Saturday, 20 January 2018

సావేరి రాగం                 ఆది తాళం

సీతారామస్వామి నే జేసిన నేరములేమి
ఖ్యాతిగ నీపద పంకజ యుగములు ప్రీతిగ తలపక భేద మెంచితినా 2
రంగుగ నా పదివేళ్ళకు - రత్నపు టుంగరములు నిన్నడిగితినా
సరిగ బంగారు శాలువ పాగా - లంగీల్ నడికట్లడిగితినా
చెంగట భూసుర పుంగవు లెన్నగ - చెవులకు చౌకట్ల డిగితినా
మువ్వలు గొలుసులు ముత్యపుసరములు - అంగననకు నిన్నడిగితినా
ప్రేమతో నవరత్నంబులు దాపిన - హేమ కిరీటంబడిగితినా
కోమలమగు నీ మెడలో పుష్పపు – ధామములిమ్మని అడిగితినా
మోమాటము పడకుండగ నీదగు - మురుగులు గొలుసులు అడిగితినా
కమలేక్షణ మిము సేవించుటకై - ఘనముగ రమ్మని పిలిచితిగాని
ప్రశస్త భద్రాద్రీశుడవని నిను - ప్రభుత్వ మిమ్మని యడిగితినా

దశరధ సుత నీచేత ధరించిన - దాన కంకణ మ్మడిగితినా

No comments:

Post a Comment