Wednesday, 7 November 2018


చంద్రశేఖర మేలుకొలుపు
మేలుకొనవే చంద్రశేఖర మేలుకొనవే దివ్యవందిత
మేలుకొనవే ఫాలలోచన నీలకంఠా హరహరా
1.      కమలనేత్రుడు వీరభద్రుడు ప్రమథ గణ(ళ)ములు గజముఖుండును
పలుక తుంబుర నారదాదులు ప్రమదమొసగగ హరహరా
2.      కమల సంభవుడాదిగాగల ధరులు వచ్చిరి మిమ్ము కొలువగ
తాపహిత శత తేజ గౌరీ రమణ హర హర మేలుకో నీలకంఠా హరహరా
3.      శంభు శంభో యనుచు వేదతో శంభునీశ్వరులరుగుదెంచిరి
ఝృంబణంబున నారుమోములు సూర్యుడేతెంచెను హరా నీలకంఠా హరహరా
4.      పండు వెన్నెల తృంగె తూరుపు కొండపై నుదయించె భానుడు
దండి కలువల దర్ప మణగెను దివ్య రూపుడా హర హర
5.      పుండరీకములన్ని మెరిసెను భుజగ కంకణ మేలుకొనుమా
దండికూడలి సంగమేశ్వర ధవళ వర్ణా హరహరా


No comments:

Post a Comment