శ్రీ కృష్ణ మంగళహారతి
రాగం : ఆనందభైరవి తాళం : మిశ్ర చాపు శృతి : 6 1/2 ( A Sharp )
( సంప్రదాయ మంగళ హారతి ) రచన : సీతారామ యతీoద్రులు
మంగళం జయమంగళం
మా నల్లనయ్యకు మంగళం
మంగళం జయ మంగళం
మా కృష్ణ స్వామికి మంగళం ||
శిరమునందున మెరయుచుండెడి
నెమలి పింఛకు మంగళం
శ్యామలాంగుని కరములందలి
మధుర మురళికి మంగళం || మంగళం జయమంగళం ||
వనజదమ్మును ధిక్కరించెడి
వదన శోభకు మంగళం
కరుణ రసమును చిందుచుండెడి
కన్నుదోయికి మంగళం || మంగళం జయమంగళం ||
బ్రహ్మచే పూజింపబడిన
చరణ యుగళికి మంగళం
జగములన్నియు కన్నతండ్రగు
చక్కనయ్యకు మంగళం || మంగళం జయమంగళం ||
గోపికా గణ సేవితుడు
శ్రీ గోవిందునకు మంగళం
రాధికా పరివేష్ఠితుండౌ
రసేశ్వరునకు మంగళం || మంగళం జయమంగళం ||
मंगळं जयमंगळं
मा नल्लनय्यकु मंगळं
मंगळं जय मंगळं
मा कृष्ण स्वामिकि मंगळं ||
शिरमुनंदुन मॆरयुचुंडॆडि
नॆमलि पिंछकु मंगळं
श्यामलांगुनि करमुलंदलि
मधुर मुरळिकि मंगळं || मंगळं जयमंगळं ||
वनजदम्मुनु धिक्करिंचॆडि
वदन शोभकु मंगळं
करुण रसमुनु चिंदुचुंडॆडि
कन्नुदोयिकि मंगळं || मंगळं जयमंगळं ||
ब्रह्मचे पूजिंपबडिन
चरण युगळिकि मंगळं
जगमुलन्नियु कन्नतंड्रगु
चक्कनय्यकु मंगळं || मंगळं जयमंगळं ||
गोपिका गण सेवितुडु
श्री गोविंदुनकु मंगळं
राधिका परिवेष्ठितुंडौ
रसेश्वरुनकु मंगळं || मंगळं जयमंगळं ||
No comments:
Post a Comment