2018 రామదాసు జయంతి ఉత్సవాలు భద్రాచలం
ఇలాంటి వేడుక ఒకటి జరుగుతోందా ఎక్కడైనా అని నేను ఎన్నోసార్లు గూగుల్ లో వెతికాను. తెలిసిన ప్రతీ ఒక్కర్నీ అడిగాను.
ఎప్పుడు రామదాసు ఉత్సవాల గురించి వెతికినా నాకు దొరికేది త్యాగరాజు ఆరాధనోత్సవాల వివరాలే. ప్రాంతాన్నంటే కాళ్ళతో తొక్కేసారు (అదే ఇప్పుడు పడగలెత్తి పైకి ఎగదన్నిందనుకోండి), వాగ్గేయకారులకు కూడా రాజకీయాలా? ప్రస్తుతం తరం వారం మనం రామదాసు అంటే ఎలా ఉంటారో చూసి ఉంటామా? లేదు కదా. మరి కనపడని వ్యక్తిపై కూడా అంత పగ ఎందుకు?
పేరుకు రామదాసు జయంతి ఉత్సవాలు. అక్కడ పాడేవి అన్నీ అన్నమాచార్య, త్యాగరాజు కీర్తనలే. చాలా వరకు. ప్రైవేట్ వ్యక్తులు చేస్తే తప్పు కాదా.
నాకు త్యాగరాజు, అన్నమాచార్య అంటే కోపం లేదు. వారి పాటలు కూడా నాకు చాలా ఇష్టం పాడుతాను, నేర్పిస్తున్నాను కూడా. ఇతర భాషీయులకు వారి వారి భాషలలో నేర్పిస్తున్నాను. మరి పేరొకటి పని మరొకటి చందంలా ఎందుకు చేయాలి.
ఏనాడైనా త్యాగరాజు ఆరాధనోత్సవాలలో రామదాసు కీర్తనలు ఎవరైనా పాడారా? నాకు తెలియక అడుగుతున్నాను. రామదాసు కీర్తనలలోని ఆ మాధుర్యం ఎందుకు ప్రజలలోకి తీసుకువెళ్ళడానికి ఇంతగా వెనుకాడుతున్నారు. ఎంత చక్కని కీర్తనలు, ఎంత చక్కని భావం. ఎవడబ్బ సొమ్మని రాముని నిలదీసినందుకా? నను బ్రోవమని చెప్పవే అని రామదాసు సీతమ్మను వేడుకున్న తీరు చూడండి. ఇంత పంతం ఏలరా భధ్రగిరీశా అని రామదాసు సాక్షాత్తూ రాముని కనుల ఎదురుగా చూసినట్టు ఆ కీర్తన స్వరపరచిన వైనం చూడండి.
నాదొక్కటే మనవి. వాగ్గేయకారుల ఉత్సవాలు అని పేరు పెట్టండి లేదా ఏ ఒక్కరి పేరు పెట్టినా అందరివీ పాడండి, అన్ని వేళలా, అన్ని చోట్లా.

No comments:
Post a Comment