లక్ష్మీ రావే మా ఇంటికి
వరలక్ష్మీ రావే మా ఇంటికి
క్షీరాబ్ధి పుత్రీవరలక్ష్మి రావే మా ఇంటికి
లక్ష్మీ రావే మా ఇంటికి రాజితమూగ నెలకొన్న
లక్ష్మీ రావే మా ఇంటికి రాజితమూగ నెలకొన్న
సూక్ష్మముగ మోక్షమిచ్చు సుందరి బృందావనధారి
సూక్ష్మముగ మోక్షమిచ్చు సుందరి బృందావనధారి // లక్ష్మీ //
1) కుంకుమ పచ్చ కస్తూరి కోరికతోను గోరోజనము
కుంకుమ పచ్చ కస్తూరి కోరికతోను గోరోజనమ
జాజి పువ్వు జలజలోచని ముదముతోనా అర్పింతుము
జాజి పువ్వు జలజలోచని ముదముతోనా అర్పింతుము
చల్లని గంధము చందనముతో సాంబ్రాణి ధూపము
చల్లని గంధము చందనముతో సాంబ్రాణి ధూపము
మాత నీకు ప్రీతిగప్రఖ్యాతిగ సమర్పింతునమ్మా
మాత నీకు ప్రీతిగప్రఖ్యాతిగ సమర్పింతునమ్మా // లక్ష్మీ //
2) పసుపు అక్షతలు పరిమళ ద్రవ్యం పంచబిల్వములు పూర్ణ కలశము
పసుపు అక్షతలు పరిమళ ద్రవ్యం పంచబిల్వములు పూర్ణ కలశము
మాత నీకు ప్రీతిగప్రఖ్యాతిగ సమర్పింతునమ్మా
మాత నీకు ప్రీతిగప్రఖ్యాతిగ సమర్పింతునమ్మా //లక్ష్మీ //
3)గుండు మల్లె మొగలి పూలు దండిగా చామంతిపూలు
మేలైన పారిజాతము గుండు మల్లె మొగలి పూలు
దండిగా చామంతిపూలు మేలైన పారిజాతము
మాత నీకు ప్రీతిగప్రఖ్యాతిగా సమర్పింతునమ్మా
మాత నీకు ప్రీతిగ ప్రఖ్యాతిగా సమర్పింతునమ్మా //లక్ష్మీ //
4) అందముగ జరి అంచు చీర కుందనమ్ము పచ్చని రవిక
మొగలి పువ్వులు జడలే అల్లి జడగుచ్చులను కట్టెదమ్మ
అందముగ జరి అంచు చీర కుందనమ్ము పచ్చని రవిక
మొగలి పువ్వులు జడలే అల్లి జడగుచ్చులను కట్టెదమ్మ
మాత నీకు ముదముతో మేము చేతుమమ్మ చక్కని పూజ
మాత నీకు ముదముతో మేము చేతుమమ్మ చక్కని పూజ// లక్ష్మీ //
5) అందముగ అడవి పండ్లు కదళీ పండ్లు రేగు పండ్లు మేలైన దానిమ్మపండ్లు
ఘనముగా ఖర్జురా పండ్లు అందముగ అడవి పండ్లు కదళీ పండ్లు
రేగు పండ్లు మేలైన దానిమ్మపండ్లు ఘనముగా ఖర్జురా పండ్లు
పండు వెన్నలలో నీకు పద్మాసిని నే పూజింప
పండు వెన్నలలో నీకు పద్మాసనీ నే పూజింప
No comments:
Post a Comment