Thursday, 4 August 2022

పాలసంద్రమందు పుట్టి వైకుంఠమున మెట్టి - Mangalam

 పాలసంద్రమందు పుట్టి వైకుంఠమున మెట్టి

వేలకాంతులీను తల్లి నీకు మంగళం

పద్మ పీఠమందు నిలిచి భక్త కోటికభయమిచ్చి

భాగ్యమెంతొ కూర్చు తల్లి నీకు మంగళం


లోభమంత కాల్చి వేసి లోక పాలనమ్ము చేసి

లోకమంత నిండియున్న నీకు మంగళం

బాలరూపమందు వచ్చి బాధతీర్చి వరములిచ్చి

వడ్లపాలనేలు తల్లి నీకు మంగళం


పాలసంద్రమందు పుట్టి వైకుంఠమున మెట్టి

వేలకాంతులీను తల్లి నీకు మంగళం


కష్టకాలమందు నిన్ను భక్తితోడ కొలిచినంత

కోరినంత  ధనమునిచ్చు నీకు మంగళం

కరువులేని కాలమిచ్చి పచ్చనైన పొలములిచ్చి

కడుపునింపు ధాన్యమొసగు నీకు మంగళం


పాలసంద్రమందు పుట్టి వైకుంఠమున మెట్టి

వేలకాంతులీను తల్లి నీకు మంగళం


ఎదుట ఎన్ని బాధలున్న తిప్పి గొట్టు శక్తినొసగి

ఎదురులేని ధైర్యమిచ్చు నీకు మంగళం

ఉదరపోషణార్థమైనా ఊరునేలు తెలివికైనా

తలచినంత విద్యనొసగు నీకు మంగళం


పాలసంద్రమందు పుట్టి వైకుంఠమున మేట్టి

వేలకాంతులీను తల్లి నీకు మంగళం


పాలనిచ్చి పొలము దున్ను పశుల గంగ డోలు నిమిరి

ప్రేమతోడ కాచు తల్లి నీకు మంగళం

ఊపిరంత బలము నింపి ఓటమన్న మాటలేని 

తిరుగులేని విజయమిచ్చు నీకు మంగళం


బిడ్డలున్న అమ్మ కంటిలోన వెలుగు చూచు కొరకు

పిల్లపాపలిచ్చు తల్లి నీకు మంగళం

కాలచక్ర గమనమందు నిఖిల లోక ఛత్రి కింద 

జీవకోటినేలు తల్లి నీకు మంగళం


పాలసంద్రమందు పుట్టి వైకుంఠమున మెట్టి

వేలకాంతులీను తల్లి నీకు మంగళం

పద్మ పీఠమందు నిలిచి భక్త కోటికభయమిచ్చి

భాగ్యమెంతొ కూర్చు తల్లి నీకు మంగళం

No comments:

Post a Comment