Saturday, 3 September 2022

Bathukamma songs mouni thammu nadiki

మౌనితమ్మూ నదికి ఉయ్యాలో స్నానమాడగ వచ్చెనుయ్యాలో

వైదేహి శోకంబు . వాల్మీకి ముని వినీ ఉ

చెంత చేరగబోయి . ప్రేమతో పలికించి

అమ్మ మీరెవరమ్మ . అడవిలున్నవు తల్లి

దేవరా మీరెవరు. తెలియగోరెద వేడ్క

వాల్మీకియనువాడను. వనితరో వినవమ్మ

దండములు పదివేలు . దాసురాలను స్వామి

వర్థిల్లవే వనిత . వినిపింపు నీ వార్త

వెలిమితో కాపురము . వేరయా సంకేతముయ్యాలో

తాపసోత్తమ నేను . దశరథ కోడల్ని

గురుకులోత్తమ నేను . జనకపుత్రిని స్వామి

శ్రీరాముని భార్యను . సీతమ్మ యనుదాననుయ్యాలో

కటకట ఇది ఏమి . గర్భవతివి నీవు

ఒక్కదానివి తల్లి . అడవిలున్నవు తల్లి

రాజ్యముల జరిగేది .  మీకు తెలియనిదేమి

చాకలీ మాటలకు . అడవిలో వదిలేసిరుయ్యాలో

అనగ తాపసి వెలసి . వెంటబెట్టుకుపోయి

శిష్యగణులకెల్ల . సీతదేవిని చూపి

ప్రాకటంబుగ ఈమె . లోకమాతని తెలిపె

జనకునీ కూతురు . భూమాత అని తెలిపె

పర్ణశాలలు వేగ . బాగుగా కట్టించె

మునికన్నెలందరూ . మధుసేవ లిచ్చిరీ

రుషి కన్నెలందరూ . స్వాగతంబు పలికె

ప్రతిదినమున చాలా . తేనెఫలములు తెచ్చి

కనికరముతో చాన . కదలిఫలములు తెచ్చి

మక్కువతో చాన . మధుర ఫలములు ఇచ్చి

ఇచ్చుచుండిరి ప్రేమ . ఇట్లు కొన్నినాళ్లు

ప్రసవమయ్యెను బాల . కవలలూ జన్మించె

అది వినీ ఆ మునీ . అధిక సంతసమొందె

జాతకమ్మును రాసి . సీతసన్నిధికేగి

చూసెదా నీ సుతుని . చూసెదా ఇటు తెమ్ము

అనగనే భూజాత . తనయునీ వీక్షించి

మీ తాత వచ్చెను . ఈ రీతి పాడుచూ

చేతులెత్తి భక్తి . చేసెదా దండము

అనుచు ముద్దులు పెట్టి . హస్తయుగము పైన

పట్టి తీసుకు వచ్చి. పాదయుగము పైన

నవ్వుచూ ఆ మునీ . నాయనా అని పిలిచి

ఏ దేశంబూ నీది . ఎక్కడీ కొస్తివి

శ్రీరాము సుతుడవై . ఘోరడవిల పుడ్తివి ఉయ్యాలో

రమణినీ తనయుండు . రామునీ పోలిండు

నీకు శుభము కల్గు . నీ సుతుడు ధన్యుండు

కుశ కుమారయని . కూర్మి పిలువుము తల్లి

లవ కుమారాయని . ప్రేమతో పిలువుమూ

వారి మాటలు వినీ. వాంఛతీరగ మొక్కి

కుశ కుమారాయని . కూర్మి పిలుచూచుండె

లవ కుమారాయని . ప్రేమ పిలుచూచుండె

No comments:

Post a Comment