శ్రీ లక్ష్మి నీ మహిమలు గౌరమ్మ
చిత్రమై తోచునమ్మా గౌరమ్మ ॥2॥
భారతీ దేవివై బ్రహ్మకిల్లాలివై ॥2॥
పార్వతీ దేవివై పరమేశ్వరాణివై ॥2॥
పరగశ్రీ లక్ష్మీవై గౌరమ్మ
భార్యవైతివి హరికినీ గౌరమ్మ ॥2॥
శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ
చిత్రమై తోచునమ్మా గౌరమ్మ ॥2॥
ఎన్నెన్నో రూపాలు ఏడేడు లోకాలు ॥2॥
ఉన్న కోరికలన్నీ జనులకు సమకూర్చగా ॥2॥
కన్న తల్లివైతివి గౌరమ్మ
కామధేనువైతివి గౌరమ్మ ॥2॥
శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ
చిత్రమై తోచునమ్మ గౌరమ్మ ॥2॥
ముక్కోటి దేవతలు సక్కాని కాంతలు ॥2॥
ఎక్కువగా నిన్ను కొలిచి పెక్కు నోములు నోచి ॥2॥
ఎక్కువ వారిరైగా గౌరమ్మ
ఈ లోకమున నుండియు గౌరమ్మ ॥2॥
శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ
చిత్రమై తోచునమ్మా గౌరమ్మ ॥2॥
నల్ల వరి బియ్యం మల్లె మొగ్గలు లేత ॥2॥
తెల్ల వజ్రంబులు ముల్లోకాములనేలే ॥2॥
తల్లి నీ దంతమ్ములు గౌరమ్మ
దానిమ్మ బీజములు గౌరమ్మ ॥2॥
శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ
చిత్రమై తోచునమ్మా గౌరమ్మ ॥2॥
నిగనిగ మానేటి నగు ముఖము చూచితే ॥2॥
జగతి పున్నమినాడు చంద్రుణ్ని ఓడించి ॥2॥
సొగసైన నీ తిలకము గౌరమ్మ
చూసితే ఆనందం గౌరమ్మ ॥2॥
శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ
చిత్రమై తోచునమ్మా గౌరమ్మ ॥2॥
తమరికంటే ఎక్కువ దైవము ఎవ్వరు లేరు ॥2॥
తమకింపు పట్టింపు సకల లోకంబులా ॥2॥
క్రమముచే పాలింపగా గౌరమ్మ
కన్నుల పండుగాయే గౌరమ్మ ॥2॥
శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ
చిత్రమై తోచునమ్మా గౌరమ్మ ॥2॥
బాలలు, వృద్ధులు ప్రౌఢాంగనలు కన్నె ॥2॥
ప్రాయపుకాంతలు పరగాశ్వయుజశుద్ధ ॥2॥
పాడ్యమి మొదలుకొని గౌరమ్మ
భక్తిని అందు నిలిపి గౌరమ్మ ॥2॥
శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ
చిత్రమై తోచునమ్మా గౌరమ్మ ॥2॥
తొమ్మిది దినములు నెమ్మనంగమున పొంగి ॥2॥
అమ్మలక్కలు కూడి ఆస్తితో తమకున్న ॥2॥
సొమ్ములు ధరియించగా గౌరమ్మ
శోభనమ్మని పాడుచూ గౌరమ్మ ॥2॥
శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ
చిత్రమై తోచునమ్మా గౌరమ్మ ॥2॥
బంగారు పువ్వులు బతుకమ్మయని పేర్చి ॥2॥
మంగళంబున నిన్ను మధ్యలా నిలిపి ॥2॥
అరే రంగు రంగుల పువ్వులు గౌరమ్మ
రాశి తంగేడు పువ్వులు గౌరమ్మ ॥2॥
శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ
చిత్రమై తోచునమ్మా గౌరమ్మ ॥2॥
కట్ల పుష్పంబులు తామర పువ్వులు ॥2॥
తలగోడు పువ్వులు గన్నేరు పువ్వులు ॥2॥
పొట్ల పువ్వులు చల్లుతూ గౌరమ్మ
పొగడ పువ్వులు నింపుతూ గౌరమ్మ ॥2॥
శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ
చిత్రమై తోచునమ్మా గౌరమ్మ ॥2॥
పారిజాతంబులు పైడి తంగేడు పూలు ॥2॥
గోరెంట పున్నెలు గురివింద మల్లెలు ॥2॥
ఈరు రుద్రాక్ష పూలు గౌరమ్మ
పేరైన సుమజాతులు గౌరమ్మ ॥2॥
శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ
చిత్రమై తోచునమ్మా గౌరమ్మ ॥2॥
పన్నీరు అత్తరు పచ్చి గంధములు ॥2॥
పరిమళంబులు బుక్క బాగైన కస్తురు ॥2॥
పసుపు కుంకుమ గుప్పుతు గౌరమ్మ
పాటలెన్నో పాడుచూ గౌరమ్మ ॥2॥
శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ
చిత్రమై తోచునమ్మా గౌరమ్మ ॥2॥
పాల మీగడలట్లు పానకంబు జున్ను ॥2॥
పోలేలు, మౌడీలు నులముద్దలు ॥2॥
మేలు చెక్కర గర్జలు గౌరమ్మ
మేలుగా నర్పింతురు గౌరమ్మ ॥2॥
శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ
చిత్రమై తోచునమ్మ గౌరమ్మ ॥2॥
నూటొక్క పువ్వులు కోటి నోములు నోమ ॥2॥
మేటిగా కాంతులు ఆటపాటలతోటి ॥2॥
మాటికి నిన్ను మెప్పగా గౌరమ్మ
మంగళారతులు పాడగా గౌరమ్మ ॥2॥
శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ
చిత్రమై తోచునమ్మా గౌరమ్మ ॥2॥
కోరి ఈ రీతిగా చేరి పూజింతుము ॥2॥
చారు సుందరములైన సౌభాగ్యములనిచ్చి ॥2॥
కారుణ్యము లేమిమి గౌరమ్మ
కల్పయి ఒసగు మాకు గౌరమ్మ ॥2॥
శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ
చిత్రమై తోచునమ్మా గౌరమ్మ ॥2॥
పైరు పంటలు పల్లెటూర్లలో పచ్చగా ॥2॥
పాడి ఆవులు పిల్ల పాపలతో నిండుగా ॥2॥
ఎల్ల కులముల వారిని గౌరమ్మ
చల్లగా చూడవమ్మా గౌరమ్మ ॥2॥
శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ
చిత్రమై తోచునమ్మా గౌరమ్మ ॥2॥
పాడిన వారికి పాట వినువారికి
జోడు పల్లాకిలు జడతారు గుర్రాలు ॥2॥
చూడసొంపగా గజములు గౌరమ్మ
వేడుక తోనిచ్చును గౌరమ్మ ॥2॥
చిత్రమై తోచునమ్మా గౌరమ్మ ॥2॥
భారతీ దేవివై బ్రహ్మకిల్లాలివై ॥2॥
పార్వతీ దేవివై పరమేశ్వరాణివై ॥2॥
పరగశ్రీ లక్ష్మీవై గౌరమ్మ
భార్యవైతివి హరికినీ గౌరమ్మ ॥2॥
శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ
చిత్రమై తోచునమ్మా గౌరమ్మ ॥2॥
ఎన్నెన్నో రూపాలు ఏడేడు లోకాలు ॥2॥
ఉన్న కోరికలన్నీ జనులకు సమకూర్చగా ॥2॥
కన్న తల్లివైతివి గౌరమ్మ
కామధేనువైతివి గౌరమ్మ ॥2॥
శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ
చిత్రమై తోచునమ్మ గౌరమ్మ ॥2॥
ముక్కోటి దేవతలు సక్కాని కాంతలు ॥2॥
ఎక్కువగా నిన్ను కొలిచి పెక్కు నోములు నోచి ॥2॥
ఎక్కువ వారిరైగా గౌరమ్మ
ఈ లోకమున నుండియు గౌరమ్మ ॥2॥
శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ
చిత్రమై తోచునమ్మా గౌరమ్మ ॥2॥
నల్ల వరి బియ్యం మల్లె మొగ్గలు లేత ॥2॥
తెల్ల వజ్రంబులు ముల్లోకాములనేలే ॥2॥
తల్లి నీ దంతమ్ములు గౌరమ్మ
దానిమ్మ బీజములు గౌరమ్మ ॥2॥
శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ
చిత్రమై తోచునమ్మా గౌరమ్మ ॥2॥
నిగనిగ మానేటి నగు ముఖము చూచితే ॥2॥
జగతి పున్నమినాడు చంద్రుణ్ని ఓడించి ॥2॥
సొగసైన నీ తిలకము గౌరమ్మ
చూసితే ఆనందం గౌరమ్మ ॥2॥
శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ
చిత్రమై తోచునమ్మా గౌరమ్మ ॥2॥
తమరికంటే ఎక్కువ దైవము ఎవ్వరు లేరు ॥2॥
తమకింపు పట్టింపు సకల లోకంబులా ॥2॥
క్రమముచే పాలింపగా గౌరమ్మ
కన్నుల పండుగాయే గౌరమ్మ ॥2॥
శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ
చిత్రమై తోచునమ్మా గౌరమ్మ ॥2॥
బాలలు, వృద్ధులు ప్రౌఢాంగనలు కన్నె ॥2॥
ప్రాయపుకాంతలు పరగాశ్వయుజశుద్ధ ॥2॥
పాడ్యమి మొదలుకొని గౌరమ్మ
భక్తిని అందు నిలిపి గౌరమ్మ ॥2॥
శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ
చిత్రమై తోచునమ్మా గౌరమ్మ ॥2॥
తొమ్మిది దినములు నెమ్మనంగమున పొంగి ॥2॥
అమ్మలక్కలు కూడి ఆస్తితో తమకున్న ॥2॥
సొమ్ములు ధరియించగా గౌరమ్మ
శోభనమ్మని పాడుచూ గౌరమ్మ ॥2॥
శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ
చిత్రమై తోచునమ్మా గౌరమ్మ ॥2॥
బంగారు పువ్వులు బతుకమ్మయని పేర్చి ॥2॥
మంగళంబున నిన్ను మధ్యలా నిలిపి ॥2॥
అరే రంగు రంగుల పువ్వులు గౌరమ్మ
రాశి తంగేడు పువ్వులు గౌరమ్మ ॥2॥
శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ
చిత్రమై తోచునమ్మా గౌరమ్మ ॥2॥
కట్ల పుష్పంబులు తామర పువ్వులు ॥2॥
తలగోడు పువ్వులు గన్నేరు పువ్వులు ॥2॥
పొట్ల పువ్వులు చల్లుతూ గౌరమ్మ
పొగడ పువ్వులు నింపుతూ గౌరమ్మ ॥2॥
శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ
చిత్రమై తోచునమ్మా గౌరమ్మ ॥2॥
పారిజాతంబులు పైడి తంగేడు పూలు ॥2॥
గోరెంట పున్నెలు గురివింద మల్లెలు ॥2॥
ఈరు రుద్రాక్ష పూలు గౌరమ్మ
పేరైన సుమజాతులు గౌరమ్మ ॥2॥
శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ
చిత్రమై తోచునమ్మా గౌరమ్మ ॥2॥
పన్నీరు అత్తరు పచ్చి గంధములు ॥2॥
పరిమళంబులు బుక్క బాగైన కస్తురు ॥2॥
పసుపు కుంకుమ గుప్పుతు గౌరమ్మ
పాటలెన్నో పాడుచూ గౌరమ్మ ॥2॥
శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ
చిత్రమై తోచునమ్మా గౌరమ్మ ॥2॥
పాల మీగడలట్లు పానకంబు జున్ను ॥2॥
పోలేలు, మౌడీలు నులముద్దలు ॥2॥
మేలు చెక్కర గర్జలు గౌరమ్మ
మేలుగా నర్పింతురు గౌరమ్మ ॥2॥
శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ
చిత్రమై తోచునమ్మ గౌరమ్మ ॥2॥
నూటొక్క పువ్వులు కోటి నోములు నోమ ॥2॥
మేటిగా కాంతులు ఆటపాటలతోటి ॥2॥
మాటికి నిన్ను మెప్పగా గౌరమ్మ
మంగళారతులు పాడగా గౌరమ్మ ॥2॥
శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ
చిత్రమై తోచునమ్మా గౌరమ్మ ॥2॥
కోరి ఈ రీతిగా చేరి పూజింతుము ॥2॥
చారు సుందరములైన సౌభాగ్యములనిచ్చి ॥2॥
కారుణ్యము లేమిమి గౌరమ్మ
కల్పయి ఒసగు మాకు గౌరమ్మ ॥2॥
శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ
చిత్రమై తోచునమ్మా గౌరమ్మ ॥2॥
పైరు పంటలు పల్లెటూర్లలో పచ్చగా ॥2॥
పాడి ఆవులు పిల్ల పాపలతో నిండుగా ॥2॥
ఎల్ల కులముల వారిని గౌరమ్మ
చల్లగా చూడవమ్మా గౌరమ్మ ॥2॥
శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ
చిత్రమై తోచునమ్మా గౌరమ్మ ॥2॥
పాడిన వారికి పాట వినువారికి
జోడు పల్లాకిలు జడతారు గుర్రాలు ॥2॥
చూడసొంపగా గజములు గౌరమ్మ
వేడుక తోనిచ్చును గౌరమ్మ ॥2॥
No comments:
Post a Comment