Monday, 17 January 2022

రామ rama

 Pallavi

కరుణా జలధే దాశరథే
కమనీయానన సుగుణ నిధే

Charanams

1. నీ మయమే కానీ ఇలనూ
నిన్నే ఏమని దూరుదును (కరుణా)

2. మనసారగ పూజింతురే 

మాటి మాటికి యోజింతురే (కరుణా)

3.  భాగవత ప్రహ్లాద హిత 

భావుక త్యాగరాజ నుత (కరుణా)




4. నిజ దాసుల అనుభవమొకటి
నిను తెలియని జన మతమొకటి (కరుణా)

5. వలచుచు నామము సేయుదురే 2నిను
తలచుచు ప్రొద్దు పోగొట్టుదురే (కరుణా)

6. సు-కృతములొప్పగింతురే నీ

ప్రకృతిని తెలిసియేగింతురే (కరుణా)

7. నిను 4కనులకు కన కోరుదురే 5నవ

నిధులబ్బిన సుఖమును కోరరే (కరుణా)

8. నీవన్నిటయని పలుకుదురే
6నీవే తానని కులుకుదురే (కరుణా)

9. తమలో 7మెలగుచునుందురే
తారక రూపుని కందురే (కరుణా)

No comments:

Post a Comment