సావేరి - ఆది, తిశ్ర గతి
పల్లవి:
శంకరి శంకురు చంద్రముఖి అఖిలాండేశ్వరి
శాంభవి సరసిజభవ వందితే గౌరి అంబ॥
అను పల్లవి:
సంకటహారిణి రిపువిదారిణి కల్యాణి
సదా నత ఫలదాయికే హర నాయికే జగజ్జనని॥
చరణము(లు):
జంబూపతి విలాసిని జగద వనోల్లాసిని కంబు
కంధరే
భవాని కపాల ధారిణి శూలిని॥
అంగజరిపుతోషిణి అఖిలభువనపోషిణి
మంగళప్రదే మృడాని మరాళసన్నిభ గమని॥
శ్యామకృష్ణ సోదరి శ్యామళే శాతోదరి
సామగానలోలే బాలే సదార్తిభంజన శీలే॥
No comments:
Post a Comment