Monday, 1 August 2022

mangalambe shambu rani మంగళంబె శంభు రాణి

 మంగళాంబే శంభురాణి మాణిని ఓ పూవుబోని (2)

బృంగకుంతలవేణివమ్మ పుత్తడి బంగారు బొమ్మ (2)

నిన్నే నమ్మియుంటినమ్మ నీదు కరుణ నొసగవమ్మా (2)

మంగళాంబే శంభురాణి మాణిని ఓ పూవుబోని


చరణం 1:

మల్లె పూలు తెచ్చి నిన్ను మగువరో పూజింతునమ్మ (2)

యుల్లమునన్ మరువకమ్మా యువిధరో దయ చూడవమ్మా (2)

మంగళాంబే శంభురాణి మణిని ఓ పూవుబోని


చరణం 2:

దోసిలొగ్గి యుంటినమ్మా దోషములను ఎంచకమ్మ (2)

కాశీవిశ్వేశ్వరుని కొమ్మ.....ఆ

కాశీ విశ్వేశ్వరుని కొమ్మ

 కనికరించ సమయమమ్మా (2)

మంగళాంబే శంభురాణి మణిని ఓ పూవుబోని


చరణం 3:

మంగళ కరమనుచు జయ మంగళంబు లందవమ్మ (2)

రంగదాసు నేలనట్టి రక్షించే తల్లివమ్మ (2)


మంగళాంబే శంభురాణి మాణిని ఓ పూవుబోని (2)

బృంగకుంతల వేణివమ్మ పుత్తడి బంగారు బొమ్మ (2)

మంగళాంబే శంభురాణి మణిని ఓ పూవుబోని

No comments:

Post a Comment