అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా
విశ్వైకనాథుడే విచ్చేయునంటా విశ్వైకనాథుడే విచ్చేయునంటా
నీ ఇంటి ముంగిటా నిలుచుండునంటా
నీ ఇంటి ముంగిటా నిలుచుండునంటా
అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా
నా తనువునో తల్లి నీ సేవ కొరకు నా తనువునో తల్లి నీ సేవ కొరకు
అర్పింతునోయమ్మ పై జన్మ వరకు
నా తనువునో తల్లి నీ సేవ కొరకు అర్పింతునోయమ్మ పై జన్మ వరకు
నా ఒడలి అచలాంశ నీ పురము జేరి నా ఒడలి అచలాంశ నీ పురము జేరి
నీ పాద ముద్ర తో నెగడాలి తల్లి నీ పాద ముద్ర తో నెగడాలి తల్లి
అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా, నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా
నా ఒడలి ఉదకాంశ నీ వీడు చేరి నా ఒడలి ఉదకాంశ నీ వీడు చేరి
నీ పాద పద్మాలు కడగాలి తల్లి
నా ఒడలి ఉదకాంశ నీ వీడు చేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి
నా తనువు తేజోంశ నీ గుడికి చేరి నా తనువు తేజోంశ నీ గుడికి చేరి
నీ ముందు దివ్వెగా నిలవాలి తల్లి నీ ముందు దివ్వెగా నిలవాలి తల్లి
నా తనువు మరుదంశ నీ గుడికి చేరి నా తనువు మరుదంశ నీ గుడికి చేరి
నీ చూపు కొసలలో విసరాలి తల్లి
నా తనువు మరుదంశ నీ గుడికి చేరి నీ చూపు కొసలలో విసరాలి తల్లి
నా తనువు గగనాంశ నీ మనికి జేరి నా తనువు గగనాంశ నీ మనికి జేరి
నీ నామ గానాలు మోయాలి తల్లి నీ నామ గానాలు మోయాలి తల్లి
అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా
నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా
నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా
నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా