Friday, 8 May 2026

ఉపనయనం పాట

ఉపనయనం పాట 


వడక పెండ్లి కొమరుడే వామనావతారుడే||2||

సామగాన లోలుడే సకల భువన పాలుడే||2|| వడక పెండ్లి కొమరుడే వామనావతారుడే అతిధి కశ్యపులకు వీడు అవతరించి నాడటే||2|| ముదితలార వీని ముఖము ముద్దులొలుకుచుండెనే||2|| ||వడక|| పటుతర వాక్పటిమ చేత బలిని దానమడిగెనే||2|| చతురముగ త్రిభువనముల్ చిటికెలోన నిండెనే||2|| ||వడక|| జయావిజయ అభయమనుచు జగములెల్ల పొగిడేరే||2|| విజయమనుచు అజేయునకు హారతులను ఇవ్వరే||2|| వడక పెండ్లి కొమరుడే వామనావతారుడే సామగాన లోలుడే సకల భువన పాలుడే వడక పెండ్లి కొమరుడే వామనావతారుడే వామనావతారుడే వామనావతారుడే

No comments:

Post a Comment