ఓమనాలు ఆడుదామా వనిత జానకి
స్వామి ఛాయ గురుడ వచ్చె స్వామి రాఘవ
ముత్యాల ఓమన గుంటల పీటలమర్చుకో ముదియ సీతా మనమిద్దరమూ ఆడుదామటె
రత్నాల ఓమన గుంటల పీటలమర్చుకో రమణిసీతా మనమిద్దరమూ ఆడుదామటె
మాణిక్యాల ఓమన గుంటల పీటలమర్చుకో మగువ సీతా మనమిద్దరమూ ఆడుదామటె
ముత్యాల కౌగిట్లు కదలంగ రాములాడెను
పచ్చల బోణీలు కదలంగ పడతి జానకి
పసిడిలిచ్చీ ఎత్తీపట్టి పడతి జానకి
రాములాడెను
రామలాడంగ సీతా ఇండ్లన్నీ వంచలాయెను, వంగలాయెను
వంగలైనా ఇండ్లన్ని సీతా మళ్లీ పోసెను
దంపతులిద్దరు కూడి యాడిరి
రాములోడెను, సీత గెలిచెను
చాలు నేటికి సీతా ఈ ఆట పీట గట్టుము
పీట గట్టా స్వామీ మిమ్మడుగు దాటనివ్వను
పాటిపందెం తప్పీ ఎవరైనా పారిపోదురా
ఇన్ని నేర్చీ చిన్ననాటి తాటకికి బోధ చేస్తిరా
తపస్సు కాస్తిరా
అయితే మీ మీ చేతిలో ఏమి ఉన్నది
నిండున్న అయోధ్య పట్టణమున్నది, పల్లెలున్నావి
అయితే తీసుకో బిందెల్ల వరహాలు ఆట కోసమే
భరతశత్రఘ్నలక్ష్మణ వారు ముగ్గురు
వారితో నేనేమనందును
కౌసల్యాకైకేయిసుమిత్ర వారు ముగ్గురు వారితో నేనేమనందును
మూడువేలు చేయు ముత్యాల హారము ముదిత తీసుకో
నాల్గు వేలు చేయు చంద్ర హారాలన్నీ నాతి తీసుకో
ఐదు వేలు చేయు అద్దపుంగురాలు అతివ తీసుకో
ఏడు వేలు చేయు ఏల్ల ఉంగురాలు వెలతి తీసుకో
తొమ్మిది వేలు చేయు తోరంపు కడ్డీలు తోయజాక్షి తీసుకో
పది వేలు చేయు పచ్చాల పతకమ్ము పడతి తీసుకో
దొడ్డ జానవౌదువే, దొడ్డ నేర్పరౌదువే
వేకుంచక లుంగీలు, కుస్మీక పరుపూలు, జవ్వాజి మొలకాలు, గోల్కొండ వాకిల్లు కానుకంపెద
గొల్లదాన్నీ కాకపోతీ చల్లలమ్ముదు
................
కట్టు రాసి ఇచ్చినవారిని అడుగనంపండి, వారిని పిలువనంపండి
అన్నగారూ మమ్ములను పిలువనంపుటకు కారణమేమయ్యా
చైత్రశుధ్ద శ్రీరామనవమినాడు ఆటలాడితి
ఆటలోడిపోయితి
సీతా గెలుచుకున్నది
పల్లేలడుగుచున్నది, పట్టణమడుగుడుచున్నది
అట్లయితే వాళ్లు నలుగురు అక్కచెల్లెండ్లు రాజ్యమేలియు
మనకింత అన్నంబు పెడితే చాలును
No comments:
Post a Comment