Sunday, 1 September 2019

Uyyala song
మా తల్లి గౌరమ్మ ఉయ్యాలో, మము రక్షించమ్మ ఉయ్యాలోమా బంగరు తల్లి, మమ్ము గావవే తల్లికోటి దండాలు నీకు, కనకా దుర్గమ్మరాశిగా నీకు దండం, రాజేశ్వరి మాతమేటి ఇలవేల్పువూ, ధరణిలోన నీవుసాటి నీకెవరమ్మ, సల్లగుంచవె తల్లికచ్చీరు బాటలో, బాలలందరు గూడిబొడ్రాయి మూలలో, మహిలందరు గూడిభక్తులందరు నిన్ను, భక్తితో కొలవంగఉయ్యాల పాటలతో, కోలాట ఆటలతోడప్పుల మోతలతో, దరువులూ ఎయ్యంగకైలాస గిరి నుండి, కదిలీ రావమ్మనైవేద్యములనన్ని, ఆరాగించవమ్మముత్తైదువులందరూ, స్తుతియించినారమ్మముకుళిత హస్తములతో, పూజించినారమ్మసత్వరంబుగ వచ్చి, దీవించు మాయమ్మసౌభాగ్యములనిచ్చి, కాపాడు మాయమ్మఓం నమశ్శివాయంచు, మంత్రంబు చదువుచూపార్వతీ స్తోత్రంబు, భక్తితో పఠియించగౌరి శంకరుల దయ, ఘనముగా చేకూరుసర్వ శుభములు కలుగు, సంపదలు వర్ధిల్లుభక్తులందరు గూడి, నీ పూజ జేసేరుభజనలతో నిన్నంత, పూజించినారమ్మభగవతీ భారతీ, శారదా శాంభవీజగములోన నీకు, సాటీ లేరమ్మఅసురులను శిక్షించి, ఆర్తులను కాపాడిఅమ్మలకు అమ్మవూ, బంగారు తల్లివీఆది మాతవు నీవు, ఆది శక్తివి నీవుఅమ్మ కనక దుర్గా, నీరాజనాలమ్మకాళి మాతవు నీవే, కనక దుర్గవు నీవేదుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించుఅష్టైశ్వర్యంలనిచ్చి, ఆదుకో మా తల్లికష్టాలు తొలగించి, కాపాడు మా తల్లినిఖిల జగతిని నీవు, నీ చల్లని చూపులతోబ్రోచేటి మా తల్లి, నీకు దండాలమ్మకాచేటి మా తల్లి, నీకు నీరాజనంసకల జనులందరూ, సుఖముతో వర్ధిల్లసౌభాగ్యములనిచ్చి, దీవించు మా యమ్మ

No comments:

Post a Comment