియు పోకిరీల భయం ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ పోకిరీలు నిన్ను కొడితే, నీవు కలత చెందుతావు.
కళ్వనుకోర్ కళ్వన్ ఉండో? కండదుండో సొల్లుం అమ్మా?
కళ్వర్ వందు ఎనై అడిత్తాల్ కండ తుండం ఆగిడువేన్
(పోగ వేణుమ్ తాయే తడై సొల్లాదే నీయే)
అమ్మా! మీరు ఎప్పుడైనా ఒక దొంగను మరొక దొంగ హింసించడం చూశారా ? పోకిరీలు నాపై చేయివేస్తే నేను వారిని ముక్కలుగా నరికివేస్తాను
గోవర్ధన గిరియిల్ ఘోరమాన మృగంగలుండు
సింగం పులి కరడి వందాల్ కలంగిడువాయ్ కణ్మణియే
(మాడు మేయ్కుం కణ్ణే – నీ పోగ వేండాం సొన్నేన్)
గోవర్ధన గిరి పై చాలా భయంకరమైన జంతువులు ఉన్నాయి. నీవు భయంకరమైన ఎలుగుబంటి,సింహం పులులు చూస్తే నీవు ఖచ్చితంగా కలత చెందుతావు.
కాట్టు మృగంగలెల్లామ్ ఎన్నై కండాల్ ఓడి వరుం
కూట్ట కూట్టమాగ వందు వేట్టై ఆడి వెన్రిడువేన్
(పోగ వేణుమ్ తాయే తడై సొల్లాదే నీయే)
అడవిలోని అన్ని జంతువుల నా మిత్రులే! నన్ను చూసినప్పుడు వచ్చి నడుస్తు నన్ను పలకరిస్తాయి. అయినప్పటికీ, అవి నాపై దాడి చేస్తే, నేను వాటిని వేటాడి గెలుస్తాను
ప్రియముళ్ళ నందగోపర్ బాలన్ ఎంగే ఎన్రు కేట్టాల్
ఎన్న బదిల్ సొల్వేనడా ఏకముడన్ తేడిడువార్
మాడు మేయ్కుం కణ్ణే – నీ పోగ వేండాం సొన్నేన్
మీ ప్రియమైన నాన్న, నందగోపర్ తన విధుల నుండి ఇంటికి తిరిగి వచ్చి, 'నా కొడుకు ఎక్కడ ?' అని అడిగితే నేను ఏమి చెప్పగలను?
బాలరుడన్ వీధియిలే పందాడురాన్ ఎన్రు సొల్లేన్
తేడి ఎన్నై వరుగైయిలే ఓడి వందు నిన్రిడువేన్
పోగ వేణుమ్ తాయే తడై సొల్లాదే నీయే
నేను వీధిలో ఉన్నానని, నా స్నేహితులు, ఇతర అబ్బాయిలతో బంతి ఆడుతున్నానని అతనికి చెప్పండి ... మరియు మీరు నన్ను వెతకడానికి ముందే నేను తిరిగి పరిగెత్తుకుని అక్కడే ఉంటాను.
No comments:
Post a Comment