మా నాన్న (నాయన)
నాన్నంటే..
నాన్నే కాదు
నిజాయితీగా గెలవడంలో ఆనందాన్ని
మంచి కొరకు పట్టుబట్టడాన్ని
నాకు నేర్పిన నా మొదటి గురువు.
కష్టాల దారిలో
తడబడ్డ తడబాట్లను
స్థిరమైన అడుగులుగా పేర్చి
నాకు నడక నేర్పిన వాడు
నాన్నతో నడిచినప్పుడు
సముద్రం నా చేతిలో ఉన్నట్టుంది
మేఘాలు నా పాదం క్రింద ఉన్నట్టుంది
ప్రపంచాన్ని జయించినట్టు ఉంటుంది
తప్పు చేయనపుడు దేవున్నైనా ఎదిరించమని
తప్పని తెలిసిన తక్షణం క్షమాపణ కోరమని
కన్న తల్లిని కనురెప్పలా కాపాడమని
ఆయన వేసిన మంత్రం
నా చెవుల్లో ఇంకా వినిపిస్తోంది
మోసం అంటే తెలియని వాడు
అప్పులు లేక ఆడంబరాలకు పోక
నిరాడంబర జీవితం గడిపినవాడు
తన గుండెను పాన్పుగా చేసి నను
నిద్రపుచ్చిన రోజులు నాకింకా గుర్తున్నాయి
నా అల్లరి పనులకు ఆయన కళ్ళలో
మెరిసిన ఆనందం నాకింకా గుర్తుంది
కొండంత బాధ్యతలు బండంత బాధ ఉన్నా
నలుసంతైనా మాకు తెలియనీయని ఆయన ఆత్మ విశ్వాసం
నన్ను హాస్టల్లో చేర్చి ఆ బాధను పైకి తెలియనీయని ఆయన ఓర్పు
నాన్నంటే..
నాన్నే కాదు
నిజాయితీగా గెలవడంలో ఆనందాన్ని
మంచి కొరకు పట్టుబట్టడాన్ని
నాకు నేర్పిన నా మొదటి గురువు.
కష్టాల దారిలో
తడబడ్డ తడబాట్లను
స్థిరమైన అడుగులుగా పేర్చి
నాకు నడక నేర్పిన వాడు
నాన్నతో నడిచినప్పుడు
సముద్రం నా చేతిలో ఉన్నట్టుంది
మేఘాలు నా పాదం క్రింద ఉన్నట్టుంది
ప్రపంచాన్ని జయించినట్టు ఉంటుంది
తప్పు చేయనపుడు దేవున్నైనా ఎదిరించమని
తప్పని తెలిసిన తక్షణం క్షమాపణ కోరమని
కన్న తల్లిని కనురెప్పలా కాపాడమని
ఆయన వేసిన మంత్రం
నా చెవుల్లో ఇంకా వినిపిస్తోంది
మోసం అంటే తెలియని వాడు
అప్పులు లేక ఆడంబరాలకు పోక
నిరాడంబర జీవితం గడిపినవాడు
తన గుండెను పాన్పుగా చేసి నను
నిద్రపుచ్చిన రోజులు నాకింకా గుర్తున్నాయి
నా అల్లరి పనులకు ఆయన కళ్ళలో
మెరిసిన ఆనందం నాకింకా గుర్తుంది
కొండంత బాధ్యతలు బండంత బాధ ఉన్నా
నలుసంతైనా మాకు తెలియనీయని ఆయన ఆత్మ విశ్వాసం
నన్ను హాస్టల్లో చేర్చి ఆ బాధను పైకి తెలియనీయని ఆయన ఓర్పు
No comments:
Post a Comment