Friday, 30 August 2019

పొడల పొడల గట్ల నడుమ సందమామ
పొడల పొడల గట్ల నడుమ ఓ రాచ గుమ్మడి,  పొడిసే నొక్క సందమామ ఓ రాచ గుమ్మడి ||2||
ఆకూ చిన్నా అడవిలోన ఓ రాచ గుమ్మడి, నాకూ సిన్న దండా దొరికే ఓ రాచ గుమ్మడి ||2||
దండా పేరే పూలా దండా ఓ రాచ గుమ్మడి, దానీ పేరే గోలుకొండ ఓ రాచ గుమ్మడి ||2||
గోలుకొండ గొల్ల రాజా ఓ రాచ గుమ్మడి, సల్లలమ్మే పల్లెలయ్యే ఓ రాచ గుమ్మడి ||2||
సల్లాలమ్మే పల్లెలయ్యి ఓ రాచ గుమ్మడి, పడుచూవన్నె పాటలయ్యే ఓ రాచ గుమ్మడి ||2||
పడుచూవన్నె పాటలయ్యి ఓ రాచ గుమ్మడి, బతుకమ్మ ఆటాలయ్యే ఓ రాచ గుమ్మడి ||2||
బతుకమ్మబతుకమ్మా ఉయ్యాలో, బంగారి గౌరమ్మ ఉయ్యాలో ||2||
యాడాదికో సారి ఉయ్యాలో, మాయింటికొస్తావా ఉయ్యాలో ||2||
పెత్తురామాస నాడు ఉయ్యాలో, మావాడ కొస్తావా ఉయ్యాలో ||2||
వచ్చినట్టేవచ్చి ఉయ్యాలో, మురిపించి పోతావా ఉయ్యాలో ||2||
మాఇండ్ల గడపల్లో ఉయ్యాలో బంతీ తోరణాలు ఉయ్యాలో ||2||
మావాడ వాకిళ్లో ఉయ్యాలో, రంగూరంగుల ముగ్గులుయ్యాలో ||2||
మా అన్నదమ్ములు ఉయ్యాలో, తీరొక్కపూదెచ్చిరి ఉయ్యాలో ||2||
గురుగుపూలూబేర్చి ఉయ్యాలో, గౌరీ నిను మొక్కితి ఉయ్యాలో ||2||
మల్లేపూలూపేర్చి ఉయ్యాలో, అమ్మానిను కొలిస్తి ఉయ్యాలో ||2||
తంగేడుపూపేర్చి ఉయ్యాలో, తల్లీ నిను పూజిస్తితి ఉయ్యాలో ||2||
మా అమ్మాలక్కలు ఉయ్యాలో, సద్దులు వండిరి ఉయ్యాలో
పట్టుచీరెల పడుచూలుయ్యాలో, ఇంటాడబిడ్డలూ ఉయ్యాలో
నాలుగుబాట్ల కాడ ఉయ్యాలో, శెరువుగాట్ల కాడ ఉయ్యాలో
బతుకూపాటనుజేసి ఉయ్యాలో బతుకమ్మాలాడిరి ఉయ్యాలో ||2||
బతుకమ్మా నీయింట ఆటసిలకలు రెండు పాటాసిలకలు రెండు
కలికీసిలకలు రెండు కందమ్మబిడ్డలూ ముత్యపుగొడుగులు
ముమ్మాసిరి మేడలు తారుద్దరాక్షలు తీరూగోరింటాలు
ఘనమైన పొన్నాపూవే గౌరమ్మ, గజ్జలవడ్డాణము గౌరమ్మ ||2||
సిన్నశ్రీవత్తులు గౌరమ్మ, సన్నదీపాలూ గౌరమ్మ ||2||
నీనోము నీకిస్తూమూ గౌరమ్మ, మానోము ఫలమియ్యమ్మా గౌరమ్మ ||2||
పొడల పొడల గట్ల నడుమ ఓ రాచ గుమ్మడి,  పొడిసే నొక్క సందమామ ఓ రాచ గుమ్మడి ||2||
ఆకూ చిన్నా అడవిలోన ఓ రాచ గుమ్మడి, నాకూ సిన్నా దండా దొరికే ఓ రాచ గుమ్మడి ||2||
దండా పేరే పూలా దండా ఓ రాచ గుమ్మడి, దానీ పేరే గోలుకొండ ఓ రాచ గుమ్మడి ||2||
దానీ పేరే గోలుకొండ ఓ రాచ గుమ్మడి ||2||

Wednesday, 28 August 2019

దేశ దేశంబోయి ఉయ్యాలో, దేశంబు బోయి ఉయ్యాలో
తెచ్చెనే ఆ శివుడు ఉయ్యాలో, గంగవాయిలి కూర ఉయ్యాలో
వండుమని గౌరమ్మను ఉయ్యాలో, వల్లె పెట్టినాడు ఉయ్యాలో
అన్ని రుచులు వేసి ఉయ్యాలో, గౌరి వండినాది ఉయ్యాలో
గౌరి వండిన కూర ఉయ్యాలో, శివుడు మెచ్చడాయే ఉయ్యాలో
మెచ్చకుంటె ఒక దాన్ని ఉయ్యాలో, తెచ్చుకోరాదయ్య ఉయ్యాలో
తెచ్చుకుంటే మీరు ఉయ్యాలో, కూడి ఉంటారామ్మ ఉయ్యాలో
కూటి గుడ్డ కున్న ఉయ్యాలో, కూడి యుండకేమి ఉయ్యాలో
అన్న వస్త్రముకున్న ఉయ్యాలో, అణిగి యుండకేమి ఉయ్యాలో
దేశ దేశం బోయి ఉయ్యాలో, దేశంబు బోయి ఉయ్యాలో
తెచ్చెనే ఆ శివుడు ఉయ్యాలో, జడలోన గంగనూ ఉయ్యాలో
గంగమ్మ గౌరమ్మ ఉయ్యాలో, నీల్లకెల్లినారు ఉయ్యాలో
గంగ తోడిన చెలిమె ఉయ్యాలో, నీల్లూరినాయి ఉయ్యాలో
గౌరి తోడిన చెలిమె ఉయ్యాలో, పాలూరినాయి ఉయ్యాలో
గౌరమ్మను గంగమ్మ ఉయ్యాలో, కాలెత్తి తన్నె ఉయ్యాలో
నిలిచి జగడమాయె ఉయ్యాలో, అడ్డు గోడలాయె ఉయ్యాలో
నిక్క జూసి శివుడు ఉయ్యాలో, నీతి కాదని చెప్పె ఉయ్యాలో
అక్క నన్ను తన్నితే ఉయ్యాలో, రాలినా మన్నును ఉయ్యాలో
కొడుకు వీరన్నకూ ఉయ్యాలో, కోట కట్టిస్తునూ ఉయ్యాలో
కోడలు భద్రకాళికి ఉయ్యాలో, మేడ కట్టిస్తునూ ఉయ్యాలో
దేవునీ పూజలకు ఉయ్యాలో, గద్దె కట్టిస్తునూ ఉయ్యాలో
నీకు నాకు అనగ ఉయ్యాలో, సరి గద్దె కట్టిస్తు ఉయ్యాలో
సరి గద్దె కట్టియ్య ఉయ్యాలో, సరిదానివటే ఉయ్యాలో
సరిదాన్ని కాకుంటె ఉయ్యాలో, శివుడెట్ల మెచ్చునూ ఉయ్యాలో
శివుడెట్లా తెచ్చు ఉయ్యాలో, జగమెట్లా మెచ్చు ఉయ్యాలో
అంతలో గౌరమ్మ ఉయ్యాలో, నేల చింగు మాసె ఉయ్యాలో
చింగు కడుగుదామంటే ఉయ్యాలో, నీళ్ళు లేకపాయే ఉయ్యాలో
స్తంబాల బాయిలో ఉయ్యాలో, చూసిరాపోరాదు ఉయ్యాలో
స్తంబాల బాయిలో ఉయ్యాలో, చారెడైనా లేవు ఉయ్యాలో
వీరప్ప కుంటలో ఉయ్యాలో, చూసిరాపోరాదు ఉయ్యాలో
వీరప్ప కుంటలో ఉయ్యాలో, ఇన్నైనా లేవు ఉయ్యాలో
కోమటి కుంటలో ఉయ్యాలో, చూసిరాపోరాదు ఉయ్యాలో
కోమటి కుంటలో ఉయ్యాలో, కొంచెమైనా లేవు ఉయ్యాలో
అంతలో గౌరమ్మ ఉయ్యాలో, గంగ జాడకు పాయె ఉయ్యాలో
కొడుకు కోటలోన ఉయ్యాలో, గంగమ్మ లేదు ఉయ్యాలో
అక్కన్నుండి గౌరమ్మ ఉయ్యాలో, కోడలు మేడకు పాయె ఉయ్యాలో
కోడలు మేడ లోన ఉయ్యాలో, గంగమ్మ లేదు ఉయ్యాలో
అక్కన్నుండి గౌరమ్మ ఉయ్యాలో, శివుని జాడకు పాయె ఉయ్యాలో
శివుని వద్ద గంగమ్మ ఉయ్యాలో, కూర్చొని ఉండె ఉయ్యాలో
అక్క నీకు శరణు ఉయ్యాలో, కదిలి రావే గంగ ఉయ్యాలో
నాకున్న చీరెలూ ఉయ్యాలో, నీకిస్తనే గంగ ఉయ్యాలో
నీకున్న చీరెలూ ఉయ్యాలో, నాకున్నవే గౌరి ఉయ్యాలో
అక్క నీకు శరణు ఉయ్యాలో, కదిలి రావే గంగ ఉయ్యాలో
నాకున్న రవికెలూ ఉయ్యాలో, నీకిస్తనే గంగ ఉయ్యాలో
నీకున్న రవికెలూ ఉయ్యాలో, నాకున్నవే గౌరి ఉయ్యాలో
అక్క నీకు శరణు ఉయ్యాలో, కదిలి రావే గంగ ఉయ్యాలో
నాకున్న కొడుకునూ ఉయ్యాలో, నీకిస్తనే గంగ ఉయ్యాలో
నీకు కొడుకు అయితే, నాకు కొడుకు కాదా ఉయ్యాలో
అక్క నీకు శరణు ఉయ్యాలో, కదిలి రావే గంగ ఉయ్యాలో
నాకున్న కోడల్ను ఉయ్యాలో, నీకిస్తనే గంగ ఉయ్యాలో
నీకు కోడలైతే ఉయ్యాలో, నాకు కోడల్ గాదా ఉయ్యాలో
అక్క నీకు శరణు ఉయ్యాలో, కదిలి రావే గంగ ఉయ్యాలో
నాకున్న శివున్ని ఉయ్యాలో, నీకిస్తనే గంగ ఉయ్యాలో
అప్పుడూ గంగమ్మ ఉయ్యాలో, కదిలీ వచ్చెనూ ఉయ్యాలో
జిల్లేడు చెట్ల కింద ఉయ్యాలో, పారెనూ గంగమ్మ ఉయ్యాలో
తంగేడు చెట్ల కింద ఉయ్యాలో, పారెనూ గంగమ్మ ఉయ్యాలో





















राम राम राम उय्यालो रामने श्रीराम उय्यालो
राम रामानंदि उय्यालो रागमॆत्तरादु उय्यालो
नेत्ति मीद सूर्युडा , नॆल वन्नॆ काड
पापट्ल चंद्रुडा बाल कुमारुडा
पेद्दलकु वच्चिंदि, पॆत्तरामास
बाललकु वच्चिंदि, बतुकम्म पंडुग
तॆल्ल तॆल्लयि गुळ्ळु, तॆल्लयम्मा गुळ्ळु
पन्नॆंडेंड्ल नाडु पात बड्ड गुळ्ळु
तॆल्लयू ऎमुलाड, राजन्न गुळ्ळु
नल्ल नल्लयि गुळ्ळु, नल्लयम्मा गुळ्ळु
नल्लयू नल्गॊंड, नरसिंह गुळ्ळु
पच्च पच्चयि गुळ्ळु, पच्चयम्मा गुळ्ळु
पच्चयी पर्वताल, मल्लन्न गुळ्ळु






हरिहरिय ओ राम हरिय ब्रह्म देव
हरियन्न वारिकि  आपदलू रावु
शरणन्न वारिकी मरणंबु लेदु
मुंदुगा निनु तल्तु मुत्याल पोषम्म
तर्वात निनु तल्तु तल्लिरो पॆद्दम्म
आदिलो निनु तल्तु अयिलोनि मल्लन्न

Tuesday, 27 August 2019


రామ రామ రామ ఉయ్యాలో - బతుకమ్మ పాట
రామ రామ రామ ఉయ్యాలో 
రామనే శ్రీరామ ఉయ్యాలో ॥2॥
రామ రామ నంది ఉయ్యాలో
రాగమెత్తరాదు ఉయ్యాలో ॥2॥
నెత్తిమీద సూర్యుడా ఉయ్యాలో 
నెల వన్నెకాడ ఉయ్యాలో ॥2॥
పాపట్ల చంద్రుడా ఉయ్యాలో 
బాలకుమారుడా ఉయ్యాలో ॥2॥
పెద్దలకు వచ్చింది ఉయ్యాలో
పెత్తారామాస ఉయ్యాలో ॥2॥
బాలలకు వచ్చింది ఉయ్యాలో
బతుకమ్మ పండుగ ఉయ్యాలో ॥2॥
తెల్లతెల్లయి గుళ్లు ఉయ్యాలో
తెల్లయమ్మా గుళ్ళు ఉయ్యాలో ॥2॥
పన్నెండేండ్ల నాడు ఉయ్యాలో
పాతవడ్డ గుళ్ళు ఉయ్యాలో ॥2॥
తెల్లయి ఏములాడ ఉయ్యాలో 
రాజన్న గుళ్ళు ఉయ్యాలో ॥2॥
నల్లనల్లయి గుళ్ళు ఉయ్యాలో
నల్లయమ్మా గుళ్ళు ఉయ్యాలో ॥2॥
నల్లయి నల్లగొండ ఉయ్యాలో
నరసింహా గుళ్ళు ఉయ్యాలో ॥2॥
పచ్చపచ్చయి గుళ్ళు ఉయ్యాలో
పచ్చయమ్మా గుళ్ళు ఉయ్యాలో ॥2॥
పచ్చయి పర్వతాల ఉయ్యాలో
మల్లన్న గుళ్ళు ఉయ్యాలో ॥2॥
పర్వతాల మల్లన్న ఉయ్యాలో
పదములు సెలవయ్యా ఉయ్యాలో ॥2॥
రామ రామ రామ ఉయ్యాలో 
రామనేశ్రీ రామ ఉయ్యాలో ॥2॥
ఇద్దరక్కా చెల్లెళ్ల ఉయ్యాలో
ఒక్క ఊరికిస్తే ఉయ్యాలో ॥2॥
ఒక్కడే మాయన్న ఉయ్యాలో
చూసన్నా వోడాయే ఉయ్యాలో ॥2॥
ఎట్ల వత్తు చెల్లెళ్ల ఉయ్యాలో
ఏరు అడ్డమాయే ఉయ్యాలో ॥2॥
ఏరుకు ఎలుపల్ల ఉయ్యాలో
తలుపు అడ్డమాయే ఉయ్యాలో ॥2॥
తలుపులకు తాళాలు ఉయ్యాలో
వెండి సీలాలు ఉయ్యాలో ॥2॥
వెండి సీల కింద ఉయ్యాలో
వెలపత్తి చెట్టు ఉయ్యాలో ॥2॥
వెలపత్తి చెట్టుకి ఉయ్యాలో
ఏడు విత్తులపత్తి ఉయ్యాలో ॥2॥
ఏడు గింజల పత్తి ఉయ్యాలో
ఎల్లనే ఆ పత్తి ఉయ్యాలో ॥2॥
ఆ పత్తి తీసుకుని ఉయ్యాలో
ఏడికి వోయిరి ఉయ్యాలో ॥2॥
పాలపాల పత్తి ఉయ్యాలో
పావురాయి పత్తి ఉయ్యాలో ॥2॥
ముసల్ది వడికింది ఉయ్యాలో
ముద్దుల పత్తి ఉయ్యాలో ॥2॥
వయస్సుది వడికింది ఉయ్యాలో
వన్నెల పత్తి ఉయ్యాలో ॥2॥
చిన్నది వడికింది ఉయ్యాలో
చిన్నెల పత్తి ఉయ్యాలో ॥2॥
ఆ పత్తి ఈ పత్తి ఉయ్యాలో
సాలె చింతల పత్తి ఉయ్యాలో ॥2॥
సాలె చింతలగాడ ఉయ్యాలో
సంగడి సారన్న ఉయ్యాలో ॥2॥
సంగడి సారన్న ఉయ్యాలో
సాగదీయవట్టే ఉయ్యాలో ॥2॥
సాగదీయవట్టే ఉయ్యాలో
ఆ పత్తి వడికి ఉయ్యాలో ॥2॥
ఆ పత్తి వడికిన ఉయ్యాలో
నెలకొక పోగు ఉయ్యాలో ॥2॥
దీవినె ఆ చీర ఉయ్యాలో
దివిటిల మీద ఉయ్యాలో ॥2॥
ఆ చీర కట్టుకుని ఉయ్యాలో
కొంగల బావికి ఉయ్యాలో ॥2॥
నీళ్లకంటూ పోతే ఉయ్యాలో
కొంగల బావికి ఉయ్యాలో ॥2॥
ఆ చీర కట్టుకుని ఉయ్యాలో
హంసల బావికి ఉయ్యాలో ॥2॥
హంసలన్నీ చేరి ఉయ్యాలో
అంచునంతా చూసే ఉయ్యాలో ॥2॥
ఆ చీర కట్టుకుని ఉయ్యాలో
పట్నంబు పోతిని ఉయ్యాలో ॥2॥
పట్నంబు పారిని ఉయ్యాలో
కొంగు బంగారేమో ఉయ్యాలో ॥2॥
కొంగు బంగారంబు ఉయ్యాలో
ఈ చీరలున్నాయా ఉయ్యాలో ॥2॥
గొప్పగా సాలెళ్ళు ఉయ్యాలో
నేసినారు ఈ చీర ఉయ్యాలో ॥2॥
దిగినే ఆ చీర ఉయ్యాలో 
దివిటీల మీద ఉయ్యాలో ॥2॥
అన్నల వోయన్నా ఉయ్యాలో
అన్నలో పెద్దన్న ఉయ్యాలో ॥2॥
ఏడాదికోసారి ఉయ్యాలో
బతుకమ్మ పండుగ ఉయ్యాలో ॥2॥
ఆడపిల్లలనన్నా ఉయ్యాలో
నేను ఉన్న జూడు ఉయ్యాలో ॥2॥
కలిగేను పెద్దమ్మ ఉయ్యాలో
కన్నెతల్లి ఉన్నదా ఉయ్యాలో ॥2॥
ఏడంత్రాల ఉయ్యాలో
తీరైన బతుకమ్మ ఉయ్యాలో ॥2॥
తీరైన బతుకమ్మ ఉయ్యాలో
పువ్వులే తెచ్చిరి ఉయ్యాలో ॥2॥
వారిద్దరు ఒత్తురా ఉయ్యాలో
వీరిద్దరు ఒత్తురా ఉయ్యాలో ॥2॥
సంవత్సరానికి ఉయ్యాలో
ఒక్కసారే తల్లే ఉయ్యాలో ॥2॥
తంగేడు పూలనే ఉయ్యాలో
రాశిగా తెచ్చిరి ఉయ్యాలో ॥2॥
పోయిరా బతుకమ్మ ఉయ్యాలో
మళ్లీ ఏడాదికి ఉయ్యాలో ॥2॥
మళ్లీ రా బతుకమ్మ ఉయ్యాలో 
మళ్లీ రావమ్మ ఉయ్యాలో ॥2॥

gaja vadana beduve in Hindi

धन्यासी राग आदि ताळ
gaja vadana beduve in Hindi

गज वदना बेडुवे गौरी तनया
त्रिजग वंदितने सुजनर पॊरॆवने

पाशांकुश धर परम पवित्र
मूषिक वाहन मुनि जन प्रेम

मोददि निन्नय पादव तोरो
साधु वंदितने आदरदिंदलि

सरसिज नाभ श्री पुरंदर विठलन
निरुत नॆनॆयुवंतॆ दयमाडो श्री



Monday, 26 August 2019

ememi puvvappune in Hindi

एमेमु पुव्वप्पुने गौरम्म
एमेमि कायप्पुने गौरम्म
तंगेडु पुव्वप्पुने गौरम्म
तंगेडु कायप्पुने गौरम्म
तंगेडु पुव्वुलो
तंगेडु कायलो
आडेकि नूरोड्लु पाडेकि नूरोड्लु
कलिकि चिलुकलु रॆंडु कंदुव्व मेडलो
एमेमु पुव्वप्पुने गौरम्म
एमेमि कायप्पुने गौरम्म
सॆरुगंटि पुव्वप्पुने गौ. सॆरुगंटि कायप्पुने गौ
सॆरुगंटि पूवुलो, सॆरुगंटि कायलो
आडेकि नूरोड्लु पाडेकि नूरोड्लु
कलिकि चिलुकलु रॆंडु कंदुव्व मेडलो

chithu chithula bomma in Hindi

चित्तू चित्तुल बॊम्म शिवुनी मुद्दुल गुम्म
बंगारु बॊम्म दॊरिकॆनम्मो ई वाडलोन
रागि बिंदॆ तीस्क रमणी नीळ्ळकु बोतॆ
रामुलोरु ऎदुरॊच्चॆ नम्मो ई वाडलोन
बंगारु बिंदॆ दीस्क भामा नीळ्ळकु बोतॆ
भगवंतिडॆदुरॆच्चॆनम्मो ई वाडलोन
तुकम्म बतुकम्म उय्यालो बंगारु बतुकम्म उय्यालो
आनाटि कालान, धर्मांगुडनु राजु
आ राजु भार्ययू, अति सत्यवति यंदुरुय्यालो
नूरु नोमुलु नोमि, नूरु मंदिनि गांचॆ
वारु शूरुलैरि, वैरुलचे हतमैरि
तल्लिदंड्रुलपुडु, तरगनी शोकान
धन धान्यमुलु बासि, दायादुलनु बासि
वनिततो आ राजु, वनमंदु निवसिंचॆ
कलिकि लक्षम्निनि गूर्चि, घन तपंबॊनरिंचॆ
प्रत्यक्षमै लक्ष्मि, पलिकॆ वरमडुगुमनि
विनिपिंचि वेदननु, वॆलदि तन गर्भमुन
पुट्टमनि वेडगा, पूबोनि मदि मॆच्चि
सत्यवति गर्भमुन, जन्मिंचॆ श्री लक्ष्मि
अंतलो मुनुलुनू, अक्कडिकि वच्चिरी
कपिल गालवुलु, कश्यपांगीरसुलु
अत्रि वशिष्टुलु, आ कन्नियनु जूसि
बतुकगने ई तल्लि, बतुकम्म यनिरंत
శ్రీరాముని తల్లి ఉయ్యాలో
శ్రీమతి కౌసల్య ఉయ్యాలో


ప్రేమతో శాంతనూ ఉయ్యాలో
పిలిచి దగ్గర తీసే ఉయ్యాలో


చల్లని మాటలు ఉయ్యాలో
సతి ధర్మములు కొన్ని ఉయ్యాలో


చెప్పెనూ ఈ రీతి ఉయ్యాలో
చెవులకూ ఇంపుగా ఉయ్యాలో

మా తల్లి శాంతమ్మా ఉయ్యాలో
మా ముద్దులా పట్టి ఉయ్యాలో

అత్తవారింటికీ ఉయ్యాలో
ఆనందముగ పొమ్ము ఉయ్యాలో


అత్తమామల సేవ ఉయ్యాలో
చిత్తంబులో నిలిపి ఉయ్యాలో

భర్త దైవంబని ఉయ్యాలో
భావించి పూజించు ఉయ్యాలో

వారినీ పూజింప ఉయ్యాలో
వైకుంఠ మబ్బును ఉయ్యాలో

వారిపై నీ ప్రేమ ఉయ్యాలో
వాసుదేవుని పూజ ఉయ్యాలో

పేదరికమును జూచి ఉయ్యాలో
ప్రీతి దప్పకు తల్లి ఉయ్యాలో

కలిగి యున్నంతలో ఉయ్యాలో
కనిపెట్టి ఉండాలే ఉయ్యాలో


ఇరుగుపొరుగిండిలకు ఉయ్యాలో
తిరుగబోవద్దమ్మ ఉయ్యాలో

అందు వలన నీకు ఉయ్యాలో
అపకీర్తి వచ్చును ఉయ్యాలో

అప కీర్తి కంటెనూ ఉయ్యాలో
అతివ చావు మేలు ఉయ్యాలో

పడతి చక్క దనము ఉయ్యాలో
బయట పెట్ట రాదు ఉయ్యాలో

తన చక్కదనమునూ ఉయ్యాలో
దాసుకొని తిరగాలి ఉయ్యాలో

పలికి బొంక రాదు ఉయ్యాలో
ప్రాణాలు బోయినా ఉయ్యాలో

సత్యమును ఎప్పుడూ ఉయ్యాలో
నేర్పుతో పలకాలి ఉయ్యాలో

సాధుసత్పురుషులు ఉయ్యాలో
సమయానికేతెంచు ఉయ్యాలో

అన్నపాణాదులు ఉయ్యాలో
ఆదరించుు తల్లి ఉయ్యాలో

ఏది చేసిన గానీ ఉయ్యాలో
ఏది చూసిన గానీ ఉయ్యాలో

వెనక ముందనక ఉయ్యాలో
వేగిరా పడవద్దు ఉయ్యాలో

మాట మన్నన లేక ఉయ్యాలో
మంచి పేరు రాదు ఉయ్యాలో


మాట జారిన వెనుక ఉయ్యాలో
మళ్ళి తిరిగి రాదు ఉయ్యాలో

అందుకే ముందుగా ఉయ్యాలో
ఆలోచన ఉండాలి ఉయ్యాలో

మంచి కీర్తి బతుకు ఉయ్యాలో
కొంచెమైనా చాలు ఉయ్యాలో



కొడుకులు బిడ్డలు ఉయ్యాలో
కొమరొప్ప కలగని ఉయ్యాలో


నిండు ముత్తైదవై ఉయ్యాలో
యుండవే మాతల్లి ఉయ్యాలో


పోయిరా శాంతమ్మ ఉయ్యాలో
పోయిరా మా తల్లి ఉయ్యాలో


పోయి మీ అత్తింట్ల ఉయ్యాలో
బుద్ధి గలిగి ఉండు ఉయ్యాలో

Sunday, 25 August 2019

అనగనగ రాజ్యాన, ముని దంపతులిద్దరూ
పిల్లలూ లేరని, రంది పండుతుండిరీ
నోములన్నీ నోమిరుయ్యాలో, పూజలన్నీ జేసి రుయ్యాలో
పూజల ఫలమునా, కొడుకు రత్నం పుట్టె
శ్రవణ కుమారుడూ, పెరిగి పెద్దగాయె
లేక లేక పుట్టె, అల్లారు ముద్దాయే
విలువిద్యలన్నియూ , విరివిగా నేర్పించి
మంచి మాటలు జెప్పి, మక్కువతో పెంచిరీ
ముసలి దంపతులిద్దరుయ్యాలో, ముదముతో ముద్దాడె
కాళ్ళు కదలయాయె, కంటి చూపు పాయె
కన్న కొడుకే వారి, కంటి చూపు ఆయె
కాశి యాత్రలకనీ, బయలు దేరినారు
ముసలి తల్లిదండ్రులను, కావడీ కట్టుకొని
బయలుదేరే శ్రవణుడు, కాశీ యాత్రలకు
కోసలాధీశుండు ఉయ్యాలో దశరథ నాముండు ఉయ్యాలో
రఘువంశ రాజు ఉయ్యాలో- శబ్దబేదిల దిట్ట ఉయ్యాలో
కొండ కోనలు దాటి ఉయ్యాలో వేటకే బోయెను ఉయ్యాలో
అడవిలో దిరిగెను ఉయ్యాలో అటు ఇటు జూచెను ఉయ్యాలో
చెట్టు గుబురుల చాటు ఉయ్యాలో చెరువొకటి కనిపించె ఉయ్యాలో
శబ్దమేదొ వినెను ఉయ్యాలో శరమును సంధించె ఉయ్యాలో
జంతువేదొ జచ్చె ఉయ్యాలో అనుకొని సాగెను ఉయ్యాలో
చెంతకు చేరగా ఉయ్యాలో చిత్తమే కుంగెను ఉయ్యాలో
కుండలో నీళ్ళను ఉయ్యాలో కొనిపో వచ్చిన ఉయ్యాలో
బాలుని గుండెలో ఉయ్యాలో బాణమే గ్రుచ్చెను ఉయ్యాలో
ఎవ్వరు నువ్వనె ఉయ్యాలో ఏడ్పుతో దశరథుడు ఉయ్యాలో
శ్రవణుడు నేననె ఉయ్యాలో చచ్చేటి బాలుడు ఉయ్యాలో
తప్పు జరిగెనంచు ఉయ్యాలో తపియించెను రాజు ఉయ్యాలో
చావు బతుకుల బాలుడుయ్యాలో సాయమే కోరెను ఉయ్యాలో
నా తల్లిదండ్రులు ఉయ్యాలో దాహంతో ఉండిరి ఉయ్యాలో
ఈ నీళ్ళు గొంపోయి ఉయ్యాలో ఇచ్చి రమ్మనెను ఉయ్యాలో
ఆ నీళ్ళతో రాజు ఉయ్యాలో అడవంతా వెదికె ఉయ్యాలో
ఒకచోట జూచెను ఉయ్యాలో ఒణికేటి దంపతుల ఉయ్యాలో
కళ్ళైన లేవాయె ఉయ్యాలో కాళ్ళైన కదలవు ఉయ్యాలో
వృద్ధ దంపతుల జేరి ఉయ్యాలో వేదన చెందుతూ ఉయ్యాలో
సాష్టాంగ పడె రాజు ఉయ్యాలో సంగతి జెప్పెను ఉయ్యాలో
పలుకు విన్నంతనే ఉయ్యాలో పాపమా వృద్ధులు ఉయ్యాలో
పుత్ర శోకంతోని ఉయ్యాలో - పుట్టెడూ దుఃఖంతో ఉయ్యాలో
పుత్ర శోకమే నీవు ఉయ్యాలో - అనుభవించెదవనీ ఉయ్యాలో
శాపాలు బెట్టిరి ఉయ్యాలో చాలించిరి తనువులుయ్యాలో
శాపమే ఫలియించె ఉయ్యాలో జరిగె రామాయణం ఊయ్యాలో
లోక కల్యాణమాయె ఉయ్యాలో లోకమే మెచ్చెను ఉయ్యాలో