ఆ మంచు కొండ చల్లంగ తాకి శివ లాలి పాడింది ఉయ్యాల
ఆ చంద మామ సిగలోన చేరి శివ లాలి పాడింది ఉయ్యాల
మురిపాల గంగమ్మ తలమీద ఆడి శివ లాలి పాడింది ఉయ్యాల
నీ మేనిలోన సగమై ఉన్నా గౌరమ్మ శివ లాలి ఉయ్యాలా
ఉయ్యాలా ఉయ్యాలా శివ లాలి శివలాలి ఉయ్యాలా
ఉయ్యాలా ఉయ్యాలా శివ లాలి శివలాలి ఉయ్యాలా
మెడలోని పాము బుసల వాసన శివ లాలి పాడింది ఉయ్యాల
నిను మోసే నంది రంకెల రాగాల శివ లాలి పాడింది ఉయ్యాల
చేతులున్న ఢమరు డండం నాదాల శివ లాలి పాడింది ఉయ్యాల
నాట్య శాస్త్రమంత డిండిం తాళాల శివ లాలి పాడింది ఉయ్యాల
ఉయ్యాలా ఉయ్యాలా శివ లాలి శివలాలి ఉయ్యాలా
ఉయ్యాలా ఉయ్యాలా శివ లాలి శివలాలి ఉయ్యాలా
నీ చేతి శూలం వీర రసమున శివ లాలి పాడింది ఉయ్యాల
నీ ఫాల నేత్రం రెప్ప చాటున రౌద్రంగా పాడింది ఉయ్యాల
హాలాహలమే భీభత్స రసమున శివ లాలి పాడింది ఉయ్యాల
రుద్ర భూమిలోన మండేటి చితులు శాంతంగా పాడాయి ఉయ్యాల
ఉయ్యాలా ఉయ్యాలా శివ లాలి శివలాలి ఉయ్యాలా
ఉయ్యాలా ఉయ్యాలా శివ లాలి శివలాలి ఉయ్యాలా
నీ కరుణ చిందేటి రుద్రాక్ష సైతం పాడింది శివ లాలి ఉయ్యాల
నీ మేని తాకిన బూడిద కూడా పాడింది శివలాలి ఉయ్యాల
దేహాన్ని ప్రాణాన్ని మోహరించిన కపాలం శివ లాలి ఉయ్యాల
ఏడేడు లోకాల పంచాక్షరి పాడే శివలాలి శివలాలి ఉయ్యాల
ఉయ్యాలా ఉయ్యాలా శివ లాలి శివలాలి ఉయ్యాలా
ఉయ్యాలా ఉయ్యాలా శివ లాలి శివలాలి ఉయ్యాలా
No comments:
Post a Comment