Monday, 6 December 2021

కైలాసగిరి నుండి కాశికై kailasa giri nundi kashikai

 కైలాసగిరి నుండి కాశికై

రచన :దేవులపల్లి క్రిష్ణశాస్త్రీగారు

పున్నాగ వరాళి రాగం, ఖండగతి తాళం

పల్లవి :

కైలాసగిరి నుండి కాశికై , కాశికాపురి నుండి దాసికై

దాసికై ఈ దక్ష వాటికై దయచేసినావయ

హరహర హరహర హరహర హరహర..2

శివశివా శంభో హరహరా శంభో…..


చరణం :

విరిసె జాబిలి మల్లెరేకగా , కురిసె తేనియల మువ్వాకగా

దరిసె నీ దయ నిండు గోదావరి నది ఝరులాయరా హర

హరహర హరహర హరహర హరహర...2

……...కైలాసగిరి నుండి కాశికై , కాశికాపురి నుండి దాసికై

దాసికై ఈ దక్ష వాటికై దయచేసినావయ

హరహర హరహర హరహర హరహర..2

శివశివా శంభో ,హరహరా శంభో…...



ముక్కోటి దేవతల నేతరా , ముల్లోకములకిష్ట దాతరా

వెలిబూది పూతరా నలవిషము మేతరా

హరహర హరహర హరహర హరహర..2

……..కైలాసగిరి నుండి కాశికై , కాశికాపురి నుండి దాసికై

దాసికై ఈ దక్ష వాటికై దయచేసినావయ

హరహర హరహర హరహర హరహర ..2 శివశివా శంభో ,హరహరా శంభో…..

No comments:

Post a Comment