Sunday, 1 September 2019


Mouni tammu nadiki uyyalo, snanamadaga vachi
మౌని తమ్ము నదికి , స్నానమాడగ వచ్చి
వైదేహి శోకమ్ము, వాల్మీకి ముని వినే
చెంత చేరగ బోయి, వింతగా పలికించె
అమ్మ మీరెవరమ్మ, అడవిలున్నవు తల్లి
దేవర మీరెవరు, తెలియగోరెద వేడుక
వాల్మీకి అనువాడనుయ్యాలో, వనితరో వినవమ్మ
దండములు పదివేలు, దాసురాలను స్వామి
వర్ధిల్లవే వనిత, వినిపించు నీ వార్త
వెలిమితో కాపురము, వెలిమి సంకేతము
తాపసోత్తమ నేను, దశరథా కోడల్ని
శ్రీరాముని భార్యనూ, సీతమ్మయనుదాననుయ్యాలో
కటకటా ఇదియేమి, గర్భవతిని నీవు
మీకు తెలియనిదేమి, వేదినీ స్థలమైన
జరుగు సంగతి నోట, వేరయా మనుకుచు
అనగ తాపసి వెలసి, వెంటబెట్టుకుబోయె
శిశ్య గనుల కెల్ల, సీత దేవిని జూపి
ప్రాకటంబుగ ఈమె, లోకమాతని దెలిపి
పర్ణశాలలు వేగ, బాగుగా కట్టించి
ముని కన్నెలు కొందరు, మధు సేవ నుండి
దినదినమున చాలా, తేనె ఫలములు దెచ్చి
ఇచ్చుచుండిరి ప్రేమ, ఇట్లు కొన్నినాళ్లు
ప్రసవమయ్యెను బాల, బాలులకు కనెను
అది వినీ ఆ మునీ, అధిక సంతసమొంది
జాతకమ్మును జూసి, సీత సన్నిధి కేగి
చూసుతా నీ సుతుని, చూసుతా ఇటు దెమ్ము
అనగనే భూజాత, తనివిని దీక్షించి
మీ తాత వచ్చెను, ఈ రీతి పాడుచూ
చేతులెత్తి భక్తి, చేసేవ దండమూ
అనుచు ముద్దులు పెట్టి, హస్త ముకము పైన
పట్టి తీసుకు వచ్చి, పాద యుగము పైన
నవ్వుచూ ఆ మునీ, నాయనా అని పిలిచి
ఏ దేశం మీది, ఎక్కడికి వస్తిరీ
శ్రీరాము సుతుడవై, ఘోరడవిల పుడ్తిరీ
రమణీ నీ తనయుడు, రామున్ని పోలిండు
నీకు శుభమూ కూడ, నీ సుతుడు ధన్యుండు
కుశ కుమార అనీ, కూర్మి పిలువుము తల్లి
లవ కుమార అనుచు, ప్రేమతో పిలువమ్మ
వారి మాటలు వినీ, వాంఛ తీరగ మొక్కి

No comments:

Post a Comment