Sunday, 16 January 2022

Shiva శివ

 అభిషేకములు సేతు హర హర మహాదేవ!

విభవదాయక! శివా! విభూ! మృత్యుంజయా!

రసమయపు భావధారలె నీకు స్నానములు
రసాశ్రయ! రసరూప! రసిక! సరసజ్ఞ!
జడలశిఖలను అగ్ని సాంబ నీ కపర్దము
సోమమే గాంగఝరి సోమాగ్ని తత్త్వా

అభిషేకములు సేతు హర హర మహాదేవ!
విభవదాయక! శివా! విభూ! మృత్యుంజయా!

నా మనః కళశాన నానా తలంపులే
పాలుగా నీరుగా మధు దధి ఘృతములుగ
ఫలరసుములుగ మారి పరమాభిషేకముల
తీర్థమ్ములై బ్రతుకు సార్థకము పరమేశ

అభిషేకములు సేతు హర హర మహాదేవ!
విభవదాయక! శివా! విభూ! మృత్యుంజయా!

No comments:

Post a Comment