హిమవంతూనింట్లో పుట్టి, హిమవంతూనింట్లో పెరిగి
విదియాట్ల తదియ నాడు, కాంతాలందరూ గూడి
గన్నేరు పువ్వుల్దెచ్చి, గౌరమ్మా పూజ జేసి
వత్తి పత్తినీ పెట్టి, వడీ బియ్యమూ పోసి
వరుసతో సద్దులు కలిపి, ఆ శంభునికప్పాగించీ
మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మా
అత్తమామల పట్లా శాన, అతి భక్తి కలిగి ఉంటే
వంచన్న కలిగి ఉంటే, ఒద్దీక కలిగి ఉంటే
బుద్ధిమంతురాలవైతే, పుట్టిన ఇంటికి కీర్తి తెస్తే
ఎల్లారూ ముద్దూ వలే, ప్రేమతో నీకు చీరెలు పెడుతూ
ప్రేమతో నీకు సారెలు పెడుతూ, అమ్మా నిన్నూ అంపేనమ్మా
మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మా
బావా మరుదులా యెడల, భయ భక్తి కలిగి ఉంటే
వంచన్న కలిగి ఉంటే, ఒద్దీక కలిగి ఉంటే
బుద్ధిమంతురాలవైతే, పుట్టిన ఇంటికి కీర్తి తెస్తే
ప్రేమతో నీకు సారెలు పెడుతూ, అమ్మా నిన్నూ అంపేనమ్మా
మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మా
వదినా మరదల్ల యెడల, ఒద్దీక కలిగి ఉంటే
పాటించిన దీపావళి, పండుగ పదినాల్లున్నాదనగ
నాటీకే తొలుక వస్తు, కుంకుమ్మ కాయలిస్తూ
కుదురూగ దొంతులిస్తూ,. ఆడితే బొమ్మలిస్తూ
అపరంజి మొంటెలిస్తు, పట్టంపూ ఏనుగునిస్తు
పంచా కళ్యాణినిస్తు
మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మా
ఇంకారు నెల్లున్నాది, సంకురాతిరి పండుగనాటికి
నాటీకే తొలుక వస్తు, కాటూక కాయలిస్తు
కరకంచు చీరెలిస్తూ, చీని చీనాంబరాలిస్తు
దిగువున్న రత్నాలిస్తు, దివ్యా భూషణములనిస్తు
ముత్యాలా హారాలిస్తు, నీ ప్రాణ నాథూనికి
నిలువూటద్దములిస్తూనమ్మా, చక్కనిజాకెట్లిచ్చేనమ్మా
సరిమోయీ గొలుసూలిస్తు, సరివేల గజ్జెలిస్తూ
ఎక్కని దాహాలిస్తూనమ్మా, ఏలా రాజ్యములూ ఇస్తూ
పడకింటికి అందామైన, పట్టెమంచం, పరుపులు ఇస్తు
పన్నీటి దిండ్లనిస్తు, అన్నీట ఇండ్లు ఇస్తు
కాళింగ సురటీలిస్తు, గంధాపు గిన్నెలిస్తూ
చంద్రకానీ చీరెలిస్తూ, మల్లెమొగ్గల రవికెలిస్తూ
మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మా
ఇంత సారె తెస్తిననుచూ, ఇంటివారితో ఎదురాడకు
మాటంటే మారాడకు, ఓటంటే రెండనకూ
ఏకాంతమైన చోట, ఎంత స్నేహితులైనా గానీ
అంతరంగము జెప్పబోకు, పరుల జూసి భ్రమయాబోకు
పడుచూదనమూ సేయబోకు, చిన్నీ గజ్జెల పాదం
గిలకొట్టి నడువబోకు, భూమి దేవీ అదిరేనమ్మా
ధరణీ దేవి అదిరేనమ్మా, అతడంటే చెల్లు గానీ
అలుగరాదు ఆడ జాతి, అష్టా కంకణాల చేయి
విసిరీ లిసిరీ నడువబోకు, పైనున్నా పవిటా సిరులు
జారవిడిచీ నడువ బోకు, రచ్చావారూ నవ్వేరమ్మా
అటుగాక మీ తండ్రికీ, చుట్టాలూ కలిగున్నారు
బంధూవులు కలిగున్నారు, మేనత్త కొడుకానీ
మేనా తిప్పి తిరుగబోకు, చనుమానంబున తిరుగాబోకు
సంధ్య నిద్ర మరువే తల్లి, చీకాటితో పనిచేయమ్మా
ఇంతమ్మిన ఫలమెంతో నందురు, పాలా వారిధి సుమ్మీ
పడతీ నీవు పుట్టిన ఇంట్ల, అడుగడూ ఒక్కా చలువ
అమ్మా నీవు కట్టుకున్న, పుట్టింట తెచ్చుకున్న
విలువా లేని చీరెలందురు
మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మా
పోయిరా మా తల్లి పోయిరావమ్మా
పోయి మీ అత్తింట్లో బుద్ది కలిగుండూ
ఎవరేమన్ననూ ఎదురాడకమ్మా
వీధినా నిలుచుండి తలవిచ్చబోకమ్మ
పలుమార్లు పల్లెత్తి నవ్వబోకమ్మా
పరమేశ్వరునితో గూడి, తిరుగు మాయమ్మ
నూట పదహారువేల నాటి సుందరులూ
వారినీ కాదనీ పూలు ముడువబోకమ్మ
కురుస్తే కురువేల తోటలున్నాయి
వెలిస్తే వేలవోలు నేనిచ్చెదాను
అత్తవారితో పొత్తు పాయకే తల్లీ
అత్తవారూ మంచి వేములా తీపి
కత్తి మెత్తని సాము కద్దటే చెలియా
మక్కువగా మగ వారి మాట నమ్మకుమా
అరిటాకు వంటిదీ ఆడ జన్మంబూ
ఎన్ని అన్నా గానీ చిన్న బోకమ్మా
శివ పుత్రునెత్తుకుని జాడ రావమ్మా
మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మా
చిత్తాన ఒకనాడు చిన్న బోకమ్మా
మమ్ము రచ్చకీడ్చకే మముగన్న తల్లీ
ఉన్నదే మా తల్లి వంశానికెల్లా
పొన్న రంగని భార్య పెద్దామె వచ్చి
కోటి బ్రంహ్మాండంతో రవ్వల పెట్టెలతో
అంతకన్నా మిక్కిలంపింతునమ్మా
పాడి ఆవుల మీద పాలకంపేనూ
వాకిటా ఉన్నా గొల్లలంపేనూ
కరుసోగు పచ్చలా గాజులా కాంతి
చెక్కనపు వజ్రాల కమ్మలంపేను
చేరి చుక్కల తల్లి సేవించవమ్మా
నక్షత్ర వీధులూ నేనిచ్చెదానూ
నిలువెత్తు బంగారు నీవే మాయమ్మా
నిలువుటద్దములూ నేనిచ్చెదానూ
చిలుకలా చిక్కూ నీవీయవమ్మా
బొమ్మలున్నాయి, బొమ్మరిల్లులున్నాయి
మీరాడుకూనే పూల తోటలున్నాయి
ఎప్పటికైనా వచ్చి ఆడుకోండమ్మా
శివ పుత్రునెత్తుకుని చూడరాండమ్మా
పుట్టినిల్లే నీకు చుట్టాలయ్యారు
శ్రీకృష్ణుడే నీకు జలజీవనుండూ
రెట్ట పట్టిన వేళ మంచివేళయితే
కృష్ణునికి పట్టంపు దేవివౌతావు
తిరిగి ఎన్నాళ్ళకో మళ్లి వచ్చేది
ద్వారకా అత్తిల్లు పోయిరావమ్మా
అన్న పూర్ణా దేవి దయఉంచవమ్మా
ఆదిలక్ష్మీ అత్తిల్లు పోయి రావమ్మా
మాయమ్మ నీనడత ఛాయ శృంగారం
కందకుండా తిరుగు నీవు మాయమ్మా
తా వదినె గారూ చెప్ప వచ్చిందీ
కారినా కన్నీరు కొంగునా తుడిచీ
కట్నమిస్తామటే కమలాక్షి మనమూ
చీరెల్లో కెల్లా ఏ చీర ఘనమూ
ఎర్ర పట్టు చీర నాతికందమ్ము
పచ్చ పట్టు రవికె పడతికందమ్ము
కొబ్బరీ కుడుకలూ సారె తెప్పించీ
పసుపు కుంకుమతోను సారె పెట్టించీ
మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మా
అంపరాటే వారి ఆడ పడుచునూ
అట్లయితే అలాగే ఉంచుకొమ్మనిరీ
పసిబిడ్డలు కూతురు పారాడనేరాదు
ఔరౌర గౌరవమే, ఔరౌర రాజసమే
పల్లకీలెటుపోయిరి, బంట్లు ఎటు బోయిరీ
మన వెంట వచ్చినా మంది ఎటు పోయిరీ
కదలవలె ఈ దండు కడు శీఘ్రముగనూ
అమర గుండములవంటి ఆడ పడుచులను
చెట్టుపెట్టి నీళ్ళు పోసి పెంచినామూ
కాయేమో కొడకని మీ చేతిలోది
కన్న ఫలములు మావి, కడు వేడుక సుమ్మీ
కుంకుమలో పుట్టిన గౌరమ్మా
కుంకుమలో పెరిగిన గౌరమ్మా
కుంకుమ వసంతమాడిన గౌరమ్మా

No comments:
Post a Comment