గం గం గం గం గణపతి వదనం
ఐం హ్రీం క్లీం సౌం సుందర సదనం
గణపతి వదనం సుందర సదనం
వరప్రదాయక వాంఛిత ఫలదం
గణపతి బోధనం అగణిత సాధనం
గణపతి తత్త్వం అంతర్గహనం
గణపతి స్మరణం పాతక హరణం
విఘ్న వినాశక విద్యా వారిధిం
గణపతి ధ్యానం అమితానందం
గణపతి గానం శ్రవణానందం
గణపతి చరణం వినాశ హరణం
గణనాథునికి అభివందనము
గణపతి వదనం సుందర సదనం
సుందర సదనం గణపతి వదనం
+++++++++++++++++++++++++++++++++++++++++++++
హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరి నారాయణ హరీహరీ
హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరి నారాయణ హరీహరీ
గోదాదేవి వలచిన స్వామి శ్రీ రంగనాథా హరీహరీ
ఒప్పుగ నీలను పెండ్లాడిన శ్రీరంగ ధాముడవు సరీసరీ
హరిలో రంగహరి హరిలో రంగహరి హరినారాయణ హరీహరీ
హరిలో రంగహరి హరిలో రంగహరి హరినారాయణ హరీహరీ
మకర సంక్రమణ పుణ్యకాలమున శ్రీహరి నామము సరీసరీ
భక్త జనుల గొంతెత్తి పాడిన మదిలో నిండెను మరీమరీ
హరిలో రంగహరి హరిలో రంగహరి హరినారాయణ హరీహరీ
హరిలో రంగహరి హరిలో రంగహరి హరినారాయణ హరీహరీ
గోకుల నందన గోపాల కృష్ణ గోవింద నామా హరీహరీ
పల్లెసీమను చల్లగ చూడగ పాడెద నేను కోరీకోరీ
హరిలో రంగహరి హరిలో రంగహరి హరినారాయణ హరీహరీ
హరిలో రంగహరి హరిలో రంగహరి హరినారాయణ హరీహరీ
+++++++++++++++++++++++++++++++++++++++++++++++
త్యాగరాజ కీర్తన
ఆది తాళం
పల్లవి:
రామ కోదండ రామ, రామ కళ్యాణ రామా
రామ కోదండ రామ, రామా కళ్యాణ రామా
రామ పట్టాభి రామ, రామ సాకేత రామ
చరణం: 1
రామ సీతాపతి, రామ నీవే గతి
రామా నీకు మ్రోకితి , రామా నీ చే జిక్కితి || రామ కోదండ రామ ||
చరణం: 2
రామా నీకెవరు తోడు, రామ క్రీగంట చూడు
రామా నేను నీవాడు, రామా నాతో మాటాడు || రామ కోదండ రామ ||
చరణం: 3
రామ నామమే మేలు , రామ (స్వామి) చింతనే చాలు
రామ నీవు నన్నేలు, రామ రాయడే చాలు || రామ కోదండ రామ ||
చరణం: 4
రామ నీకొక మాట, రామ నాకొక మూట
రామ నీ పాటే పాట, రామ నీ బాటే బాట || రామ కోదండ రామ ||
చరణం: 5
రామ నేనెందైనను, రామ వేరెంచ లేను
రామ ఎన్నడైనను, రామ బాయక లేను || రామ కోదండ రామ ||
చరణం: 6
రామ విరాజ రాజ, రామ ముఖ జిత తేజా
రామ భక్త సమాజ రక్షిత త్యాగరాజ || రామ కోదండ రామ ||
++++++++++++++++++++++++++++++++++++++++++++++
కలగంటిని, నేను కలగంటిని, కలలోన తల్లిని కనుగొంటిని
ఎంత బాగున్నదో మము గన్న తల్లీ, ఎన్నాళ్ళకెన్నాళ్ళకగుపించే మళ్లీ-- కలగంటిని --
చరణం: 1
మెడలోన అందాల మందార మాల, జడలోన మల్లెల కుసుమాల హేల,
ఆ మోములో వెలుగు కోటి దీపాలు,
ఆ తల్లి పాదాలు దివ్య కమలాలు, -- కలగంటిని --
చరణం: 2
కంచి కామాక్షియా కాకున్న నేమి, కాశీ విశాలాక్షి కాకూడదేమి,
కరుణించి చూసినా వెన్నెలే కురియు
కన్నెర్ర జేసిన మిన్నులే విరుగు -- కలగంటిని, --
చరణం: 3
పోల్చుకున్నానులే పోల్చుకున్నాను..వాల్చి మస్తకముచే ప్రణమిల్లినాను-2
అనుపమ రూఢిచే వాగ్యస్థము చేత - 2
ఆమె ఎవరో కాదు భారత మాత....భారత మాత....భారత మాత .
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
చక్కని తల్లికి చాంగుభళా తన
చక్కెర మోవికి చాంగుభళా
కులికెడి మురిపెపు కుమ్మరింపు తన
సళుపు జూపులకు చాంగుభళా
పలుకుల సొంపుల బతితో గసరెడి
చలముల యలుకకు చాంగుభళా
కిన్నెరతో పతి కెలన నిలుచు తన
చన్ను మెఱుగులకు చాంగుభళా
ఉన్నతి బతిపై నొరగి నిలుచు తన
సన్నపు నడిమికి చాంగుభళా
జందెపు ముత్యపు సరులహారముల
చందన గంధికి చాంగుభళా
విందయి వెంకట విభుబెన చినతన
సంది దండలకు చాంగుభళా