సువ్వియనుచు పాడరమ్మ సుదతులందరూ
చిట్టి తల్లి సమర్తలాడెనమ్మా
మన చిట్టి తల్లి సమర్తలాడెనమ్మా
మన (మీ అమ్మాయి పేరు) తల్లి సమర్తలాడెనమ్మా
మేనమామలిచ్చిన చీర కట్టరమ్మా
వంకీ వడ్డాణములను పెట్టరమ్మా
విప్రరతుల ముత్తైదుల పిలువరమ్మా
ఘన తాంబూలములను పంచి పెట్టరమ్మా
పంచాంగమును విప్పి చూడరమ్మా
దివ్యమైన నక్షత్రము వచ్చెనమ్మా
ఫలాహారములను తెచ్చి పెట్టరమ్మా
పచ్చనైన ఆకులను పరువరమ్మా
పాలు నెయ్యి తేనె తెచ్చి ఇవ్వరమ్మా
కుందనాల బొమ్మ సమర్తలాడెనమ్మా
పంచదార కొబ్బరులను పంచరమ్మా
పసుపు కుంకుమలను ఇవ్వరమ్మా
హారతిచ్చి ఆశీస్సులు ఇవ్వండమ్మా
మన బంగారు బొమ్మ చల్లంగ ఉండాలనీ
(సువ్వి)
No comments:
Post a Comment