Wednesday, 28 August 2019

దేశ దేశంబోయి ఉయ్యాలో, దేశంబు బోయి ఉయ్యాలో
తెచ్చెనే ఆ శివుడు ఉయ్యాలో, గంగవాయిలి కూర ఉయ్యాలో
వండుమని గౌరమ్మను ఉయ్యాలో, వల్లె పెట్టినాడు ఉయ్యాలో
అన్ని రుచులు వేసి ఉయ్యాలో, గౌరి వండినాది ఉయ్యాలో
గౌరి వండిన కూర ఉయ్యాలో, శివుడు మెచ్చడాయే ఉయ్యాలో
మెచ్చకుంటె ఒక దాన్ని ఉయ్యాలో, తెచ్చుకోరాదయ్య ఉయ్యాలో
తెచ్చుకుంటే మీరు ఉయ్యాలో, కూడి ఉంటారామ్మ ఉయ్యాలో
కూటి గుడ్డ కున్న ఉయ్యాలో, కూడి యుండకేమి ఉయ్యాలో
అన్న వస్త్రముకున్న ఉయ్యాలో, అణిగి యుండకేమి ఉయ్యాలో
దేశ దేశం బోయి ఉయ్యాలో, దేశంబు బోయి ఉయ్యాలో
తెచ్చెనే ఆ శివుడు ఉయ్యాలో, జడలోన గంగనూ ఉయ్యాలో
గంగమ్మ గౌరమ్మ ఉయ్యాలో, నీల్లకెల్లినారు ఉయ్యాలో
గంగ తోడిన చెలిమె ఉయ్యాలో, నీల్లూరినాయి ఉయ్యాలో
గౌరి తోడిన చెలిమె ఉయ్యాలో, పాలూరినాయి ఉయ్యాలో
గౌరమ్మను గంగమ్మ ఉయ్యాలో, కాలెత్తి తన్నె ఉయ్యాలో
నిలిచి జగడమాయె ఉయ్యాలో, అడ్డు గోడలాయె ఉయ్యాలో
నిక్క జూసి శివుడు ఉయ్యాలో, నీతి కాదని చెప్పె ఉయ్యాలో
అక్క నన్ను తన్నితే ఉయ్యాలో, రాలినా మన్నును ఉయ్యాలో
కొడుకు వీరన్నకూ ఉయ్యాలో, కోట కట్టిస్తునూ ఉయ్యాలో
కోడలు భద్రకాళికి ఉయ్యాలో, మేడ కట్టిస్తునూ ఉయ్యాలో
దేవునీ పూజలకు ఉయ్యాలో, గద్దె కట్టిస్తునూ ఉయ్యాలో
నీకు నాకు అనగ ఉయ్యాలో, సరి గద్దె కట్టిస్తు ఉయ్యాలో
సరి గద్దె కట్టియ్య ఉయ్యాలో, సరిదానివటే ఉయ్యాలో
సరిదాన్ని కాకుంటె ఉయ్యాలో, శివుడెట్ల మెచ్చునూ ఉయ్యాలో
శివుడెట్లా తెచ్చు ఉయ్యాలో, జగమెట్లా మెచ్చు ఉయ్యాలో
అంతలో గౌరమ్మ ఉయ్యాలో, నేల చింగు మాసె ఉయ్యాలో
చింగు కడుగుదామంటే ఉయ్యాలో, నీళ్ళు లేకపాయే ఉయ్యాలో
స్తంబాల బాయిలో ఉయ్యాలో, చూసిరాపోరాదు ఉయ్యాలో
స్తంబాల బాయిలో ఉయ్యాలో, చారెడైనా లేవు ఉయ్యాలో
వీరప్ప కుంటలో ఉయ్యాలో, చూసిరాపోరాదు ఉయ్యాలో
వీరప్ప కుంటలో ఉయ్యాలో, ఇన్నైనా లేవు ఉయ్యాలో
కోమటి కుంటలో ఉయ్యాలో, చూసిరాపోరాదు ఉయ్యాలో
కోమటి కుంటలో ఉయ్యాలో, కొంచెమైనా లేవు ఉయ్యాలో
అంతలో గౌరమ్మ ఉయ్యాలో, గంగ జాడకు పాయె ఉయ్యాలో
కొడుకు కోటలోన ఉయ్యాలో, గంగమ్మ లేదు ఉయ్యాలో
అక్కన్నుండి గౌరమ్మ ఉయ్యాలో, కోడలు మేడకు పాయె ఉయ్యాలో
కోడలు మేడ లోన ఉయ్యాలో, గంగమ్మ లేదు ఉయ్యాలో
అక్కన్నుండి గౌరమ్మ ఉయ్యాలో, శివుని జాడకు పాయె ఉయ్యాలో
శివుని వద్ద గంగమ్మ ఉయ్యాలో, కూర్చొని ఉండె ఉయ్యాలో
అక్క నీకు శరణు ఉయ్యాలో, కదిలి రావే గంగ ఉయ్యాలో
నాకున్న చీరెలూ ఉయ్యాలో, నీకిస్తనే గంగ ఉయ్యాలో
నీకున్న చీరెలూ ఉయ్యాలో, నాకున్నవే గౌరి ఉయ్యాలో
అక్క నీకు శరణు ఉయ్యాలో, కదిలి రావే గంగ ఉయ్యాలో
నాకున్న రవికెలూ ఉయ్యాలో, నీకిస్తనే గంగ ఉయ్యాలో
నీకున్న రవికెలూ ఉయ్యాలో, నాకున్నవే గౌరి ఉయ్యాలో
అక్క నీకు శరణు ఉయ్యాలో, కదిలి రావే గంగ ఉయ్యాలో
నాకున్న కొడుకునూ ఉయ్యాలో, నీకిస్తనే గంగ ఉయ్యాలో
నీకు కొడుకు అయితే, నాకు కొడుకు కాదా ఉయ్యాలో
అక్క నీకు శరణు ఉయ్యాలో, కదిలి రావే గంగ ఉయ్యాలో
నాకున్న కోడల్ను ఉయ్యాలో, నీకిస్తనే గంగ ఉయ్యాలో
నీకు కోడలైతే ఉయ్యాలో, నాకు కోడల్ గాదా ఉయ్యాలో
అక్క నీకు శరణు ఉయ్యాలో, కదిలి రావే గంగ ఉయ్యాలో
నాకున్న శివున్ని ఉయ్యాలో, నీకిస్తనే గంగ ఉయ్యాలో
అప్పుడూ గంగమ్మ ఉయ్యాలో, కదిలీ వచ్చెనూ ఉయ్యాలో
జిల్లేడు చెట్ల కింద ఉయ్యాలో, పారెనూ గంగమ్మ ఉయ్యాలో
తంగేడు చెట్ల కింద ఉయ్యాలో, పారెనూ గంగమ్మ ఉయ్యాలో





















No comments:

Post a Comment